pizza
Rom Bhimana interview about Aakatayi
మ‌న క‌థ‌కు హాలీవుడ్ టెక్నిక్స్ జోడించాను - రామ్ భీమ‌న‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 March 2017
Hyderabad

రామ్ భీమ‌న తెర‌కెక్కించిన రెండో చిత్రం `ఆక‌తాయి`. స్క్రిప్ట్ నే హీరోగా న‌మ్మి ఆయ‌న తెర‌కెక్కించారు. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురువారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* ఆక‌తాయి ఎవ‌రండీ?
- హాహాహా.. అంద‌రూ అదే ప్ర‌శ్న అడుగుతున్నారు.

* మీ తొలి సినిమాకి, ఈ సినిమాకి చాలా గ్యాప్ వ‌చ్చిన‌ట్టుంది?
- అవునండీ. తొలి సినిమా పూర్త‌యిన త‌ర్వాత నేను దాదాపు రెండేళ్ల పాటు స్క్రిప్ట్ మీద కూర్చున్నాను. పెద్ద హీరోతో వెళ్దామ‌ని స్క్రిప్ట్ ప‌క్కాగా ప్రిపేర్ చేసుకున్నా.

* మ‌రి పెద్ద హీరోకి ఎందుకు వెళ్ల‌లేదు?
- ఇక్క‌డ ఏదైనా స‌క్సెస్ మాట్లాడుతుంది. అందుకే నా క‌థ‌నే హీరోగా ఫిక్స‌య్యా. ఈ క‌థ‌తో హిట్ కొట్టి మ‌రో సినిమాను మ‌ర‌లా చేద్దామ‌నుకున్నా.

* ఇందులో హైలైట్స్ ఏమి ఉంటాయి?
- మ‌న సినిమాకు హాలీవుడ్ టెక్నిక్స్ ని జ‌త‌క‌లిపి చేసిన సినిమా ఇది. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ థ్రిల్ ఫీల‌వుతారు.

* కొత్త‌వాళ్ల‌తో తీసిన సినిమాల‌కు ఆశించినంత ఓపెనింగ్స్ ఉండ‌ట్లేదుగా?
- నిజ‌మే. కానీ అది మార్నింగ్ షో వ‌ర‌కే. ఆ త‌ర్వాత మౌత్ వ‌ర్డ్ తో ఈ సినిమా స్ప్రెడ్ అవుతుంది. ప్ర‌తి ప‌ది నిమిషాల‌కూ ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఎలాంటిద‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

* హీరో ఎలా చేశారు?
- మా మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మ‌ణిశ‌ర్మ‌గారి నుంచి ప్ర‌తి ఒక్క‌రూ హీరోని పొగుడుతున్నారు. పాట‌లు చాలా బాగా వ‌చ్చాయి. అమీషాప‌టేల్ ఐట‌మ్ సాంగ్ కూడా చాలా బాగా వ‌చ్చింది.

* మీ త‌దుప‌రి ప్రాజెక్ట్ లు ఏంటి?
- స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే చెబుతాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved