pizza
RP Patnaik interview about Tulasidalam
ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ చిత్రమే ‘తులసీదళం’ – ఆర్పీ పట్నాయక్
You are at idlebrain.com > news today >
Follow Us

09 March 2016
Hyderaba
d

క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మించిన సినిమా ‘తుల‌సీద‌ళం’. కిశోర్ కంఠ‌మ‌నేని స‌మ‌ర్పిస్తున్నారు. నిశ్చ‌ల్‌, వంద‌న గుప్త‌, డా.బ్ర‌హ్మానందం, రాధారాయ‌సం, అనితా చౌద‌రి, దువ్వాసి మోహ‌న్‌, దీప‌క్ రావెళ్ళ‌, సునీల్ బ‌డ్డేప‌ల్లి, ఆర్పీ ప‌ట్నాయ‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు ఆర్పీ ప‌ట్నాయ‌క్ క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంగీతాన్నిఅందించారు. ఈ సినిమా మార్చి 11న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ తో ఇంటర్వ్యూ....

వారి కోరిక తీర్చే మూవీ....
నన్ను కలిసిన చాలా మంది మీ మ్యూజిక్ మిస్ అవుతున్నామని అంటున్నారు. అయితే అందరికీ నేను చెప్పేదేంటంటే తులసీదళం మ్యూజిక్ వింటే ఆ ఫీల్ ఫుల్ ఫిల్ అవుతుంది. రైటర్ గా చెప్పాలంటే ఎవరూ చేయని విధంగా చేయాలనే ప్రయత్నమే ఈ సినిమా. ప్రపంచంలో బ్రైటెస్ట్ ప్లేస్ లాస్ వేగాస్ లో 44రోజుల పాటు చిత్రీకరించాం. అమెరికన్స్ కూడా ఒక్కసారైనా లాస్ వేగాస్ ను చూడాలనుకునే ప్లేస్ తులసీదళం చిత్రాన్ని చిత్రీకరించాం.

ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్....
హర్రర్ అనగానే చీకటిలో చేయాలనే కాన్సెప్ట్ లో అందరూ ఆలోచిస్తారు. అయితే నేను అక్కడి నుండి మొదలు పెడితే ఎలా ఉంటుందో అని ఆలోచించి ఈ సినిమా చేశారు. బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్ ను చూసుకుంటే ప్రేమకు మించిది ఏదీ లేదు. ప్రతి ప్రేమకు ఓ ప్రాబ్లెమ్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లెమ్ ఓ హర్రర్ అయితే ఎలా ఉంటుందనే ఆలోచనతో చేసిన కథ. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ ఇది. అందరూ ఎక్కడైతే ఆపేస్తారో నేను అక్కడ నుండి ఆలోచిస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న మనలో ఒకడు సినిమా కూడా అలాగే ఉంటుంది. మనలో ఒకడు జర్నలిజంకు సంబంధించిన కథ. హీరో జర్నలిస్ట్ కాకుండా కామన్ మ్యాన్ అయితే ఎలా ఉంటుంది. కామన్ మ్యాన్ చుట్టూ మీడియా తిరిగితే ఎలా ఉంటుందని ఆలోచించి ఈ సినిమా చేశాను.

ఆలస్యం కావడానికి రీజన్...
తులసీదళంకు నేను నిర్మాతగా చేసిన తొలి సినిమా. సినిమాకు చెందిన అన్నీ విభాగాల్లో మంచి పట్టు ఉన్న నాకు ప్రొడక్షన్ గురించి అంత అవగాహన లేదు. అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. అందుకే లేట్ అయ్యింది.

అంత గొప్ప కాన్సెప్ట్....కాబట్టే టైటిల్...
సినిమాకు సరిపోయే టైటిల్ ఇది. రేపు సినిమా చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టానో అర్థమవుతుంది. దేవుడికి సరితూగగలిగే అంత గొప్పది తులసి. అలాంటి గొప్పకాన్సెప్ట్ తో సినిమా చేశానని నేను అనుకుంటున్నాను. హర్రర్ లో ఇంత కంటే గొప్ప పాయింట్ ఎవరూ చెప్పలేదని అనుకుంటాను.

RP Patnaik interview gallery

 

చిన్న ఎక్స్ పెరిమెంట్....
సినిమాను విదేశాల్లో చిత్రీకరించినా,సెంటిమెంట్స్ అన్నీ ఇండియన్ సెంటిమెంట్స్ ఉంటాయి. మన తెలుగువాళ్ళ మధ్యలో జరిగిన కథ. మరి లాస్ వేగాస్ లో తీయడానికి కారణం. అంత బ్రైట్ ప్లేస్ లో తీస్తే ఎలా ఉంటుందోనని చిన్న ఎక్స్ పెరిమెంట్.

హీరో, హీరోయిన్ రోల్స్....
హీరో నిశ్చల్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హీరోయిన్ టూరిస్ట్ గైడ్. లాస్ వేగాస్ లో మంచు కొండలున్నాయనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి విషయాలను ఇందులో చూపించాం.

యాక్టర్ అయిపోవాలని అనుకోలేదు..
ఏదో యాక్టర్ అయిపోవాలని అనుకుని సినిమాల్లో యాక్టింగ్ చేయలేదు. 2004లో శ్రీను వాసంతి లక్ష్మి, 2010లో బ్రోకర్, 2016లో తులసీదళం చేశాను. నిజంగా నటనపై ఆసక్తి ఉంటే వరుసగా సినిమాలు చేయాలి కదా, నేను చేయగలను అనుకున్న సినిమాల్లోనే నటించాను. మ్యూజిక్ చేయనని కాదు. కానీ ఈ సినిమాకు ఆర్పీ మ్యూజిక్ చేస్తే బావుంటుందని ఎవరైనా వస్తే తప్పకుండా చేస్తాను. నాకు మనం, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి సినిమాలకు సంగీతం చేయాలని ఉంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్.....
‘తులసీదళం’ రిలీజ్ అవుతుంది. అలాగే మనలో ఒకడు షూటింగ్ జరుగుతుంది, తెలుగు, కన్నడ బై లింగ్వువల్ రెడీ అవుతుంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved