pizza
Sagar interview (Telugu) about Siddhardha movie
దర్శక నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను - సాగర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

13 September 2016
Hyderaba
d

సాగర్‌, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌పై కె.వి.దయానంద్‌ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మించిన చిత్రం 'సిద్ధార్థ'. సెప్టెంబర్‌ 16న సినిమా విడుదల అవుతంది. ఈ సందర్భంగా హీరో సాగర్‌తో ఇంటర్వ్యూ.....

కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.....
- సిద్ధార్థ సినిమా సెప్టెంబర్‌ 16న విడుదలవుతుంది. సినిమా చూసుకున్నాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పరుచూరి బ్రదర్స్‌, మణిశర్మ, దయానంద్‌రెడ్డి, దాసరి కిరణ్‌కుమార్‌ వంటి ఓ మంచి టీం సాగర్‌కు ఇండస్ట్రీలో ప్లేస్‌ క్రియేట్‌ చేయాలని ఆలోచనతో చేసిన సినిమా ఇది.

'సిద్ధార్థ' మూవీ కాన్సెప్ట్‌....
- 'సిద్ధార్థ' ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ. ఈ చిత్రంలో ఓ ఎన్నారై యువకుడిగా కనిపిస్తాను. తన పని తను చేసుకునే యువకుడు అనంతపూర్‌కు ఎందుకు వెళతాడు? ఏం చేస్తాడనేదే సినిమా.

దర్శక నిర్మాతల గురించి....
- నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారు మంచి ఫ్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ఓ సినిమాకు ఆడియెన్స్‌ ఎలా రెస్పాండ్‌ అవుతారు, ఏ ఎలిమెంట్స్‌ సినిమాలో ఉండాలి...ఇలా అన్ని శాఖలపై మంచి పట్టు ఉంది.

రెండింటికీ ఉన్న తేడా అదే...
- మూడేళ్ళుగా సీరియల్స్‌ చేయడం లేదు. సీరియల్స్‌కు, సినిమాకు యాక్టింగ్‌ పరంగా పెద్ద తేడా లేదు. అయితే టెక్నికల్‌గా మాత్రం తేడా ఉంటుంది.

అదే నన్ను సినిమా వైపు నడిపించింది....
- నేను సినిమాల్లోకి పూర్తిగా ఎంటర్‌ కావాలనుకోలేదు. 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమాలో చిన్న పాత్ర చేశాను. అయితే నన్ను ఇష్టపడే ప్రేక్షకులు నా నుండి చిన్న పాత్రలను ఎక్స్‌పెక్ట్‌ చేయడం లేదని, నేను తప్పు చేశాననిపించింది. ఆ ఆలోచనే నన్ను 'సిద్ధార్థ' సినిమా వైపు నడిపించింది. ఈ సినిమా కోసం ఒక సంవత్సరం పాటు బాడీ లాంగ్వేజ్‌ పరంగా కష్టపడ్డాను.

Sagar interview gallery

ఇమేజ్‌ చట్రంలో..
- నాకు ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కోవాలని లేదు. మంచి నటుడుగా, దర్శక నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకని ఒక తరహా సినిమాల్లో కాకుండా డిఫరెంట్‌ సినిమాలను చేయాలనుకుంటున్నాను.

హీరోయిన్స్‌ గురించి...
- సాధారణంగా కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్స్‌కు అంతగా ప్రాముఖ్యత ఉండదు. కానీ ఈ సినిమాలో రాగిణి, సాక్షి చౌదరిలకు వారి వారి పాత్రల పరంగా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. రేపు సినిమా చూసిన ప్రేక్షకులకు వారి పాత్రల ప్రాధాన్యత తెలుస్తుంది.

తదుపరి చిత్రాలు...
- నా నెక్ట్స్‌ మూవీ టైటిల్‌ 'హరి'. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనపడతాను. అవ్యక్త్‌ ఫిలింస్‌, రామదూతక్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతుంది. 'సిద్ధార్థ' విడుదలైన తర్వాత ఈ సినిమా లాంచనంగా ప్రారంభమవుతుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved