pizza
Sai Dharam Tej interview about Supreme
'సుప్రీమ్' పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ - సాయిధరమ్ తేజ్
You are at idlebrain.com > news today >
Follow Us

30 April 2016
Hyderaba
d


సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా 'సుప్రీమ్'. ఫస్ట్ మూవీ 'పటాస్'తో హిట్ కొట్టిన అనిల్ రవిపూడి దర్శకత్వం వహిస్తున్న రెండవ సినిమా ఇది. 'దిల్'రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా మే 5వ తేదీన విడుదలవుతుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.

'సుప్రీమ్' ఎలా ఉంటుంది?
మొదటిసారి పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో నటించాను. 'రేయ్' మ్యూజికల్ ఎంటర్టైనర్, 'పిల్లా నువ్వులేని జీవితం' లవ్ బేస్డ్, 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు. 'సుప్రీమ్' పక్కా కమర్షియల్ మూవీ. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ నవ్విస్తూ ఉంటుంది. అదే సమయంలో సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి.

మీ క్యారెక్టర్ గురించి చెప్పండి?
క్యాబ్ డ్రైవర్ బాలు పాత్రలో నటించాను. ట్రెయిలర్ లో చెప్పిన్నట్టు వెనుక బండి వారు హార్న్ కొడితే హారర్ సినిమా చూపించే రకం. దీనికి కారణాలు ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలి. ఎక్కువ చెప్పేస్తే కథ తెలిసిపోతుంది.

'గ్యాంగ్ లీడర్' స్పూర్తిగా తీసుకున్నారా?
లేదండీ. ఇప్పటికే ఉన్న కంపేరిజన్స్ చాలు. కొత్తవి వద్దు. కథానుగుణంగా క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించానంతే.

Sai Dharam Tej interview gallery

రీమిక్స్ సాంగ్ పెట్టాలనే ఐడియా ఎవరిది?
దర్శకుడు అనిల్ రావిపూడిది. సినిమాకి 'సుప్రీమ్' టైటిల్ పెట్టిన తర్వాత ఆ సాంగ్ రీమిక్స్ చేయకపోతే ఎలా? అన్నాడు. క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడకుండా చాలా గ్రాండ్ గా షూటింగ్ చేశాం. రీమిక్స్ పాటలకు నేను అనుకూలమూ కాదు, వ్యతిరేకం కాదు. దర్శక నిర్మాతలు రీమిక్స్ ప్రతిపాదనతో వస్తే నో అనను.

'సుప్రీమ్' టైటిల్ చిరంజీవి గారిది, ఆయన సాంగ్ రీమిక్స్ చేశారు. మీపై ఒత్తిడి ఏమైనా పెరిగిందా?
ఒత్తిడి కాదు, బాధ్యత పెరిగింది. ఆడియోలో చెప్పినట్టు 'సుప్రీమ్' టైటిల్ చెప్పిన తర్వాత భయం వేసింది. చిరంజీవి మావయ్య గారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాను. కష్టపడమని భుజం తట్టారు. ప్రతి సినిమాకి కష్టపడతాను. ఈ సినిమాకి 1000శాతం కష్టపడి హిట్ చేయాలనే కసితో పనిచేశా.

సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏది?
కమర్షియల్ ఎంటర్టైనర్ అయినా అంతర్లీనంగా ఓ ఎమోషన్ క్యారీ అవుతుంది. అది నాకు బాగా నచ్చింది. రాజేంద్రప్రసాద్ గారు తండ్రి పాత్రలో అద్బుతంగా నటించారు. చిన్నపిల్లాడి క్యారెక్టర్ కూడా బాగుంటుంది.

అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్?
సూపర్. క్లారిటీ ఉన్న దర్శకుడు. ఎక్కడైనా మనకు అలసట వస్తే ఎనర్జీ ఇస్తాడు. ఎమోషన్, కమర్షియల్ అంశాలను బాగా బాలన్స్ చేశాడు.

రాశీఖన్నా కమెడియన్ పాత్రలో కనిపిస్తుందని చెప్పారు?
(నవ్వుతూ..) తన కామెడీ టైమింగ్ సూపర్ అసలు. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్లకు భిన్నమైన క్యారెక్టర్లో కనిపిస్తుంది.

ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారి 150వ సినిమా ఓపెనింగ్ కి హాజరయ్యారు. ఫీలింగ్ ఎలా ఉంది?
సాధారణంగా నిర్మాత హీరోని తీసుకొస్తారు కదా. నిన్న ఓపెనింగ్ లో చరణ్ చిరంజీవి గారిని తీసుకురావడం బ్యూటిఫుల్ ఫీలింగ్. ఆయన అలా నడిచి వస్తుంటే ఇంకా చరిష్మా తగ్గలేదనిపించింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved