pizza
Sai Dharam Tej interview (Telugu) about Winner
ప‌డ్డ ప్ర‌తిసారీ అమ్మ గుర్తుకొచ్చింది - సాయిధ‌ర‌మ్‌తేజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2017
Hyderabad

వ‌రుస విజ‌యాల‌తో జాగ్ర‌త్త‌గా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ హీరో తాజాగా న‌టించిన చిత్రం `విన్న‌ర్`. ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.

*ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది?
- ఈ సినిమా హిట్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంద‌రికీ ఈ సినిమా న‌చ్చింది. మీకు, జె.బి.గారి మ‌ధ్య సీన్లు చాలా బావున్నాయని చాలా మంది చెప్పారు.

* ఏం న‌చ్చి ఈ సినిమాను ఒప్పుకున్నారు?
- నాకు సెకండాఫ్ ఫ్లో న‌చ్చింది. గుర్రాల బ్యాక్ డ్రాప్ కొత్త‌గా అనిపించింది.

* మీరు ఇంత‌కు ముందే హార్స్ రైడింగ్‌లో శిక్ష‌ణ తీసుకున్నారా?
- చిన్న‌ప్పుడు మా అమ్మ నాకు ట్ర‌యినింగ్ ఇప్పించారు.

* ఈ సినిమా కోసం స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకున్నారా?
- క్లైమాక్స్ చేస్తున్న‌ప్పుడు ఒన్ డే రిహార్స్ ల్స్ కి టైమ్ దొరికింది. క‌ల‌యాన్ అని హాలీవుడ్ మాస్ట‌ర్ నాకు చాలా బాగా ట్ర‌యినింగ్ ఇచ్చారు.

*గుర్రాల స్వారీ భ‌య‌మ‌నిపించ‌లేదా?
- గుర్రాల మీద కాస్త భ‌య‌మేసింది. అంటే ఆ ఎక్స్ పెక్టేష‌న్స్ కి స‌రిపోతానా? లేదా అని కొద్దిగా భ‌య‌మేసింది. కానీ ఆ మాస్ట‌ర్ నాకు బాగా స‌పోర్ట్ చేశారు. సీన్లు చేయ‌గా చేయ‌గా నాకు కూడా బాగా అల‌వాటైపోయింది.

* తొలిరోజు వ‌సూళ్లు మీ గ‌త రికార్డులను దాటేశాయ‌ట‌గా?
- నేనెప్పుడూ రికార్డుల‌ను గురించి ఆలోచించ‌ను. సినిమా బావుండాలి, అంద‌రూ ఎంట‌ర్‌టైన్ కావాల‌ని అనుకుంటాను.

* సినిమా చూసి మీ అమ్మ ఏమ‌న్నారు?
- అమ్మ చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ఆమె నాకు ఎప్పుడూ స‌పోర్ట్ చేస్తూనే ఉంటుంది.

* మీ చిత్రాల‌ను చూసి ఎవ‌రు విమ‌ర్శిస్తుంటారు?
- సినిమాలో బిగ్గెస్ట్ క్రిటిక్ మా అమ్మ‌, మా త‌మ్ముడు, నా బెస్ట్ ఫ్రెండ్ న‌వీన్‌. నందిని న‌ర్సింగ్ హోమ్ చేసిన హీరో. ఈ సినిమా వాళ్ల ముగ్గురికి న‌చ్చింది. వాళ్లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటంటే డ్యాన్సులు ఇంకాస్త బాగా చేసి ఉండ‌వ‌చ్చు అని అన్నారు.

* మీ మావ‌య్య‌లు సినిమాలు చూశారా?
- చిరంజీవిగారికి ఆరోగ్యం బాగోలేక చూడ‌లేదు. ఇవాళో, రేపో చూస్తాన‌న్నారు. ప‌వ‌న్ గారు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

* ఇందులో కొన్ని డైలాగులు మీ ఫ్యామిలీకి సంబంధించిన‌వి ఉన్నాయి. మీరు స‌జెస్ట్ చేశారా వాటిని?
- నేను డైలాగుల గురించి, క‌థ గురించి ఏదీ డిస్క‌స్ చేయ‌ను. వాళ్లు ఏం చెబితే అదే చేస్తా. నేనెప్పుడూ ఆర్గ్యూ చేయ‌ను.

* ఓపెనింగ్స్ బానే వ‌చ్చాయి కానీ, త‌ర్వాత వ‌సూళ్లు కాస్త త‌గ్గాయ‌ని అంటున్నారు..
- నిజంగా అలా ఉంటే నేనివాళ ఇక్క‌డ వ‌చ్చి మాట్లాడ‌ను. లేనిదాన్ని చెప్పాల్సిన అవ‌స‌రం నాకు లేదు. క‌మ‌ర్షియ‌ల్‌గా బావుంది. నిర్మాత‌లు హ్యాపీగా ఉన్నారు.

* మీ గ‌త సినిమాల రేంజ్‌కి ఈ సినిమా చేరుతుందా?
- ఏమోనండీ. క‌లెక్ష‌న్ల ప‌రంగా అంత ఆలోచించ‌ను. నా ప‌ని చేశానా? జ‌నాల‌ని ఎంట‌ర్‌టైన్ చేశానా? లేదా? అని అనుకుంటాను.

* గుర్రాల మీద నుంచి ప‌డ్డారా?
- నాలుగు సార్లు ప‌డ్డాను. ప‌డ్డ ప్ర‌తిసారీ మా అమ్మ గుర్తుకొచ్చింది. రెస్ట్ తీసుకోవాల‌నుకున్నా.. రెస్ట్ తీసుకునేటంత టైమ్ లేదు.

Sai Dharam Tej interview gallery

* మీ గుర్రం పేరు ఏదో ఉంది...
- ట‌ర్కీలో వాడిన గుర్రం పేరు టోరో.

* ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు ప్రెజ‌ర్ ఫీల‌య్యారా?
- ఎప్పుడూ ప్రెజ‌ర్ లేదు. ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉందా? లేదా? అని ఆలోచిస్తా. అంతేగానీ క‌మ‌ర్షియ‌లా ? ఆర్ట్ సినిమానా? అని ఆలోచించ‌ను.

* తిక్క సినిమా తర్వాత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారా?
- అలాంటిదేమీ లేదండీ. వాళ్లు నాకు చెప్పిన క‌థ చాలా బావుంది. కానీ సినిమా మీద‌కు ట్రాన్స‌లేట్ చేయ‌డంలో ఏదో ఇబ్బంది క‌లిగింది అంతే.

* ర‌కుల్‌తో ఎలా అనిపించింది?
- త‌ను చాలా బాగా చేసింది. త‌ను, నేను,సందీప్‌, రాశీ, ర‌కుల్ మేమందరం ఒకేసారి జ‌ర్నీ మొద‌లుపెట్టాం. కాబ‌ట్టి స‌ర‌దాగా చేశాం.

* జ‌గ‌ప‌తిబాబుగారితో ఎలా అనిపించింది?
- చాలా హ్యాపీగా చేశాం. త‌ను కూడా నాతో చ‌నువుగా ఉన్నారు. ఎక్క‌డైనా ఒక్క టేక్ ఎక్కువ కావాల‌న్నా ఏమీ అన‌లేదు. నేను సెట్‌లో ఉన్నంత సేపు కొడుకులాగానే బిహేవ్ చేశాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved