pizza
Sai Karthik about Next Nuvve
కంటెంట్‌ని బట్టే మ్యూజిక్‌ వస్తుంది - సాయికార్తీక్‌
You are at idlebrain.com > news today >
Follow Us

15 October 2017
Hyderabad

భారీ చిత్రాల నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్‌, యు.వి.క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ కలిసి వి4 క్రియేషన్స్‌ పేరుతో ఓ కొత్త చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బేనర్‌పై 'నెక్స్‌ట్‌ నువ్వే' పేరుతో ఓ హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఆది, వైభవి శాండిల్య, రష్మీ గౌతమ్‌, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి టి.వి. యాంకర్‌, నటుడు ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మాత. నవంబర్‌ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ మీడియాతో ముచ్చ‌టించారు. మీడియాతో సాయికార్తీక్ మాట్లాడుతూ ..``ఇది నా 60వ సినిమా. అయితే `పైసా` సినిమా నాకు పర్‌ఫెక్ట్‌ బ్రేక్‌ అని చెప్పాలి. నెక్స్‌ట్‌ పటాస్‌ కమర్షియల్‌ హిట్‌. ఆ తర్వాత వరసగా చాలా హిట్‌ సినిమాలు చేశాను. కమర్షియల్‌ మ్యూజిక్‌ పక్కాగా చేస్తాను అని ప్రూవ్‌ చేసే సినిమా రాజా ది గ్రేట్‌. దీని తర్వాత వచ్చే సినిమా `నెక్స్‌ట్‌ నువ్వే`. మూడు పెద్ద బేనర్స్‌ కలిసి చేస్తున్న సినిమాకి నేను మ్యూజిక్‌ చెయ్యడం చాలా హ్యాపీగా వుంది.బన్నీ వాసుగారు, ప్రభాకర్‌గారు కథ చెప్పారు. వాసుగారి కాంపౌండ్‌లో సౌండ్‌ మీద ఎక్కువ వర్క్‌ చేస్తారు. ఇంతకుముందు `శ్రీరస్తు శుభమస్తు` సినిమాకి పనిచేశాను. అది చూసి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. సౌండ్‌ మీద వారికి మంచి గ్రిప్‌ వుండడంతో మంచి సాంగ్స్‌ చెయ్యగలిగాను. మెలొడీ సాంగ్స్‌ చేసే అవకాశం రావడం అదృష్ణం అని నేను చాలాసార్లు చెప్పాను. ప్రతి మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అన్ని రకాల పాటలు చెయ్యాలని వుంటుంది. ఆ ఛాన్స్‌ రావడం అనేది గొప్ప విషయం. ఇందులో 'అలా మేడమీద' అనే ఫుల్‌ మెలోడీ సాంగ్‌ చేశాను. 'డబ్బే..' అనే పాట లిరిక్‌ మీద వెళ్తుంది. ఈ పాటలు యూనిట్‌లోని అందరికీ నచ్చాయి. సినిమాని చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తాను. అందుకే ఆర్‌ఆర్‌ బాగా చెయ్యగలుగుతాను. చిన్నప్పుడు కూడా సినిమాకి వెళ్ళినపుడు పాటల గురించి కాకుండా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌నే చూసేవాడిని. ఆర్‌ఆర్‌ మీద నాకు ఏ లెవల్‌లో ఇంట్రెస్ట్‌ వుందంటే 'లగాన్‌' చిత్రాన్ని రెండు రోజుల్లో 8 సార్లు కంటిన్యూగా చూశాను. మొదటి నుంచి ప్రభాకర్‌గారు అన్ని శాఖల్లో వున్నారు కాబట్టి కొత్త డైరెక్టర్‌ అనే ఫీలింగ్‌ ఎక్కడా రాలేదు. ఆయనకు ఏం కావాలో క్లియర్‌గా చెప్తారు. `రాజా ది గ్రేట్‌` దిల్‌రాజుగారితో నా రెండో సినిమా. ఇంతకుముందు `సుప్రీమ్‌` చేశాను. ఈ సినిమాలో సిట్యుయేషన్‌ సాంగ్స్‌ ఎక్కువగా వున్నాయి. అలాగే కమర్షియల్‌ మీటర్‌ కూడా వుంటుంది. ఇది నాకు ఓ ఛాలెంజింగ్‌ మూవీ అని చెప్పొచ్చు. ఇందులో హీరోకి చూపు వుండదు. సౌండ్‌ బ్యాలెన్స్‌ చేస్తూనే వెళ్ళాలి. ఫుల్‌ లెంగ్త్‌ మూవీ అలాగే చేశాను. మ్యూజిక్‌ని జడ్జ్‌ చెయ్యడం అనేది ఏమీ వుండదు. కంటెంట్‌ని బట్టే మ్యూజిక్‌ వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో ఐడెంటిటీ వుంటుంది. అది సినిమా కంటెంట్‌ని బట్టే వస్తుంది తప్ప మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఒకదానికి ఫిక్స్‌ అయి వుండరు. నాకు బాగా ఇష్టమైన సంగీత దర్శకులు రెహమాన్‌గారు, ఇళయరాజాగారు. తెలుగులో చెప్పాలంటే మణిశర్మగారికి ఏకలవ్య శిష్యుడ్ని`` అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved