pizza
Sai Karthik interview about Raja Cheyyi Vesthe
పెద్ద సినిమా కోసం వెయిట్ చేస్తున్నా - సాయి కార్తిక్‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 April 2016
Hyderaba
d

కాల్ సెంట‌ర్ చిత్రంతో ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన సంగీత ద‌ర్శ‌కుడు సాయికార్తిక్ `రాజా చెయ్యి వేస్తే`తో 50 సినిమాల‌ను పూర్తి చేసుకుంటున్నారు. ఆ సినిమా ఈ వారంలోనే విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సాయికార్తిక్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* మీ 50 సినిమా ప్ర‌స్థానం గురించి చెప్పండి?
- 2008లో నేను ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టాను. ఆ లెక్క‌న చాలా త్వ‌ర‌గా 50వ మైలురాయిని చేరుకున్న‌ట్టే. సినిమా పెద్ద‌దా? చిన్న‌దా? అని ఎప్పుడూ ఆలోచించ‌లేదు. నా వ‌ద్ద‌కు వ‌చ్చిన సినిమాల‌ను చేసుకుంటూ ముందుకు వెళ్లాను. 5 సినిమాలు క‌న్న‌డ ఉన్నాయి. 15 సినిమాల‌కు బ్యాక్‌గ్రౌండ్ చేశాను. మిగిలినవి ట్యూన్లు, నేప‌థ్యం రెండూ అందించిన సినిమాలు. నా సినిమాల్లో ప‌నితీరు న‌చ్చిన వారు న‌న్ను వారి త‌దుప‌రి సినిమాల‌కు పెట్టుకున్నారు. అలా నేను ఇక్క‌డిదాకా చేరుకున్నాను.

* మీకు బాగా తృప్తినిచ్చిన సినిమాలేంటి?
- పైసా, రౌడీ, ప్ర‌తినిధి, అసుర‌, రాజుగారిగ‌ది, జండాపై క‌పిరాజు, ఈడోర‌కం ఆడోర‌కం, సుప్రీమ్‌.. ఇలా అన్నీ తృప్తినిచ్చిన‌వే.

కృష్ణ‌వంశీగారి సినిమాకు, రామ్‌గోపాల్‌వ‌ర్మ‌గారి సినిమాకు ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా అనిపించింది.

* కొత్త సింగ‌ర్స్ ని ప‌రిచ‌యం చేస్తార‌ట క‌దా?
- అవునండీ. మ‌న ద‌గ్గ‌ర లోక‌ల్ టాలెంట్ చాలా ఉంది. డ్యూయ‌ట్‌లో ఒక‌రు పెద్ద సింగ‌ర్ అయితే ఆపోజిట్ కొత్త సింగ‌ర్‌కి అవ‌కాశం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తా. నా ద‌గ్గ‌ర ముందు ట్రాక్‌లు పాడి ఆ త‌ర్వాత సినిమాల్లో పాట‌లు పాడిన వారు ఉన్నారు.

Sai Karthik interview gallery

* నారా రోహిత్ సినిమాల‌న్నీ వ‌రుస‌గా మీరే చేస్తున్న‌ట్టున్నారు?
- శంక‌ర‌తో మా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆయ‌న‌కు ప‌ని న‌చ్చ‌డంతో వ‌రుస‌గా చేస్తున్నాను.

* రాజా చెయ్యివేస్తే 50వ సినిమా అని ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌లేమైనా తీసుకున్నారా?
- ఈ సినిమా పూర్తయిన త‌ర్వాత లెక్కేస్తే 50వ సినిమా అని తేలిందండీ.

* ఎక్కువ‌గా లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్ తో సినిమాలు చేస్తారా?
- అవునండీ. వీలైనంత వ‌ర‌కు చేస్తాను. నేను బేసిగ్గా లైవ్ రిథ‌మ్ ప్లేయ‌ర్‌ని కాబ‌ట్టి అలా చేయ‌డానికే ట్రై చేస్తాను.

* లైవ్ ఎక్కువ‌గా మ‌ద్రాసులో చేయ‌డానికి ఏమైనా కార‌ణాలున్నాయా?
- మ‌న ద‌గ్గ‌ర 100 మంది వ‌యొలిన్ వాయించేవాళ్లు దొర‌క‌రు. అక్క‌డుంటారు. కొంత‌మంది అక్క‌డా, ఇక్క‌డా ష‌ఫుల్ అవుతుంటారు. కాబ్టి అక్క‌డే చేస్తుంటాను. ఇక్క‌డ వీల‌వుతుందంటే ఇక్క‌డే చేసేస్తాను.

* రీమిక్స్ల్ చేయ‌డంలో ఇబ్బందులుంటాయా?
- రీమిక్స్ లు చాలా జాగ్ర‌త్త‌గా చేయాలి. ఎందుకంటే అభిమానులు హ‌ర్ట్ అవుతారు. అందుకే నేను చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాను. మెయిన్ ఎస్సెన్స్ పోకుండా బీజీఎంలు మార్చి చేస్తాను.

* మీరు చేసిన వాటిలో టాప్ 5 పాట‌లు చెప్పమంటే?
- పైసాలో నీతో ఏదో, రౌడీలో నీ మీద ఒట్టు, ప‌టాస్‌లో క‌మ‌ర్షియ‌ల్ సాంగ్స్, కృష్ణ‌వంశీ సినిమాల్లో మెలోడీ పాట‌ల‌న్నీ నాకు ఇష్ట‌మేనండీ.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved