pizza
Sai Krishna Pendyala Interview (Telugu) about Seema Raja
`సీమ‌రాజా`తో స‌క్సెస్ సాధిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది - సాయికృష్ణ పెండ్యాల
You are at idlebrain.com > news today >
Follow Us

4 February 2019
Hyderabad

లక్ష్మీ పెండ్యాల సమర్పణలో సాయికృష్ణా ఫిలిమ్స్‌ బ్యానేర్‌ ఫై సాయికృష్ణ పెండ్యాల నిర్మాతగా శివకార్తికేయన్‌, సమంత, కీర్తిసురేష్‌లు హీరోహీరోయిన్లుగా పొన్‌రాం దర్శకత్వంలో తెరకెక్కిన `సీమరాజా` సినిమాను తెలుగులో ఫిబ్రవరి8 న విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత సాయికృష్ణ పెండ్యాల ఇంటర్వ్యూ.

డిస్ట్రిబ్యూటర్‌ నుండి ప్రొడ్యూసర్‌ అయ్యారు కదా ప్రొడ్యూసర్‌గా ఇది ఎన్నో సినిమా?
- నేను నిర్మాతగా 'దండుపాళ్యం- 3', అర్జున్‌ 150వ సినిమా 'కురుక్షేత్రం', 'మారి-2' తరువాత 'సీమరాజా' నిర్మాతగా నా నాలుగవ సినిమా. మంచి స‌క్సెస్ సాధిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది.

సీమరాజా సినిమాను తెలుగులో విడుదల చేయడానికి ముఖ్య కారణం?
- ఈ సినిమాను నేను తెలుగులో విడుదల చేయడానికి కారణం చెన్నెలో ఉండే నామిత్రుడు. తనుఈ సినిమాలో ఒక డైలాగ్‌ ''మనిషి బ్రతకాలంటే మిత్రుడు ఎంత ముఖ్యమో.. శత్రువు అంతే ముఖ్యం''. నాకు పంపడం జరిగింది. ఆ డైలాగ్‌ విని ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేద్దాం అని నిర్ణయించుకున్నాను. కానీ కుదరలేదు.

సీమరాజ తమిళ్‌ వెర్షన్‌కు చేంజెస్‌ చేశారా?
- అవునండి! తమిళ్‌ సినిమా చూసిన ఫీలింగ్‌ ఉండకూడదు అని ఈ సినిమాను దాదాపు 45 నిమిషాలు ట్రిమ్‌ చేయడం జరిగింది. ఆరు పాటలను చంద్రబోస్‌ గారు, వెన్నెలకంటి గారు రాయడం జరిగింది. శ్రేయగోషల్‌తో పాడించడం జరిగింది. డబ్బింగ్‌ కూడా చాలా చక్కగా కుదిరింది.

ఆడియో, ట్రైలర్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంది?
- ఆడియోకి తెలుగులో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ సినిమాలో మేం విడుదల చేసిన 'వన్నెలాడి' పాట ఒక్కరోజులోనే వన్‌ మిలియన్‌ వ్యూస్‌ను రాబట్టుకుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

ఈ సినిమాలో నటీనటుల గురించి?
- హీరో శివకార్తికేయన్‌ తెలుగులో మొదటి సినిమా 'రెమో' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు పొనురాం హీరో శివకార్తికేయన్‌ మూడు మంచి హిట్‌ సినిమాలు ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమాలో సమంత టీచర్‌గా నటించి అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో సమంత యాక్షన్‌ సీన్స్‌లో అద్భుతంగానటించింది. ఈ సినిమాలో కీర్తీసురేష్‌ 30 నిమిషాలపాటు యువరాణి గెటప్‌లో నటించింది. హీరోతండ్రి పాత్రలో నెపోలియన్‌ నటించారు. ప్రధానంగా సిమ్రాన్‌ గారు ఈ సినిమాలో నెగటివ్‌ క్యారెక్టర్‌ చేసింది. తన డైలాగ్స్‌ ద్వారా అందరిని థ్రిల్‌ చేస్తుంది.

ఈ సినిమాను ఎన్ని థియేటర్స్‌లో విడుదలచేస్తున్నారు?
-నాది డిస్ట్రిబ్యూటర్‌గా18 సంవత్సరాల అనుభవం. 300 పైగా సినిమాలకు విడుదల చేశాను. సీమరాజా సినిమాను ఒక్క నైజం లోనే 130 థియేటర్స్‌తో రెండు రాష్ట్రాల్లో 400 థియేటర్స్‌కు పైగా విడుదలచేస్తున్నాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved