pizza
Sailesh interview about Chal Chal Gurram
కారు రేసింగే సుల‌భం - శైలేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 October 2016
Hyderaba
d

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మించిన చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. శుక్ర‌వారం విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి హీరో శైలేష్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

``మా నిర్మాత రాఘ‌వ‌య్య‌గారు జ‌న‌సేన పార్టీలో ట్రెజ‌ర‌ర్‌. జ‌న‌సేన పార్టీ మీటింగ్ ఉంటే నేను మామూలుగా రాఘ‌వ‌య్య‌గారితో వెళ్లి క‌లిశాను. ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారితో ప‌ది నిమిషాలు మాట్లాడాను. సినిమా ట్రైల‌ర్‌ని చూపించాం. ఆడియో కొద్దిగా విన్నారు. `కాట‌మ‌రాయుడు` షూటింగ్‌లోనూ వెళ్లి క‌లిశాం. ఆయ‌నకు సినిమా కాస్ట్యూమ్స్ లో స్టిల్ ఇవ్వ‌డం ఇష్టం ఉండ‌దు. అంత బిజీ షెడ్యూల్‌లోనూ డ్ర‌స్ మార్చుకుని వ‌చ్చి ఫోటో ఇచ్చారు. ఈ సినిమాలో నా పేరు మ‌నోహ‌ర్‌. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి కూడా రెండు కంపెనీల్లో ఒకేసారి ప‌నిచేస్తుంటాడు. రెండు కంపెనీలు ఒకే బిల్డింగ్‌లో ఉంటాయి. పైనొక‌టి, కిందొక‌టి.. రెండు చోట్లా గ‌ర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఈ రెండు కంపెనీల‌ను త‌ప్పించుకుని ఎలా తిరుగుతాడు? దొర‌క్కుండా ఎలా తిరుగుతాడు? అనేది ఆస‌క్తిక‌రం. చ‌ల్ చ‌ల్ గుర్రం అనేది దాని గురించే పెట్టారు. ముకుంద త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని చేశాను. మా నాన్న‌గారు బిజినెస్ మానేసి నన్నే చూసుకోమ‌న్నారు. ట్రాన్స్ పోర్ట్ బిజినెస్‌, లాజిస్టిక్స్ షిప్పింగ్ అని ఇంకో బిజినెస్ ఉంది. అది కాకుండా నేను కార్ రేసింగ్‌లో మూడు సార్లు నేష‌న‌ల్ చాంపియ‌న్‌. సో నేను అటూ ఇటూ తిరుగుతుండ‌టంతో సినిమాల్లో కాసింత బ్రేక్ వ‌చ్చిన‌ట్టు అనిపించింది. నేను రేస్‌లో ఉన్న‌ప్పుడు ఒక‌సారి ఏదో టీవీకి ఇంట‌ర్వ్యూ అడిగారు. అది చూసి మా నాన్న‌గారి ఫ్రెండ్ నాకు ట్రెయినింగ్ ఇప్పించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. సో న‌న్ను స‌త్యానంద్ గారి ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి కెమెరాను ఫేస్ చేయ‌డం నేర్ప‌మ‌న్నారు. అలా విడివిడిగా నేర్ప‌డం కుద‌ర‌ద‌ని, కావాలంటే మూడు నెల‌లు ట్ర‌యినింగ్ ఇస్తాన‌ని చెప్పారు స‌త్యానంద్‌గారు. సో నేను అలా మూడు నెల‌లు శిక్ష‌ణ తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆ మూడు నెల‌లు కూడా వ‌రుస‌గా చేయ‌లేదు. ఎందుకంటే మ‌ధ్య‌లో నా క‌మిట్‌మెంట్స్ ఉండేవి. సో మూడు నెల‌లు కాలం కాస్తా తొమ్మిది నెల‌లు అయింది. అలా నేను ట్ర‌యినింగ్ తీసుకుంటూ ఉండ‌గా మ‌ధ్య‌లో ఒక‌సారి శ్రీకాంత్ అడ్డాల గారు మాస్టార్‌గారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ముకుంద‌లో కేర‌క్ట‌ర్ కోసం ఎవ‌ర‌న్నా ఉన్నారా అని అడిగార‌ట‌. అప్పుడు న‌న్ను పిలిపించారు. న‌చ్చి చేయ‌మ‌న్నారు. ఆ త‌ర్వాత ఈ ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం ఆఫ‌ర్ వ‌చ్చింది. మ‌రోవైపు సినిమాల్లో నెగ‌టివ్ కేర‌క్ట‌ర్ చేయ‌మ‌ని కూడా అడుగుతున్నారు. ఆలోచించి చెప్తాన‌ని అన్నా. నా దృష్టిలో కారు రేసింగ్ చాలా సుల‌భం. న‌ట‌నే క‌ష్టం.`` అని అన్నారు.

Sailesh interview gallery

నాగ‌బాబు, బెన‌ర్జీ,ముక్త‌ర్ ఖాన్, ప్ర‌వీణ్‌, సుడిగాలి సుధీర్, చిత్రం శ్రీను,అశోక్ కుమార్

కొరియోగ్ర‌ఫీః ర‌ఘు మాస్ట‌ర్, ప్ర‌దీప్ ఆంటోనీ మాస్ట‌ర్, భాను మాస్ట‌ర్ త‌దిత‌రులు నటించిన ఈ సినిమాకు ఎడిట‌ర్ః శంక‌ర్, సినిమాటోగ్ర‌ఫీః వి. శ్యామ్ ప్ర‌సాద్, ఆర్ట్ః జె.కె. మూర్తి, సంగీతంః వెంగి, ఫైట్స్ః రామ్ సుంక‌ర, ప్రొడ్యూస‌ర్ః రాఘ‌వయ్య‌, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః మోహ‌న ప్ర‌సాద్.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved