pizza
Sai Teja Desiraju interview (Telugu) about Kalki
నా ద‌గ్గ‌ర ఉన్న‌వ‌న్నీ థ్రిల్ల‌ర్ క‌థ‌లే - సాయి తేజ దేశిరాజు
You are at idlebrain.com > news today >
Follow Us

3 July 2019
Hyderabad

రాజ‌శేఖ‌ర్ హీరోగా ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం `క‌ల్కి`. ఈ సినిమాకు క‌థ‌ను అందించారు సాయితేజ దేశిరాజు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన సాయి తేజ దేశిరాజు సీఏ చేస్తున్నారు. క‌థ‌ల మీద ఆస‌క్తితో ఇటీవ‌ల క‌హానియా డాట్ కామ్లో `క‌ల్కి` పేరుతో ధారావాహిక రాశారు. అది న‌చ్చిన ప్ర‌శాంత్ వ‌ర్మ రాజ‌శేఖ‌ర్ చిత్రానికి అప్రోచ్ అయ్యారు. ఈ సినిమా గురించి సాయి తేజ దేశిరాజు హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* నాకిప్పుడు 26 ఏళ్లు. మా నాన్న ప్ర‌భుత్వోద్యోగిగా చేసి రిటైర్ అయ్యారు. సీఏ చ‌దువుతున్నా. క‌థ‌లు రాయ‌డంలో ఆస‌క్తి క‌లిగింది. అందుకే రాయ‌సాగాను. నా క‌థ న‌చ్చి ప్ర‌శాంత్ వ‌ర్మ అప్రోచÆÆóÿయ‌$అయ్యారు. ఆయ‌న‌తో `అ!` సినిమాకు ప‌నిచేశాను.

* క‌ల్కిని ముందు ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు మూడున్న‌ర గంట‌ల సేపు నెరేష‌న్ ఇచ్చాను. 2018 శ్రీరామ‌న‌వ‌మి రోజు రాజ‌శేఖ‌ర్‌కు క‌థ చెప్పారు. రాత్రి 10.30కు క‌థ చెప్ప‌డం మొద‌లుపెడితే అర్ధ‌రాత్రి దాటాక 1 గంట వ‌ర‌కు కూడా ఆయ‌న వింటూ ఉన్నారు. ఆ అనుభూతిని మ‌ర్చిపోలేను

* నా ద‌గ్గ‌ర మ‌రికొన్ని క‌థ‌లు కూడా ఉన్నాయి. వాటిలోనూ కాప్ స్టోరీలే ఎక్కువ‌. థ్రిల్లింగ్ క‌లిగించే క్లైమాక్స్ తో రాసుకున్నాను. ఇటీవ‌ల బాలీవుడ్‌లోఅబ్బాస్ మ‌స్తాన్‌కు ఓ క‌థ చెప్పా. వారికి న‌చ్చింది. త్వ‌ర‌లోనే అగ్రిమెంట్ అవుతుంది. అలాగే `కార్తికేయ‌` సినిమా తీసిన కార్తికేయ శ్రీనివాస్‌కు కూడా ఓ క‌థ ఇచ్చారు. అగ్రిమెంట్ కూడా అయ్యింది. ఇంకో పెద్ద హీరోకు ఓ క‌థ రెండు రోజుల‌లో చెప్ప‌బోతున్నా.

* నేను ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి నా ద‌గ్గ‌ర ఉన్న‌వ‌న్నీ చాలా పెద్ద క‌థ‌లు. అందుకే చిన్న క‌థ చేసుకుని డైర‌క్ష‌న్ చేయాల‌ని కూడా ఉంది.

* నాకు చిన్న‌ప్ప‌టి నుంచి షెర్‌లాక్ హోమ్స్ క‌థ‌లు చ‌ద‌వ‌డం అల‌వాటు. అలాగే తెలుగులో క‌మ్యూనిజం సాహిత్యాన్ని కూడా ఎక్కువ‌గా చ‌దివేవాడిని.

* మా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి కృష్ణా న‌ది, న‌ల్ల‌మ‌ల అడ‌వులు వంటివ‌న్నీ చాలా అందంగా ఉంటాయి. మా ప్రాంతం పేర్ల‌తో సినిమా రావ‌డం చాలా ఆనందంగా అనిపించింది. మావాళ్లంద‌రూ ఊళ్లో ఒక థియేట‌ర్ ముందు క‌టౌట్ పెట్ట‌డాన్ని కూడా మ‌ర్చిపోలేను.

* త్వ‌ర‌లోనే రాజ‌శేఖ‌ర్‌గారికిఇంకో క‌థ‌ను చెబుతాను. క‌ల్కికి సీక్వెల్ క‌థ సిద్ధం చేయాల‌ని ఉంది.

* నా చిన్న‌త‌నంలో నేను విన్న న‌క్స‌లిజం క‌థను, మ‌రికొన్ని య‌థార్ధ క‌థ‌ల‌ను ఆధారంగా చేసుకుని `క‌ల్కి` సినిమా రాశాను.

* ఇంత చిన్న వ‌య‌సులో నా ఎదుగుద‌ల‌ను చూసి మా వాళ్లంద‌రూ చాలా ఆనందంగా ఉన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved