pizza
Samantha interview (Telugu) about Majili
`రెగ్యుల‌ర్‌`అనే ప‌దం... నా డిక్ష‌న‌రీలో లేదు - స‌మంత‌
You are at idlebrain.com > news today >
Follow Us

30 March 2019
Hyderabad

నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్ల‌య్యాక జంట‌గా న‌టించిన చిత్రం `మ‌జిలి`. ఈ సినిమా గురించి, వైవాహిక జీవితం గురించి, త‌న అభిరుచుల గురించి స‌మంత శ‌నివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* పెళ్ల‌య్యాక మొద‌టి సినిమా. సెట్లో ప్రొఫెష‌న‌ల్‌గా ఉండ‌టం క‌ష్టంగా అనిపించిందా?
- చైత‌న్య వేపు నుంచి లేదు. కానీ నా వైపు నుంచి కొంచెం క‌ష్ట‌మే. ఎందుకంటే ఇంత‌కు ముందు మోనిట‌ర్ చూస్తే నేను నా పెర్ఫార్మెన్స్ మాత్ర‌మే చూసేదాన్ని. కానీ `మ‌జిలీ`లో నా పెర్ఫార్మెన్స్ క‌న్నా చైత‌న్య పెర్ఫార్మెన్స్ ను చూసి `ఇది ఓకే క‌దా ఇది ఓకే క‌దా` అని ఎగ్జ‌యిట్ అవుతూ అడిగేదాన్ని. దానికి ఆయ‌న `ఏయ్ రిలాక్స్ గా ఉండు. డైర‌క్ట‌ర్ చూసుకుంటారు` అని అనేవారు. అది ప్రొటెక్టివ్ ఇన్‌స్టింక్స్ అన్న‌మాట‌. దానివ‌ల్ల కాస్త ఆయ‌న‌కి ఇరిటేష‌న్ అన్న‌మాట‌.

* ఇప్పుడు మీ పెళ్ల‌య్యాక చేసే తొలి క‌థ ఇది... క‌థని క‌రెక్ట్ గా ఎంపిక చేశామ‌ని అనుకుంటున్నారా?
- ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌డం నాక అంత ఇష్టం లేదు. ఎక్స్ పెక్టేష‌న్స్ ఉంటాయి. వాటిని అంత తేలిగ్గా మ‌నం సంతృప్తిప‌ర‌చ‌లేం అని అనిపించింది. ఇప్పుడు మేమిద్ద‌రం ఒక‌రినొక‌రు చూసుకోవ‌డం, ప్రేమ‌లో ప‌డ‌టం వంటి సినిమాలు చేస్తే ఎవ‌రు చూస్తారు? క‌లిసి చేస్తే ఏదైనా కొత్త‌గా చేయాలి. `మ‌జిలి` అలాంటి కొత్త క‌థే. నాకు పెళ్ల‌యి రెండేళ్ల‌యింది. నాకు పెళ్లికి ముందు, పెళ్లి త‌ర్వాత ఉన్న ప్రేమ‌కు తేడా గుర్తించ‌గ‌లుగుతున్నా. పెళ్ల‌య్యాక నేను అనుభ‌విస్తున్న ప్రేమ నాకు ఓ సెక్యూరిటీగా ఉంది. మ‌న‌శ్శాంతిగా ఉంది. పెళ్లికి ముందు ప్రేమలో ఉన్న హైస్ వంటివి ఇప్పుడు లేక‌పోవ‌చ్చు, కానీ భ‌ద్ర‌తాభావాన్ని మాట‌ల్లో చెప్ప‌లేం. పెళ్ల‌యిన త‌ర్వాత ప్రేమ‌లో ఒక అందం ఉంటుంది. ఈ ప్రేమ‌ను ఎందుకు చాలా మంది సినిమాల్లో చెప్ప‌డం లేదు అని అనిపించింది. ఒక‌మ్మాయికి పెళ్ల‌య్యాక కేవ‌లం భ‌ర్త‌తో ప్రేమ కాదు.. ఆ కుటుంబంతో ప్రేమ మొద‌ల‌వుతుంది. అమ్మ‌తో, నాన్న‌తో... ఆకుటుంబంలో ఉన్న అంద‌రితోనూ జ‌ర్నీ మొద‌ల‌వుతుంది. తండ్రీ కొడుకుల మ‌ధ్య ప్రేమ‌.. ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. ఈ రెండున్న‌ర గంట‌లో శివ‌గారు చాలా రిలేష‌న్‌షిప్స్ గురించి డిస్క‌స్ చేశారు. నేను సినిమా చూశా. చాలా బావుంది. శివ‌గారికి, చైత‌న్య‌కి వాళ్ల కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా ఉంటుంది.

* ఈ కేర‌క్ట‌ర్ చేయ‌డం ఈజీగానే అనిపించిందా?
- నా జీవితంలో ఒక మోటో ఉంటుంది. నేనెప్పుడూ నిన్న‌టికంటే బెట‌ర్‌గా ఉండాల‌నుకుంటా. రేపు ఈ రోజుక‌న్నా ఇంకా బావుండాల‌నుకుంటా. నా గ‌త చిత్రం క‌న్నా ఈ సినిమాలో ఏదో ఒక లేయ‌ర్ అని ఉండాలి. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ లో ఆ లేయ‌ర్ ఉంది. ఇందులో శ్రావ‌ణి అనే పాత్ర చేశా. త‌నేం ఎక్కువ మాట్లాడ‌దు. కానీ కుటుంబానికి ఆమె చాలా స్ట్రెంగ్త్ ను అందించాలి. నాకు అది చాలెంజ్‌గా అనిపించింది. అది నాకు చాలా కొత్త రోల్‌.

* శ్రావ‌ణికి, మీరు ఏమైనా పోలిక‌లున్నాయా?
- స్ట్రెంగ్త్ లో పోలిక ఉంటుంది. కానీ నేనెక్కువ మాట్లాడ‌తాను. శ్రావ‌ణి మాట్లాడ‌దు.

* పెళ్లి త‌ర్వాత ఈ త‌రహా క‌థ‌లు చేయాల‌నుకున్నారా?
- అలాంటిదేమీ లేదు.

* స్క్రిప్ట్ విన్నాక చేంజ‌స్ ఏమైనా చెప్పారా?
- అలాంటిదేమీ లేదు. నేను క‌థ వింటున్న‌ప్పుడు చేయాలా? వ‌ద్దా? అని నిర్ణ‌యించుకుంటాను. నేను ఒక్క‌సారి వ‌ద్ద‌నుకుంటే.. ఎన్ని మార్పులు చేసి తీసుకొచ్చినా నేను చేయ‌ను. ఒక‌వేళ నేను ఓకే చెప్పాన‌నుకోండి.. అస‌లు అందులో వేలు పెట్ట‌ను. `మ‌జిలి` క‌థ విన‌గానే వెంట‌నే న‌చ్చి, ఓకే చెప్పా. ఇటీవ‌ల సినిమా చూసుకున్న త‌ర్వాత ఆయ‌న చెప్పిన‌దానిక‌న్నా బాగా తీశార‌ని అనిపించింది.

* ఇంటికి వ‌చ్చాక సెట్లో ఏం జ‌రిగింది.. ఎలా చేశాం.. వంటివి మాట్లాడుకుంటారా?
- ఇంటికి వ‌చ్చాక కూడా మాట్లాడుకునేవాళ్లం. ఇందులో పూర్ణ అనే పాత్ర చేశాడు. ఇంటెన్స్ ఉన్న పాత్ర అది. ప్ర‌తి రోజు అత‌నికి స‌పోర్ట్ చేయ‌డానికి నేను ఉండేదాన్ని. క్లైమాక్స్ చాలా బాగా డిస్క‌స్ చేశాం. ఎందుకంటే ఈ సినిమాలో క్లైమాక్స్ మెయిన్‌. ఈ సినిమా చూసిన త‌ర్వాత త‌న‌ని చూస్తే గ‌ర్వంగా అనిపించింది.

* ఈ క‌థ ఎమోష‌న‌ల్‌గా బ‌రువుగా ఉంటుందా?
- ప్ర‌తి ల‌వ్‌స్టోరీలోనూ ఒకే ర‌క‌మైన భావాలుంటాయి. కానీ అందులో మ‌నం ఎంత ఎమోట్ చేస్తున్నామ‌నేది కీల‌కం. ఈ సినిమాలో పూర్ణ‌, శ్రావ‌ణి, అన్షు భావోద్వేగాలు చాలా కీల‌కం. ఈ సినిమాలోని ఈ పాత్ర‌ల‌కు ప్రేక్ష‌కులు ఎంత క‌నెక్ట్ అయితే సినిమా అంత హిట్ అవుతుంది. శివ‌గారు ఈ పాత్ర‌ల‌ను చాలా బాగా డిజైన్ చేశారు. నేను సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు సినిమా చూస్తున్నాననే భావ‌నే లేదు. కిటికీ నుంచి వాళ్ల జీవితాల్లోకి తొంగిచూస్తున్నాన‌నే ఫీలింగే క‌లిగింది. సినిమాటోగ్ర‌ఫీస్‌, ఫ్రేములు, చిన్న చిన్న సీన్లు, చిన్న డైలాగులు, న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్... ప్ర‌తిదీ చాలా న‌మ్మ‌శ‌క్యంగా ఉంది. చాలా అందంగా ఉంటుంది. ప్ర‌తిదానికీ క‌నెక్ట్ అయింది.

* సూప‌ర్ డీల‌క్స్ సినిమా హిట్ అయింది
- అందులో నా పాత్ర గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. అస‌లు ఇంత పొగుడుతార‌ని నేను ఊహించ‌లేదు. ట్రోల్ చేస్తార‌నే అనుకున్నా. ఎందుకంటే ఆ పాత్ర అంత బోల్డ్ గా ఉంటుంది. ఆ సినిమా ఇంట‌ర్వ్యూల్లోనూ చాలెంజ్‌గా తీసుకుని చేశాన‌నే చెప్పా. ఇప్పుడు ఆ సినిమాకు అంత మంచి అప్రిషియేష‌న్ వ‌స్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి కాంప్లిమెంట్స్ వ‌స్తూనే ఉన్నాయి. నేను బాగా చేశాన‌ని నాకు తెలుసు. కానీ ఇంత మంది అప్రిషియేష‌న్ వ‌స్తుంద‌ని అనుకోలేదు.

* ట్రోల్స్ కి ఫీల‌వుతారా?
- ఇంత‌కు ముందు బాగా ఫీల‌య్యేదాన్ని. ఇప్పుడు ప‌ట్టించుకోను. ఓకే అని అనుకుంటా.

* సినిమాలో లిప్‌లాక్‌లు గురించి కాంట్ర‌వ‌ర్శీలు వ‌చ్చాయి..
- కిస్‌, హ‌గ్గు, ట‌చ్‌... స్క్రీన్ పైన ఏదైనా ఒక‌టే. నేను న‌టిగా దాన్ని అలాగే చూస్తానంతే. ఎందుకంటే ఆ సీన్‌కి కిస్ కావాలి. అక్క‌డ మాట‌లు దాటిన ఎమోష‌న్ ఉంది. అందుకే చైత‌న్య కిస్ చేశారు.

* ఆ సీన్ చేసిన‌ప్పుడు మీరెలా ఫీల‌య్యారు?
- ఆ సీన్ చేశార‌ని నాకు ముందు తెలియ‌దు. ఒక‌రోజు శివ‌గారు `స‌మంతా రండి. మీకు చూపిస్తాను` అని చూపించారు. నేను చూసిన త‌ర్వాత `ఓహో కిస్ చేశారా` అని అనుకున్నా.

* ఈ మ‌ధ్య మ‌హిళ‌ల పాత్ర‌లు గ్లామ‌ర్‌కే ప‌రిమితం కావ‌డం లేదు. గ‌మ‌నించారా?
- నిజ‌మే. డ్యాన్సుల‌కు ప‌రిమితం కావ‌డం లేదు. మ‌హిళా ప్రేక్ష‌కుల్లో మార్పు వ‌చ్చింది. న‌టీమ‌ణులు కూడా తెర‌పై త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాల‌ని అనుకుంటున్నా. విమెన్ ఆడియ‌న్‌, గ‌ర్ల్స్ థియేట‌ర్ల‌కు వ‌చ్చి త‌మ‌లాంటి మ‌హిళ‌ల‌ను చూడాల‌నుకుంటున్నారు. కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల్లో చూడాల‌ని అనుకోవ‌డం లేదు. అందుకే ద‌ర్శ‌కుల్లోనూ మార్పు వ‌స్తోంది.

* ఇప్పుడున్న స్టేజ్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉంటారా? ఎలా?
- ఇప్పుడున్న స్టేజ్‌లో చాలా లేజీ అయ్యాను. ఎవ‌రైనా క‌థ చెప్తాన‌న్నా ఇప్పుడు వింటానా? రేపు వింటాను.. అని అంటున్నా. ఇంత‌కు ముందు ఏడాదికి ఐదు సినిమాలు చేయ‌క‌పోతే నాకు టెన్ష‌న్ వ‌చ్చేది. `నా లైఫ్ అయిపోయిందా? ప‌్రేక్ష‌కుల‌కు నేను న‌చ్చ‌డం లేదా? చూడ్డానికి బాగోలేనా?` వంటి ఆలోచ‌న‌లు చుట్టుముట్టేవి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీ అంటే వ్య‌క్తిగ‌తంగానూ, వృత్తిప‌రంగానూ. ఇప్పుడు ఒక్క సినిమా వ‌స్తే అది `సూప‌ర్ డీల‌క్స్` లాంటి సినిమా కావాల‌ని ఉంటుంది. రివ్యూలు చ‌దివిన‌ప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత‌కు ముందులా ఏడాదికి మూడు, నాలుగు, ఐదు సినిమాలు చేసేయాల‌నేం లేదు. ఒక్క సినిమా చేసినా, క్వాలిటీ సినిమా చేస్తే చాలు, పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా ఉంటే చాలు.

* ఎందుక‌లా అనిపిస్తుంది?
- నేను వ్య‌క్తిగా చాలా మార్పు వ‌చ్చింది. న‌టిగా చాలా మారాను. నేను ఇంత‌కు ముందు చేసిన పాత్ర‌ల్లాంటి పాత్ర‌ల‌ను ఇప్పుడు చేయాల‌ని అనిపించ‌డం లేదు.

* ఎందుకు మీ ఒపీనియ‌న్ మార్చుకున్నారు. రంగ‌స్థ‌లం త‌ర్వాత కూడా `మిగ‌తా హీరోయిన్లు చేసే క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాలు నేను చేస్తాను` అని అన్నారుగా...
- ఇప్పుడు `సూప‌ర్ డీల‌క్స్ కూడా క‌మర్షియ‌ల్ సినిమానే. అంటే రెగ్యుల‌ర్ అనే మాటను మాట్లాడి ఉండ‌ను. రెగ్యుల‌ర్ అనే మాట ఇప్పుడు నా డిక్ష‌న‌రీలో లేదు. అదెప్పుడో ఎగిరిపోయింది. నేనిప్పుడు సినిమా చేయాలంటే అది నాకు చాలెంజింగ్గా అనిపించాలి. అప్పుడే చేస్తాను. ఇన్ని ఏళ్ల త‌ర్వాత నాకు జ‌డ్జిమెంట్ ఉంటుంద‌నే అనుకుంటా. కొన్నిసార్లు మ‌నకు స్క్రిప్ట్ చెప్పేట‌ప్పుడు బావుంటుంది. కానీ తీరా సినిమా చూశాక మార్పు రావ‌చ్చు. ఎందుకంటే ఎంతో మంది దానిలో కాళ్లూ, వేళ్లూ పెట్టి ఉండ‌వ‌చ్చు. అలాంటప్పుడు ఏమీ చేయ‌లేం కానీ, నా జ‌డ్జిమెంట్ మీద నాకు న‌మ్మ‌కం ఉంది.

* మ‌జిలీలో మీకు క‌నిపించిన ఆ స్పెష‌ల్ లేయ‌ర్ ఏంటి?
- హీరోగారికి అప్ప‌టిదాకా ఒక‌మ్మాయితో ల‌వ్ ఉంటుంది. అంత‌సేపు వాళ్ల‌ని చూసి ఆనందించిన ఆడియ‌న్ ఉన్న‌ట్టుండి న‌న్ను యాక్సెప్ట్ చేయాలి. అంటే వెరీ ఫ‌స్ట్ షాట్‌లోనే న‌న్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏదో అక్క‌డ ఇంపాక్ట్ చూపించాలి. పైగా ఎక్కువ మాట్లాడ‌లేను. అలాంట‌ప్పుడు అది నాకు చాలెంజింగ్ పాత్రే క‌దా. కొన్నిసార్లు క‌ళ్ల‌తో భావాలు ప‌లికించాలి. కొన్ని సార్లు కేవ‌లం నా అభిన‌యంతోనే అంతా చెప్ప‌గ‌ల‌గాలి. ఈ క‌థ‌లో నాకు క‌నెక్ట్ అయిన సినిమా అదే.

* చైతూ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పండి?
- ఆయ‌న నాతో ఈ విష‌యం చెప్పొద్ద‌ని చెప్పి పంపారు. ఆయ‌న పెర్ఫార్మెన్స్ చూసి కొన్ని షాట్స్ లో నేను కూడా షాక్ అయ్యా. అంత బాగా చెప్పా.

* మీరు ఆయ‌న్ని అప్రిషియేట్ చేస్తుంటారా?
- బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తా. లేకుంటే అస్స‌లు చేయ‌ను.

* పెళ్ల‌య్యాక ఆయ‌న‌తో న‌టించ‌డం ఎలా అనిపించింది? కంఫ‌ర్ట్ గానే ఫీల‌య్యారా?
- నాకు ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ఎవ‌రైనా స‌రే, నేను నా 100 శాతం న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తానంతే. ఎందుకంటే ఒక షాట్ వెయ్యేళ్లు ఉంటుంది. స్మాల్ షాట్ ని కూడా మ‌నం అగౌర‌వ‌ప‌ర‌చ‌కూడ‌దు. `యాక్ష‌న్` అన‌గానే నా ముందున్న‌ది ఎవ‌రు? వాళ్ల‌తో నాకున్న బంధం ఏంటి? వాళ్ల‌ను నేను ఇష్ట‌ప‌డ‌తానా? ఇష్ట‌ప‌డ‌నా?... అస‌లు ఇలాంటివేమీ ప‌ట్టించుకోను. ఆ క్ష‌ణం నేను వంద శాతం న్యాయం చేస్తా. కాకపోతే దంప‌తులుగా సెట్‌కి వెళ్ల‌డం, క‌లిసి ఎక్కువ సేపు గ‌డప‌డం ఈ సినిమాలో బెస్ట్ ఎక్స్ పీరియ‌న్స్.

* ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 9ఏళ్లయిందా?
- ఇది నా తొమ్మిదో ఏడు. నేను `దూకుడు` చేసేట‌ప్పుడు మ‌హేష్‌గారు నాకు కెరీర్ బెస్ట్ అడ్వైజ్ ఇచ్చారు. `ప్ర‌తి సినిమానూ తొలి సినిమా అనుకో` అని అన్నారు. ఆ మాట నాపై చాలా బాగా ప్ర‌భావితం చేసింది. అందుకే నేను తొలి సినిమాను కొత్త సినిమా అనుకుంటా. సెట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ అదే రెస్పెక్ట్, అదే ట్రీట్‌మెంట్ ఇస్తా. ఆన్‌సెట్‌లో నేను ఇంకా అస్స‌లు ఏమీ మార‌లేదు. అందుకే నేను ఎద‌గ‌గ‌లుగుతున్నానేమో. నేను చేసే షాట్ బాగా రావాలి. మా ద‌ర్శ‌కుడు మెచ్చుకోవాలి అని అనుకుంటా.

* పెద్ద‌వాళ్ల అడ్వైజ్‌కి అంత విలువిస్తారా?
- త‌ప్ప‌కుండా ఇస్తాను. ఎందుకంటే అడ్వైజ్ అనేది నా దృష్టిలో బంగార‌మే. ఎందుకంటే ప‌దిహిట్లు వ‌చ్చిన త‌ర్వాత ఎప్పుడూ రిలాక్స్ కాకూడ‌దు. ఇంకా ఏదో చేయాల‌నే త‌పన‌ను చూపించాలి. అది మ‌న వైపు ఇత‌రుల దృష్టిని మ‌ళ్లిస్తుంది.

* శివ‌గారు తొలి సినిమాకు త‌న ఫ్రెండ్ లైఫ్ ఇన్స్ పిరేష‌న్ అని అన్నారు. ఈ సినిమాకు ఏమైనా ఉన్నాయేమో అడిగారా?
- శివ‌గారికి వైజాగ్ అంటే ప్రాణం. అక్క‌డున్న ఒక రాయిని గురించి కూడా ఐదు నిమిషాలు మాట్లాడుతారు. అంత‌టి అభిమానం ఉంటుంది. ఆ వైజాగ్ ఒరిజినాలిటీ ప్ర‌తి మాట‌లో, ప్ర‌తి విజువ‌ల్‌లో అది క‌నిపిస్తుంది. సెట్స్, డైలాగ్స్, పాత్ర‌లు, వాళ్లెలా మాట్లాడుకుంటారు వంటివ‌న్నీ ఒరిజిన‌ల్‌. మిడిల్ క్లాస్ సెట్టింగ్ మొత్తం చాలా ఒరిజిన‌ల్‌గా ఉంటుంది. మొద‌టి సినిమాకు, రెండో సినిమాకు మ‌ధ్య మ‌రో ప‌ది సినిమాలు చేసినంత ఎక్స్ పీరియ‌న్స్ ని కూడ‌గ‌ట్టుకున్నారు.

* ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మీరు నిజంగానే ఏడుస్తారా?
- నేనేం అంత ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్‌ని కాదు. కాక‌పోతే ఎమోష‌న‌ల్ సీన్లు చేసేట‌ప్పుడు మాత్రం నేను గ్లిజ‌ర‌న్ వాడ‌ను. వంద శాతం ఇన్వాల్వ్ అయ్యి చేయాల‌నే అనుకుంటా. గ్లిజ‌రిన్ వాడితే మ‌నం కంప్లీట్ యాక్ట‌ర్ అని అనుకోను.

* 1980ల్లో జ‌రిగిన క‌థా?
-1990ల్లో జ‌రిగింది. ఈ సినిమాలో ప్రేమ ఉంది, పెయిన్ ఉంది. ఒక‌బ్బాయి జీవితం, అత‌ను మ‌గాడిగా మార‌డం, అత‌ను వాస్త‌వాల‌ను అర్థం చేసుకోవ‌డం వంటివ‌న్నీ ఉంటాయి. ఇందులో ఒన్ సైడ్ ల‌వ్ స్టోరీ లేదు. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ కాదు.

* చైతూగారికి లైఫ్‌లో ఒన్‌సైడ్ ల‌వ్ ఉందా?
- ఆ మాట న‌న్ను అడుగుతున్నారా? ఆయ‌న‌కు పెళ్ల‌య్యి రెండేళ్ల‌యింది. ఇప్పుడు మొద‌టికి వెళ్తానంటారా చెప్పండి.

*చైతూగారికి అప్పుడు చూడ్డానికి, ఇప్పుడు చూడ్డానికి మీకేమ‌నిపిస్తోంది?
- ఆయ‌న‌తో సీరియ‌స్‌నెస్ వ‌చ్చింది. ఇంప్రూవ్‌మెంట్ వ‌చ్చింది. ఆయ‌న న‌ట‌న ప‌రంగా కూడా మెరుగ‌య్యారు.

* నాగార్జున‌గారు `మ‌న్మ‌థుడు2` క‌థ గురించి చెప్పారా?
- చెప్పారు. నాకు న‌చ్చింది.

* కొత్త సినిమాల‌కేం సంత‌కం చేయ‌రా?
- ఓ బేబీ జ‌రుగుతుంది క‌దా... పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ఉంది. స‌మ్మ‌ర్ ఎండ్ విడుద‌ల ఉంటుంది. పూర్తి స్థాయి కామెడీ రోల్ చేయాల‌ని నాకు కోరిక ఉండేది. `అ ఆ` లో కాస్త చేశాను. కానీ ఓ బేబీలో ఆ కోరిక నెర‌వేరుతుంది. 96లో త‌మిళ్‌లో త్రిష చేసిన పాత్ర‌ను నేను ఇక్క‌డ చేస్తున్నా. మా ఇద్ద‌రికీ ఏదో క‌నెక్ష‌న్ ఉంద‌నుకుంటా.

* ఇంకేం సినిమాలున్నాయి..
- అయినా.... అయినా నేను మాత్రం డైలీ ప‌నిచేయాలి.. మీరంద‌రూ మాత్రం స‌మ్మ‌ర్ హాలిడేస్‌కి వెళ్లండి.. నాక్కూడా సెల‌వులు కావాలి క‌దా.
ఏప్రిల్ నేను ఖాళీగానే ఉంటా. ఆ త‌ర్వాతే 96 సినిమాలో చేస్తా.

* ఇంకేమైనా సినిమాలు చేయాల‌ని ఉందా?
స్పోర్ట్స్ సినిమాల‌కు నేను చాలా బాగా క‌నెక్ట్ అవుతా. అలాంటివి చేయాల‌ని ఉంది. స్పోర్ట్స్ బ‌యోపిక్స్ అంటే ఇష్టం. యూనివ‌ర్స‌ల్ ఎమోష‌న్స్ అంటే ఇష్టం. ఏమైనా నేర్చుకోవాల‌న్నా వాటి కోసం నేర్చుకోవ‌డానికి సిద్ధ‌మే.

* బాలీవుడ్‌కి వెళ్ల‌రా?
- నేను రాన‌ని వాళ్లే నిర్ణ‌యించుకున్న‌ట్టున్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved