pizza
Samantha interview about Rangasthalam
రంగ‌స్థ‌లంలో భాగ‌మైనందుకు గ‌ర్వంగా ఉంది - స‌మంత‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 April 2018
Hyderabad

రామ్‌చరణ్‌, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా మార్చి 30న విడుదలైంది. ఈ సందర్భంగా రామలక్ష్మి పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన సమంత ఇంటర్వ్యూ...

ఐదేళ్ల ముందు అయితే..
- సినిమాకు చాలా మంచి అప్రిసియేషన్స్‌ వస్తాయని నాకు తెలుసు. ఎందుకంటే ఆడియెన్స్‌ కొత్త తరహా సినిమాలను చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఈ సినిమా విడుదలై ఉంటే ఇంత మంచి అప్రిసియేషన్‌ వచ్చుండేది కాదేమో!. ప్రేక్షకులు వారి మైండ్‌సెట్‌ను మార్చుకుంటున్నారు. నా కెరీర్‌లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ మూవీగా `రంగ‌స్థ‌లం`నిలిచినందుకు ఆనందంగా ఉంది.

వందశాతం ఎఫర్ట్‌ పెట్టి...
- జెస్సీ తరువాత ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌ అని అనుకోవాలా? అని ప్రశ్నిస్తే చెప్పలేను. ఎందుకంటే `ఈగ`లో బిందు పాత్ర.. `ఎటో వెళ్ళిపోయింది మనసు` ఇలా మంచి పాత్రలు చేశాను. అయితే రామలక్ష్మి డిఫరెంట్‌ పాత్ర. ఇప్పటి వరకు నేను పల్లెటూరికి వెళ్లనేలేదు. ఉన్నట్లుండి పల్లెటూరి అమ్మాయి పాత్ర చేయాలంటే కొత్తగా ఉంటుంది కదా!.. అసలు నేను చేస్తానని ఎవరూ అనుకోని ఉండరు. సుకుమార్‌గారు నా క్యారెక్టర్‌ గురించి చాలా చాలా హోం వర్క్‌ చేశారు. ఆయన చెప్పిన దాన్ని పూర్తి చేయడమే గోల్‌గా అనుకుని ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఆయన పాత్రను ఊహించుకున్న దాన్ని నటిగా చేసి చూపాలనుకున్నాను. నటిగా వందశాతం ఎఫర్ట్‌ పెట్టి చేశాను.

రిస్క్‌లంటే చాలా ఇష్టం...
- నాకు రిస్క్‌లంటే చాలా ఇష్టం. నా కెరీర్‌ అంతా రిస్క్‌లతోనే గడిచింది. నాకు ఛాలెంజ్‌ అంటే భయముంటుంది.. చేయాలని ఉంటుంది. హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ కానీ కొత్తగా ఉంటాయి. నా మూతిని అన్ని రకాలుగా తిప్పగలనని నేను కూడా అనుకోలేదు. ఇలాంటి పాత్ర చేసేటప్పుడు కాస్త భయపడ్డాను. జెస్సి పాత్ర నుండి రామలక్ష్మి ముందు వరకు నేను చేసిన వాటిని భిన్నంగా చేశాను.

అరుదుగా వ‌చ్చే అవ‌కాశం...
- నేను, చైతన్య సాయంత్రం అయితే సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదని అనుకున్నాం. మాట్లాడుకోం. ఈ సినిమా చేసేటప్పుడు పగటిపూట చైతు ఫోన్‌ చేస్తే వేడి ఎక్కువగా ఉందని చెప్పేదాన్ని తప్ప పాత్ర గురించి ఎక్కువ చెప్పలేదు. ఫస్ట్‌ లుక్‌ చూడగానే... అందులో నా ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూడగానే షాకయ్యి 'ఏయ్‌ ఏంటిది' అన్నాడు. సినిమా చూసిన తర్వాత సుకుమార్‌గారి వర్క్‌, చరణ్‌ నటన థ్రిల్‌ అయ్యాం. నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్‌ కాలేదు కానీ.. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు గర్వంగా అనిపించింది. చాలా అరుదుగా వచ్చే అవకాశం.

ఇంత పెద్ద హిట్‌ అనుకోలేదు...
- ఇలాంటి సినిమాను చిత్రీకరించడం చాలా కష్టం. శారీరకంగా ఒత్తిడి ఉంటుంది. వేసవిలో రాజమండ్రిలో షూట్‌ చేశాం. చాలా వేడిలో చెప్పులు లేకుండా నటించాం. ప్రతి ఒక్కరూ మరొకరికి సపోర్ట్‌ చేసుకుంటూ వచ్చాం. చరణ్‌ విషయానికి వస్తే.. లవ్‌లీ కోస్టార్‌. సుకుమార్‌గారి కంట్రోల్‌కి వెళ్లిపోయిన యాక్ట్‌ చేశాడు. వేరే పాత్రలకు మంచి స్కోప్‌ ఉండేలా చూసుకున్నాడు. హిట్‌ అవుతుందని తెలుసు.. కానీ ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని అనుకోలేదు.

నా భర్త నుండి నేర్చుకుందదే...
- ఇంతకు ముందు నా సినిమాలు విడుదలవుతున్నాయంటే.. అందరినీ నిద్రపోనిచ్చే దాన్ని కాదు. వందశాతం నీ పాత్రకు న్యాయం చేయ్‌.. తర్వాత మరిచిపో. ఆడియెన్స్‌ ఫీలింగ్‌కు మనం కంట్రోల్‌ చేయలేమనే విషయాన్ని నా భర్త చైతన్య నుండి నేర్చుకున్నాను.

అందుకే ట్రిప్‌ వెళ్లాను...
- ట్రిప్‌కు వెళ్లాని ముందుగానే అనుకున్నదే. ఎందుకంటే పెళ్లి తర్వాత మేం హానీమూన్‌ వెళ్లలేదు. నేనైతే మూడు రోజులు మాత్రమే గ్యాప్‌ తీసుకుని షూటింగ్‌లో బిజీ అయిపోయాను. మార్చిలో మూడు సినిమాలు పూర్తి చేసిన తర్వాత బ్రేక్‌ తీసుకోవాలనిపించి ట్రిప్‌కు వెళ్లాం. ఇప్పుడు 'యూ టర్న్‌' సినిమా చేస్తున్నాను.

ఫిలిం మేకర్స్‌ నిర్ణయం మారాలి ...
- హీరోయిన్‌కి పెళ్లి అయితే ఆమె నటించిన సినిమాలను ప్రేక్షకులు చూడరనేది ఫిలిం మేకర్స్‌ ఫిక్స్‌ అయిపోయిన ఆలోచన. అంతే కానీ ప్రేక్షకులు ఎవరూ సమంతకు పెళ్లి పోయింది కాబట్టి ఆమె నటించిన సినిమాలు చూడమని చెప్పలేదు. 'రంగస్థలం' సినిమా ఓ ప్రాపర్‌ కమర్షియల్‌ ఓరియెంటెడ్‌ మూవీ. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు అంగీకరించారు. ప్రేక్షకులు అంగీకరించారంటే ఫిలిం మేకర్స్‌కి మెసేజ్‌ ఇచ్చినట్టే కదా!. నాకు నా కుటుంబాలే పెద్ద బలం. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల ఇన్‌వాల్వ్‌మెంట్‌.. సపోర్ట్‌ 200 శాతం ఉంది. నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వర్క్‌కు ఫ్రీ మైండ్‌తో వెళుతున్నానంటే వారే కారణం.

నటిగా తీసుకున్న నిర్ణయమే..
- నటిగా నేను చాలా దూరం ప్రయాణం. నాంటూ ఓ దారి ఏర్పరుచుకున్నాను. ఇప్పుడు అర్థం పర్థం లేని పాత్రలు చేస్తే ఉపయోగం ఉండదు. నా క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటే సినిమాలు చేస్తున్నాను. అందువల్ల రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో నేను కనిపించకపోవచ్చు. ఈ నిర్ణయం నటిగా నేను తీసుకున్నదే తప్ప.. పెళ్లి తర్వాత వచ్చిన మార్పు కాదు.

స్క్రీన్‌పై చూసి షాకయ్యా...
- 'రంగస్థలం' సినిమాలో సుకుమార్‌గారు నా పాత్రను మాత్రమే నాకు చెప్పారు తప్ప.. పూర్తి కథను చెప్పలేదు. సినిమా చూస్తుంటే షాకయ్యాను. ప్రతి విషయాన్ని ఎంతో డిటెయిల్డ్‌గా తెరకెక్కించరాయన.

తనకు ముందే చెప్పాను..
- రంగమ్మత్త క్యారెక్టర్‌ చేసిన అనసూయతో నేను ఓ సీన్‌లో యాక్ట్‌ చేశాను. తను ఎలా చేశానోనని భయపడింది. అయితే తప్పకుండా ఆ సీన్‌ బావుంటుందని.. ఈ సినిమాలో తనకు మంచి పేరు వస్తుందని నేను ముందుగానే చెప్పాను. అన్నట్లుగానే అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్‌కి చాలా మంచి పేరొచ్చింది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved