pizza
Shankar interview about Shambho Shankara
ప్ర‌తిరోజూ బిరియాని తిన‌లేం - శంక‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 June 2018
Hyderabad

క‌మెడియ‌న్స్ అంద‌రూ హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. వీరి కోవ‌లోకి ష‌క‌ల‌క శంక‌ర్ జాయిన్ అయ్యారు. శంక‌ర్ పేరుతో ఈయ‌న హీరోగా న‌టించిన చిత్రం `శంభో శంక‌ర‌`. ఈ చిత్రం జూన్ 29న సినిమా విడుద‌ల‌వుతుంది. ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మించారు. ఈ సంద‌ర్భంగా శంక‌ర్ పాత్రికేయుల‌తో మాట్లాడారు..

అందుకే హీరోగా మారాను...
- క‌మెడియ‌న్‌గా నా స్థాయికి త‌గ్గ సినిమాలు రావ‌డం లేదు. ఖాళీగా ఉండ‌టం ఎందుకు? అని హీరో అయ్యాను.

డ‌బ్బుల సంపాదించాల‌ని కాదు...
నా స్థాయి పాత్ర‌లంటే.. ఆనందో బ్ర‌హ్మ‌, గీతాంజ‌లి, రాజుగారి గ‌ది లాంటి చిత్రాల్లో నేను పోషించిన క్యారెక్ట‌ర్స్‌లాంటివి. అంతే త‌ప్ప ఏదో ఉద్ద‌రించేద్దామ‌ని హీరో అయిపోలేదు. క‌మెడియ‌న్‌గా ఉన్న‌ప్పుడు రోజుకి 30-40 వేలు తీసుకునేవాడిని. `శంభోశంక‌ర‌` సినిమాకు 50 రోజులు ప‌నిచేశాను. రోజుకు స‌గ‌టున 13 వేలు ద‌క్కాయి. వ‌చ్చిన డ‌బ్బు త‌క్కువే అయినా.. ప‌నిచేశాన‌నే తృప్తి ద‌క్కింది. రోజూ బిరియాని తిన‌లేం. అలాగ‌ని న‌చ్చ‌నిది తిన‌లేం. న‌చ్చిందే తిన‌గ‌లం. అలా నాకు న‌చ్చ‌ని సినిమాల‌ను వ‌దిలేశా.

అందుకే వాళ్ల‌ని అడిగాను...
- ర‌వితేజ‌, త్రివిక్ర‌మ్‌, దిల్‌రాజు వంటివారు నాతో సినిమా చేస్తే మ‌రో ప‌ది మందికి అన్నం పెట్టిన‌ట్లు అవుతుందనే ఉద్దేశంతో వారిని క‌లిశాను. వారిని అగిగానంతే. అడుక్కోవ‌డానికి సిగ్గు ప‌డ‌టం ఎందుకు? వాళ్లు నాతో సినిమా చేయ‌న‌ని అన‌లేదు. స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు. కానీ నేనే ఆగ‌లేక‌పోయాను.

interview gallery



ఆయ‌న‌కే హిట్ లేదు......
- మా గురువుగారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌గారికే హిట్ లేదు. క‌నీసం ఒక హిట్ అయినా కొట్టండిసార్ అని అంటున్నా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌మెడియ‌న్‌గా నాకు ప్ర‌తిభ ఉందా? లేదా? అని ద‌ర్శ‌కుల‌కే తెలియాలి.

ఆ సినిమా గురించి తెలియ‌దు...
- నేను హీరోగా స్టార్ట్ చేసిన `డ్రైవ‌ర్ రాముడు`లో ఓ సాంగ్‌.. ఓ ఫైట్ చిత్రీక‌రించారు. త‌ర్వాత ఏమైందో తెలియదు. నాకు కూడా ఆ సినిమా గురించి తెలియ‌దు.

ఒక సినిమాకే ...
- ఒక సినిమా పోతే చ‌రిత్ర ఆగిపోదు. సినిమా పోయిన వాళ్లంద‌రూ ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్లిపోయారా? లేదు క‌దా!. అలాగ‌ని ఇక‌పై హీరో పాత్ర‌లే చేయ‌ను. న‌చ్చిన పాత్ర‌లు చేస్తాను.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved