pizza
S.K. Satya interview (Telugu) about Gunturodu
'గుంటూరోడు' సక్సెస్‌పై టు హండ్రెడ్‌ పర్సెంట్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను - ఎస్‌.కె.సత్య
You are at idlebrain.com > news today >
Follow Us

24 February 2017
Hyderabad

మంచు మనోజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ బ్యానర్‌లో ఎస్‌.కె.సత్య దర్శకత్వంలో వరుణ్‌ నిర్మించిన చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎస్‌.కె.సత్యతోఇంటర్వ్యూ విశేషాలు....

మనోజ్‌కు మాస్‌ ఇమేజ్‌ తెస్తుంది...
- ఇప్పటి వరకు మంచు మనోజ్‌ అవుటండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమా చేయలేదు. అలాంటప్పుడు మనోజ్‌తో ఓ ఫుల్‌ప్లెజ్‌డ్‌ కమర్షియల్‌ సినిమా చేస్తే ఎలా ఉంటుందోనని వచ్చిన ఆలోచన ఈ గుంటూరోడు సినిమా. ఈ సినిమాతో తన సత్తా ఏంటో చూపించే చిత్రమిది. ఈ సినిమా మనోజ్‌కు కమర్షియల్‌ స్టార్‌గా పేరు తెస్తుంది.

అవే హైలైట్స్‌...
- ఈ సినిమాలో క్యారక్టరైజేషన్స్‌ హైలైట్‌గా ఉంటాయి. సినిమాలో కోటగారు, మనోజ్‌గారు, రాజేంద్రప్రసాద్‌గారు, సంపత్‌గారు ఈ నాలుగు పాత్రలు స్పాన్‌ ఎక్కువగా ఉంటాయి. సంపత్‌ మెయిన్‌ విలన్‌గా చేశాడు. అందరూ చాలా బాగా సపోర్ట్‌ చేశారు.

చిరంజీవి వాయిస్‌ ఓవర్‌...
- గుంటూరోడు సినిమా అంతా పూర్తయ్యింది. ఎవరైనా మంచి స్టార్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పిద్దామని అనుకున్నాం కానీ ఎవైరైతే బావుంటుందా అని ఆలోచిస్తూ వచ్చాం. సినిమా సెన్సార్‌కు దగ్గరపడుతుంది. ఓ రోజు మనోజ్‌గారితో డిస్కషన్‌లో ఉన్నప్పుడు వాయిస్‌ ఓవర్‌ చిరంజీవిగారు చెబితే ఎలా ఉంటుంది అనిపించింది. చాలా మంచి ఆలోచన అనిపించి మోహన్‌బాబుగారితో మాట్లాడి చిరంజీవిగారిని కలిశాము. ఆయన కూడా వెంటనే ఒప్పుకుని చేస్తానని అన్నారు.

ఆడియో రెస్పాన్స్‌...
- గుంటూరోడు పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముందు టైటిల్‌ విని ఈ సినిమాలో పాటలు మాస్‌గా ఉంటాయనుకున్నారు కానీ ఈ సినిమాలో లవ్‌సాంగ్స్‌ ఎక్కువగా ఉంటాయి. మాస్‌ సాంగ్‌, డ్యూయెట్‌, మెలోడి ఇలా అన్నీ రకాల సాంగ్స్‌ ఉన్నాయి.

ఆ నమ్మకంతోఉన్నాను...
- సినిమా నేను అనుకున్న దాని కన్నా చాలా బాగా వచ్చింది. సినిమా సక్సెస్‌పై హండ్రెడ్‌ పర్సెంట్‌ కాదు..టు హండ్రెడ్‌ పర్సెంట్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మనోజ్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. రీసెంట్‌గా ప్రివ్యూ చూసిన మోహన్‌బాబుగారు అప్రిసియేట్‌ చేశారు.

హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ రోల్‌ గురించి...
- హీరోయిన్‌ రోల్‌ ఏదోపాటలకే పరిమితమైపోదు. ఏదో హీరో ఉన్నాడు కదా..లవ్‌ చేయాలనేలా ఉండదు. రియల్‌ లైఫ్‌లో అమ్మాయిలు అనేక పరీక్షలు పెట్టి తమ లవ్‌ను ఎలా సెలక్ట్‌ చేసుకుంటారో అలా రియాల్టికీ దగ్గరగా ఉండే పాత్రలో ప్రగ్యాజైశ్వాల్‌ కనపడుతుంది.

నిర్మాత సపోర్ట్‌....
- నిర్మాత వరుణ్‌గారి గురించి చెప్పాలంలే..ఏదోమనోజ్‌ సినిమా కదా..కాంబినేషన్‌ బావుంటుంది సినిమా చేద్దామనుకునే టైప్‌ కాదు. సినిమాలంటే మంచి ఫ్యాషన్‌ ఉన్న వ్యక్తి. ఒక సినిమాబాగా రావాలంటే దర్శకుడుకి ముఖ్యంగా నిర్మాత సపోర్ట్‌ ఎంతో అవసరం. అవుట్‌ పుట్‌ కోసం నిర్మాత వరుణ్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.

అందరితో చేయాలనుంది...
- అన్నీ జోనర్స్‌లో, అందరి హీరోలతో సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతానికి నెక్స్‌ట్‌ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved