pizza
Sraddha Das interview about Guntur Talkies
ఆ మూడు ర‌కాలుగా అనుకుంటారు. - శ్ర‌ద్ధాదాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

03 March 2016
Hyderaba
d

`గుంటూరు టాకీస్‌` సినిమాలో శ్ర‌ద్ధాదాస్ కీల‌క పాత్ర చేసింది. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సినిమాకు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా గురించి హైద‌రాబాద్‌లో శ్ర‌ద్ధాదాస్ విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు..

* గుంటూరు టాకీస్ సినిమా గురించి చెప్పండి?
మార్చి 4న మా గుంటూరు టాకీస్ విడుద‌ల కానుంది. ఈ సినిమా నాకు చాలా స్పెష‌ల్‌. నా పుట్టిన‌రోజు కూడా అదే రోజు కావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో రివాల్వ‌ర్ రాణి పాత్ర‌లో చేశాను. క‌న్‌ఫ్యూజ‌న్ కామెడీ సినిమా ఇది. నా పాత్ర‌ను చూసిన వాళ్ళు త‌ప్ప‌కుండా షాక్ అవుతారు. నా రియ‌ల్ లైఫ్ పాత్ర‌కీ, ఈ సినిమాలో చేసిన పాత్ర‌కూ చాలా తేడా ఉంటుంది. కంగ‌నార‌నౌత్‌ని చూసి ఇన్‌స్ప‌యిర్ అయి ఈ రోల్‌ను డిజైన్ చేశారు.

* రియ‌ల్ గ‌న్స్ యూజ్ చేశార‌ట‌?
- అవునండీ. ఇందులో రియ‌ల్ గ‌న్స్ ను యూజ్ చేశాను. వాటితో షూట్ చేస్తున్న‌ప్పుడు వ‌చ్చే సౌండ్‌కి భ‌య‌ప‌డి చెవుల్లో దూది పెట్టుకుని న‌టించాను. ఆ షాట్స్ తీసేట‌ప్పుడు క‌ళ్ళు మూయ‌కూడ‌ద‌ని మా ద‌ర్శ‌కుడు ఆర్డ‌ర్ వేయ‌డంతో చాలా క‌ష్ట‌ప‌డి చేయాల్సి వ‌చ్చింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం చాలా హోమ్ వ‌ర్క్ చేశాను.

* మీ పాత్ర ఎలా ఉంటుంది?
చాలా బోల్డ్ కేర‌క్ట‌ర్ అది. ర‌ష్మితో నాకు సీన్లు లేవు. త‌ను గ్లామ‌ర్ పార్టులో క‌నిపిస్తుంది. నేను చేసిన రోల్ చేయాలంటే బాగా గ‌ట్స్ కావాలి. రెండు షేడ్స్ ఉన్న పాత్ర నాది. తొలి స‌గంలో ఫ్లాష్ బ్యాక్‌లో క‌నిపిస్తాను. సెకండాఫ్‌లో యాక్ష‌న్ ఎపిసోడ్ ఉంటుంది. ఇందులో నేను హీరోను ఎందుకు తీసుకెళ్ళాన‌న్న‌ది సస్పెన్స్. నా పాత్ర‌కు నేనే తొలిసారి డ‌బ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులో ఈ త‌ర‌హా చిత్రం రావ‌డం ఇదే తొలిసారి.

Sraddha Das interview gallery

 

* ఇంత బోల్డ్ పాత్ర ఒప్పుకునేట‌ప్పుడు ఏం ఆలోచించారు?
- ఈ సినిమాను ప్ర‌వీణ్ స‌త్తారు చేస్తున్నారు కాబ‌ట్టి చేశాను. ఎందుకంటే వ‌ల్గ‌ర్‌కీ, డీసెంట్‌కీ ఆయ‌న‌కు తేడా తెలుసు. చాలా డీసెంట్‌గా చూపించారు.

* ఈ కేర‌క్ట‌ర్ ప్ర‌భావం మీ కెరీర్‌పై ఉంటుందా?
- నేను అలా అనుకోను. ఈ కేర‌క్ట‌ర్‌ని చూసిన త‌ర్వాత నా గురించి మూడు ర‌కాలుగా అనుకుంటారు. ఒక‌టి న‌న్ను అస‌హ్యించుకుంటారు. లేకుంటే ఈ అమ్మాయికి పిచ్చి ప‌ట్టిందా? అని అనుకుంటారు. లేకుంటే వామ్మో అస‌లు ఈ పాత్ర‌ను ఎలా చేయ‌గ‌లిగింది? అని అనుకుంటారు. అంత‌కు మించి మ‌రేమీ అనుకోరు.

* కెరీర్లో సంతృప్తిక‌రంగానే ఉన్నారా?
- నేను కెరీర్ మొద‌లుపెట్టి ఎనిమిదేళ్ళు అయింది. వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఉన్నాను. హిందీ, క‌న్న‌డ‌, తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నాను.

* ఐట‌మ్ సాంగ్స్ చేయ‌ట్లేదా?
- వ‌రుస బెట్టి ఐట‌మ్ సాంగ్స్ చేయాల‌ని అనుకోవ‌డం లేదు. ఎందుకంటే మంచి బ్యాన‌ర్ ఉంటే చేస్తాను. పెద్ద సినిమా అయితే చేస్తాను. అంతేగానీ అవ‌కాశం వ‌చ్చింది క‌దా అని చేస్తూ పోను.

* ప్ర‌స్తుతం తెలుగులో ఏ సినిమాలు చేస్తున్నారు?
- ఇంకా ఏవీ లేవండి.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved