pizza
Srikanth interview (Telugu) about Operation 2019
`ఆప‌రేష‌న్ 2019` ఎంత వ‌ర‌కు కాంట్ర‌వర్సీ అవుతుందో తెలియ‌దు - శ్రీకాంత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 November 2018
Hyderabad

శ్రీకాంత్‌ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్‌ 2019’. బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌... అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్‌, సునీల్‌ ‘కీ రోల్స్‌’ (కీలక పాత్రలు) చేస్తున్నారు. డిసెంబ‌ర్ 1న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీకాంత్ ఇంట‌ర్వ్యూ...

* అవ‌త‌ల 500-600 కోట్ల సినిమా ఉంది..
- పెద్ద సినిమా ఉన్నివ్వండి.. ఉంటే ఏమ‌వుతుంది? శ్రీకాంత్ - ర‌జ‌నీకాంత్‌. ఇంత‌కు ముందు కూడా ఇలాంటివి చాలా సార్లు జ‌రిగాయి. ఏది బావుంటే అది ఆడుతుంది.

* బివేర్ ఆఫ్ ప‌బ్లిక్ అని పెట్టారు?
- ఆడియ‌న్స్ కూడా ఆలోచించాలి అని అలా పెట్టాం. ఓట్లు వేయ‌డానికి ముందు ఆడియ‌న్స్ కూడా ఆలోచించాలి. రాజ‌కీయ‌నాయ‌కులు ఎలా సంపాదిస్తున్నారు. ఓట‌ర్ల‌కు ఎలా డ‌బ్బులు పంచుతున్నారు? వ‌ంటివ‌న్నీ చెప్పాం.

* ఈ సినిమా గురించి చెప్పండి?
- రైతు కుటుంబంలో పుట్టిన ఓ అబ్బాయి విదేశాల‌కు వెళ్లి సంపాదించి, తన రాష్ట్రంలో రైతుల‌కు ఎలా సాయ‌ప‌డ్డాడు? సాయ‌ప‌డాల‌ని ముందుకొచ్చిన అత‌నికి రాజ‌కీయ‌నాయ‌కుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి? అస‌లు త‌ప్పు ఎక్క‌డుంది? ఇత‌ను రాజ‌కీయాల్లోకి వచ్చి ఏం చేశాడు? వంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం. ప్ర‌జ‌ల‌ది కూడా త‌ప్పుంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాం.

* ఆడియ‌న్స్ త‌ప్పుంది అని అన‌డం స‌బ‌బేనా?
- త‌ప్పుంద‌ని చెప్పడం కాదు. దానివ‌ల్ల జ‌రుగుతున్న విష‌యాల‌ను చెప్పి, ఆలోచించ‌మ‌ని చెప్ప‌డ‌మ‌న్నమాట‌. దానివ‌ల్ల జ‌నాల్లో ఆలోచ‌న పెరుగుతుంది. దానికి త‌గ్గ డైలాగులు కూడా ఉన్నాయి. దేశానికి ఒక జాతీయ గీతం ఉన్న‌ట్టే, మ‌తానికి, కులానికి కూడా గీతాలు పుట్టికొస్తాయ‌ని చెప్పాం. ఇది ఎంత వ‌ర‌కు కాంట్ర‌వర్సీ అవుతుందో తెలియ‌దు. ఇందులో ఏ పార్టీని తిట్ట‌లేదు. ఏ పార్టీని ఏమీ అన‌లేదు.

* మీరు ఈ సినిమాలోకి వ‌చ్చాక రైతుల‌కు ఏమైనా చేసిన‌ట్టు చూపించారా?
- అది సినిమాలో చూడాలి. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌లో ఉన్న‌ట్టు ఇందులోనూ కొన్ని ఉంటాయి. కేర‌క్ట‌ర్ కాస్త నెగ‌టివ్‌గా ఉంటూ, పాజిటివ్‌కి మారుతున్న‌ట్టు అనిపిస్తుంది.

* టైటిల్ గురించి చెప్పండి?
- 2019లో ఎన్నిక‌లు క‌దా.. వాటిని ఉద్దేశించే మేం ఈ సినిమా చేశాం. కానీ తెలంగాణ‌లో కాస్త ముందుగా రావ‌డంతో మేం ఇంకేమీ అన‌కుండా ఇప్పుడు విడుద‌ల చేస్తున్నాం. ఇప్పుడు విడుద‌లైన సినిమా వ‌చ్చే ఏడాది వ‌ర‌కు కొన‌సాగాల‌ని ఆశిస్తున్నా.

* సినిమాలు సెల‌క్టివ్‌గా చేస్తున్నారా?
- అలాంటిదేమీ లేదండీ. మంచి పాత్ర అంటే త‌ప్ప‌కుండా చేస్తా. హీరోగానూ, విల‌న్‌గానూ.. ఎలాగైనా చేస్తా. మ‌రీ ఫాద‌ర్ వేషాలు వేసేంత వ‌య‌సైతే ఇంకా రాలేద‌నుకోండి.

interview gallery



* మీ అబ్బాయి ఏం చేస్తున్నారు?
- చిన్న‌బ్బాయి రోహ‌న్ ప్ర‌భుదేవా కొడుగ్గా ఓ సినిమా చేస్తున్నాడు. పెద్ద‌బ్బాయి లాస్ ఏంజెల్స్ లో కోర్సులు పూర్తి చేసుకుని వ‌చ్చాడు. ఇంకా త‌న గురించి ఆలోచించ‌లేదు. మంచి సినిమా చేస్తాడు.

* మీ ఇంట్లోనే పోటీ మొద‌లైందా?
- ఇంట్లో కాదండీ. వాడు పోటీ ప‌డాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నాతో ఏముంది?

* ఏళ్లు పెరిగే కొద్దీ మీ వ‌య‌సు త‌రుగుతున్న‌ట్టుంది?
- అలాంటిదేమీ లేదండీ. ఏ టెన్ష‌న్సూ తీసుకోను. స్విచ్ ఆఫ్‌, స్విచ్ ఆన్ చేయ‌డం నాకు బాగా తెలుసు. అందుకే కాస్త ఫ్రెష్‌గా క‌నిపిస్తా.

* త‌గ్గిన‌ట్టున్నారు?
- అవునండీ. ఈ మ‌ధ్య మూడు కిలోలు త‌గ్గా.

* అజాత‌శ‌త్రువుగా పేరున్న మీరు ఈ మ‌ధ్య వివాదాల్లోకి వ‌చ్చి కాస్త టెన్ష‌న్ పడ్డ‌ట్టున్నారు?
- త‌ప్పు చేస్తే భ‌య‌ప‌డాలండీ. చేయ‌నప్పుడు నాకు టెన్ష‌న్ ఎందుకు? నిజంగా త‌ప్పు చేసిన రోజు సారీ చెప్ప‌డానికి కూడా నేనేమీ వెన‌కాడ‌ను.

* ఇంకేం సినిమాలున్నాయి?
- వ‌రుస‌గా చాలానే ఉన్నాయి. `తెలంగాణ దేవుడు`, `మార్ష‌ల్‌`.. ఇలా ఉన్నాయి.

* ఈ చిత్రంలో మ‌నోజ్‌, సునీల్ కేర‌క్ట‌ర్ల గురించి?
- మ‌నోజ్ చాలా ఇంపార్టెంట్ కేర‌క్ట‌ర్ చేశారు. సునీల్ పాత్ర కూడా బావుంటుది. మ‌నోజ్ పోలీసాఫీస‌ర్‌గా మెప్పిస్తాడు. మిగిలిన‌వి తెర‌మీద చూడాల్సిందే.

* హీరోయిన్ గురించి?
- కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌లో చేసిన అమ్మాయిని తీసుకున్నాం. త‌ను చూడ్డానికి హోమ్లీగా ఉంది. సినిమాలో హీరోయిన్‌కి పెద్ద ప్రాముఖ్య‌త ఏమీ లేదు. కాక‌పోతే భార్య‌గా న‌టించింది.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved