pizza
Srikanth Addala interview about Brahmotsavam
ఉన్న‌దాన్ని కొత్త‌గా చెబుతున్నాం - శ్రీకాంత్ అడ్డాల‌
You are at idlebrain.com > news today >
Follow Us

18 May 2016
Hyderaba
d

విలువ‌లున్న చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో గొప్ప‌వాడు అనే పేరు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కొత్త బంగారు లోకం నుంచి ఆయ‌న ఆ పేరును తెచ్చుకున్నారు. సున్నిత‌మైన అంశాల‌ను స్పృశిస్తూనే ప్ర‌తి సినిమా క‌థ‌లోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్న శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన తాజా సినిమా బ్ర‌హ్మోత్స‌వం శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్ అడ్డాల విలేక‌రుల‌తోమాట్లాడారు.

* బ్ర‌హ్మోత్స‌వం ఎలా ఉండ‌బోతోంది?
- మంచి కుటుంబాలు క‌లిసి త‌ర‌చుగా చేసుకుంటే ఉత్స‌వాలు అవుతాయి. అదే ఆ ఉత్స‌వాలు ఓ స్థాయిని దాటితే అది బ్ర‌హ్మోత్స‌వం అవుతుంది.

* తిరుప‌తి బ్ర‌హ్మోత్స‌వాల‌ను చూపిస్తున్నారా?
- లేదండీ. ఓ ఊరిలో జ‌రిగే ఉత్స‌వాల‌ను చూపిస్తున్నాం.

* ఏ నేప‌థ్యంలో సాగుతుంది?
- విజ‌య‌వాడ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఓ సంద‌ర్భం కోసం క‌లుసుకున్న నాలుగైదు కుటుంబాల‌కు సంబంధించిన క‌థ‌తో చేశాం.

* రేవ‌తి, స‌త్య‌రాజ్ ల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో ప్ర‌త్యేక‌మైన ఉద్దేశాలున్నాయా?
- ఏం లేదండీ. ఫ్రెష్ లుక్ కోస‌మే.

* ఇంత మంది స్టార్ కాస్ట్ ను మేనేజ్ చేయ‌డంలో మీరు ఒత్తిడి ఫీల‌య్యారు క‌నుక‌నే సినిమా కాస్త ఆల‌స్యం జ‌రిగిందనే టాక్ ఉంది. మీరేమంటారు?
- అంటే కొన్ని స‌న్నివేశాల‌ను మ‌ర‌లా తెర‌కెక్కించాల్సి వ‌చ్చిన‌ప్పుడు కాంబినేష‌న్ కుద‌ర‌డం క‌ష్టం. ఆ కాంబినేష‌న్ సెట్ అయ్యేవ‌ర‌కు వెయిట్ చేయాల్సి వ‌చ్చిందే త‌ప్ప ప్ర‌త్యేకించి ఒత్తిడి వ‌ల్ల ఏమీ కాదు.

* ఇందులో చెప్పులు తొడిగే స‌న్నివేశాన్ని... క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోస‌మే చొప్పించిన‌ట్టున్నారు?
- లేదండీ. ఎంతో ప్యూరిటీగా ఉంటే త‌ప్ప ఇలాంటి విష‌యాల‌లో హీరో న‌టించ‌లేరు. తండ్రి మీద ఉన్న ప్రేమ‌ను నిర్వ‌చించ‌డానికి అలాంటి స‌న్నివేశాన్ని పెట్టాను. అంతేగానీ యాడ్స్ కోసం కాదు.

Srikanth Addala interview gallery

 

* ఇందులో బంధాల‌ను కొత్త‌గా నిర్వ‌చిస్తున్నారా?
- ఉన్న బంధాన్ని కొత్త‌గా చెప్ప‌డ‌మే కానీ, బంధాల‌ను నిర్వ‌చించే సాహ‌సాలేం చేయ‌లేదు.

* నేప‌థ్య సంగీతం ఎవ‌రితో చేయించారు?
- గోపీసుంద‌ర్ చేశారు. అంద‌రం అనుకునే అత‌నితోచేయించాం.

* ఏడుత‌రాల గురించిన అంశాలుంటాయ‌ట‌?
- సినిమాలో చూడాలండీ.

* ఇందులో హీరో ఏం చేస్తుంటారు?
- సినిమాలో చూడాలండీ.

* ఇందులో ప్ర‌త్యేకించి యాస ఏమైనా ఉంటుందా?
- లేదండీ. మామూలుగానే ఉంటుంది.

* గ‌ణేష్ పాత్రోని మిస్ అయ్యారా?
- అవునండీ. ఎస్వీఎస్‌సీకి ఆయ‌న సాయం తీసుకున్నాను. ఈ క‌థ‌ను కూడా ముందు ఆయ‌న‌కే చెప్పాను. మూడు పేజీల్లో ఆయ‌న స్వ‌ద‌స్తూరీతో రాసిచ్చారు.

* ఈ సినిమా గురించి మీరేం చెప్ప‌ద‌ల‌చుకున్నారు?
- నాకు మ‌నుషులంటే చాలా ఇష్ట‌మండీ. న‌లుగురి మ‌ధ్య ఉంటే బాధ‌ల‌న్నిటినీ మ‌ర్చిపోతాం. అలాగా న‌లుగురు కుటుంబాల మ‌ధ్య ఉన్న అంశాల‌తో ఈ సినిమాను చేశాం. పండుగ‌లా ఉంటుంది.

* స్క్రిప్ట్ విష‌యంలో ఎవ‌రి సాయం తీసుకున్నారు?
- శ్రీర‌మ‌ణ‌, ఖ‌దీర్‌బాబు, కిశోర్, కృష్ణ చైత‌న్య‌, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ స‌హ‌కారం ఈ సినిమా స్క్రిప్ట్ లో ఉంది.

* ఇందులో హీరోకి పేరు ఉంటుందా?
- లేదండీ. నేనెప్పుడూ హీరోకి పేరు రాసుకోను. నేను కూడా ఎవ‌రినీ పేరు పెట్టి పెద్ద‌గా పిల‌వ‌ను కాబ‌ట్టి ఆ అవ‌స‌రం అనిపించ‌దు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved