pizza
Srinivas Avasarala interview (Telugu) about Babu Baga Busy
మాతృక చూసి రీమేక్‌లో న‌టించ‌కూడ‌దు అనుకున్నాను - అవ‌స‌రాల శ్రీనివాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

03 May 2017
Hyderabad

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం `బాబు బాగా బిజీ`. బాలీవుడ్ హిట్ చిత్రం `హంటర్‌` చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా హీరో అవ‌స‌రాల శ్రీనివాస్‌తో ఇంట‌ర్వ్యూ...

మంచి ఎమోష‌న్స్ ఉన్న మూవీ...
- న‌వీన్ మేడారం `బాబు బాగా బిజీ` సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కంటే ముందు న‌వీన్ మేడారం హాలీవుడ్‌లో సినిమాలు చేశాడు. ఆ సినిమా విఎఫెక్స్ కోసం ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు అభిషేక్ పిక్చ‌ర్స్‌తోప‌రిచయం అయ్యింది. అభిషేక్ పిక్చ‌ర్స్ హంటర్ సినిమాను రీమేక్ చేయాల‌నుకోవ‌డం న‌వీన్ మేడారంను అడ‌గ‌డం ఆయ‌న ఒప్పుకోవ‌డం జ‌రిగింది. ట్రికి లైన్‌ను ఎక్క‌డా క‌మ‌ర్షియ‌ల్‌గా కాకుండా మంచి ఎమోష‌న్స్‌తో తీసిన సినిమా.

ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయని పాత్ర‌...
- నా వ‌ర‌కు `బాబు బాగా బిజీ` చిత్రంలో నేను చేసిన పాత్ర నాకు చాలా కొత్త‌గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేయ‌న‌టువంటి పాత్ర‌. అస‌లు ప్రేక్ష‌కులు నా పాత్ర‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారోన‌ని అతృత‌గా ఎదురుచూస్తున్నాను.

స‌రైన నిర్ణ‌య‌మే...
- ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి ముందు వ‌ర‌కు నేను `హంట‌ర్‌` సినిమా చూడ‌లేదు. హంట‌ర్ సినిమా చూడ‌మ‌ని నిర్మాత‌లు చెప్ప‌గానే స‌రేన‌ని చూడ‌టం స్టార్ట్ చేశాను. ముందు అర‌గంట నుండి ముప్పావు గంట వ‌ర‌కు ఈ సినిమా నేను చేయ‌కూడ‌ద‌నే అనుకున్నాను. కానీ సెకండాఫ్ స్టార్ట్ కాగానే స్నేహితుల మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాలు, ఎమోష‌న్స్ అన్నీ బావున్నాయి.దాంతో సినిమా చేయాల‌నుకున్నాను. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌న్నీ ఏంటి..ఇప్పుడు ఇలాంటి సినిమా చేస్తే ఎలా ఉంటుందోన‌ని కూడా ఆలోచించాను. అయితే చేయాల‌నే నిర్ణ‌యం స‌రైన‌దిగా అనిపించింది.

త‌ప్ప‌కుండా ప్ర‌భావం...
- ఇంటిమెసీ ఉన్న సీన్స్‌లో ఎలా చేశావ‌ని చాల మంది న‌న్ను అడిగారు. అయితే నేను సినిమాల్లోకి రాక‌ముందు స్టేజ‌స్‌పై చాలా నాట‌కాలు వేశాను. అందులో ఇంటిమెసీ ఉన్న సీన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సీన్స్ చేసేట‌ప్పుడు సీన్ కంటే సెట్‌లోని వాతావ‌ర‌ణం ముఖ్యం. మ‌నం చేసేట‌ప్పుడు డైరెక్ట‌ర్‌, కెమెరామెన్‌, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, కో యాక్ట‌ర్స్‌ అంద‌రూ ఎలా రియాక్ట్ అవుతున్నార‌నేది ముఖ్యం. ఇవే మ‌న‌కు కంఫ‌ర్ట్‌ను క్రియేట్ చేస్తాయి. ఈ సినిమాలో ప‌నిచేసిన వాళ్ళంద‌రూ ప్రొఫెష‌న‌ల్స్ కావ‌డం వ‌ల్ల ఇంటిమెసీ సీన్స్ చేసేట‌ప్పుడు ఇబ్బందిగా ఫీల‌వ‌లేదు.

చిన్న చిన్న మార్పులు..
- హిందీ హంట‌ర్ సినిమా క‌థ‌లోని ఆత్మ‌ను అలాగే చేశాం. అయితే తెలుగు నెటివిటీకి త‌గిన విధంగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశాం.

Srinivas Avasarala interview gallery

ప్రభావం ఉంటుంది...
- నేను ముప్పై హ‌త్య‌లు చేసిన సినిమాలో యాక్ట్ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత నువ్వు మ‌ర్డర్ చేస్తావా అని ఎవ‌రు అడ‌గరు. కానీ `బాబుబాగా బిజీ` సినిమా చూసిన త‌ర్వాత ఆ సినిమా ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుంద‌ని మాత్రం చాలా మంది అడుగుతారు. అయితే నేనొక విష‌యం చెప్ప‌ద‌లుచుకున్నాను. మ‌నం చేసే ప్ర‌తి సినిమాపై మ‌నపై ప్ర‌భావం చూపుతుంది. కాబ‌ట్టి `బాబు బాగా బిజీ` చిత్రం కూడా క‌చ్చితంగా నాపై కొంత ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌నే అనునుకుంటున్నాను.

మా ఇంట్లో అంతే...
- మా ఇంట్లో సినిమాల గురించి పెద్ద‌గా మాట్లాడ‌రు. `అష్టాచ‌మ్మా` సినిమా గురించి కూడా నేను చేసే వ‌ర‌కు తెలియ‌దు. ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమా చూసిన త‌ర్వాత మా నాన్న‌గారు బావుందిరా అని మాత్రం అన్నారు. హంట‌ర్ సినిమాను నేను రీమేక్ చేస్తున్నాన‌ని తెలియ‌గానే చాలా మంది నా స్నేహితులు పాజిటివ్‌గానే స్పందించారు.

బాహుబ‌లి -2తో పోటీ ప‌డ‌న‌క్క‌ర్లేదు..
- మా సినిమా బాహుబ‌లి-2తో పోటీప‌డ‌క్క‌ర్లేదు. మా సినిమా బ‌డ్జెట్ లిమిట్‌లో ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్ముతున్నాం. నిజానికి బాహుబ‌లి కంటే ముందుగానే రావాలి. కానీ బాహుబ‌లి-2 కార‌ణంగా వారం పోస్ట్ పోన్ చేశాం.

ఇబ్బందేం ప‌డ‌లేదు..
- నలుగురు ప్రొఫెష‌న‌ల్ హీరోయిన్స్ ఉన్నారు. అంద‌రి క్యారెక్ట‌ర్స్‌కు ప్రాముఖ్య‌త ఉంది. ప్ర‌తి హీరోయిన్ పాత్ర నా పాత్ర‌ను ఎలివేట్‌చేయ‌డాన్నే తెర‌పై చూస్తారు. ఇబ్బంది ప‌డ్డ స‌న్నివేశాలు ఏం లేవు.

నేను జోక్యం చేసుకోను..
- స్క్రిప్ట్ రీడింగ్ స‌మ‌యంలో న‌న్ను రెండు సార్లు పిలిచారు. చ‌దివి డెవ‌ల‌ప్‌మెంట్ ఉండే చెప్పానే త‌ప్ప‌, ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ అయిన త‌ర్వాత నేను జోక్యం చేసుకోలేదు.

మ్యూజిక్ గురించి..
- సునీల్‌క‌శ్య‌ప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ట్యూన్ కంటే మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మ్యూజిక్ ప‌ట్ల చాలా హ్యాపీగా ఉన్నాను.

త‌దుప‌రి చిత్రాలు..
- అమీ తుమీ సినిమా పూర్త‌య్యింది. సెల్ఫీ అనే సినిమాలో మంచి రోల్ చేస్తున్నాను. అలాగే శిరీష్‌, విఐ ఆనంద్ చేస్తున్న సినిమాలో కూడా న‌టిస్తున్నాను. నా ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు సంబంధించిన క‌థ ఓకే అయ్యింది. థ్రిల్లర్ కాన్సెప్ట్‌. స్క్రీన్‌ప్లే రెడీ అవుతోంది. ఆ సినిమా వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved