pizza
Sumanth Ashwin interview about Right Right
కండక్టర్ పాత్ర చేయాలనగానే నాకు ఆయనే గుర్తుకు వచ్చారు – సుమంత్ అశ్విన్
You are at idlebrain.com > news today >
Follow Us

08 June 2016
Hyderaba
d

వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన చిత్రం `రైట్ రైట్`. ఈ చిత్రం జూన్ 10న విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ సినిమా గురించి చెప్పిన విశేషాలు... 

విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ....
రైట్ రైట్ అరకు సమీపంలోని గవిటి గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. ఒరిస్సాకు సరిహద్దులో ఉండే ఆ గ్రామంలో కరెంట్‌ కానీ సెల్‌ఫోన్‌ వంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. గవిటి నుంచి యస్‌. కోటకు వెళ్లే ఆర్టీసీ బస్సు నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ చిత్రంలో ప్రేమ కంటే థ్రిల్లింగ్‌సస్పెన్స్‌ అంశాలు ఎక్కువగా ఉంటాయి.

మార్పులు చేశాం...
మలయాళ చిత్రం అర్డినరీ మూడు గంటల సినిమా కానీ తెలుగు ప్రేక్షకులు అంత సేపు సినిమాను చూడరు. అందుకనే మన తెలుగు ప్రేక్షకులకు తగిన విధంగా చేంజస్ చేశాం. ముఖ్యంగా సెకండాఫ్ లో ఏ మార్పులు చేయలేదు. ఫస్టాఫ్ లెంగ్త్ ను తగ్గించాం.  తెలుగులో సినిమా వ్యవధి రెండు గంటలలోపే.

క్యారెక్టర్ గురించి...
పోలీస్ కావాలనుకుని కొన్ని పరిస్థితుల రీత్యా బస్ట్ కండెక్టర్ గా మారిన యువకుడి క్యారెక్టర్ ఇది. అయితే ఆ యువకుడు కండక్టర్‌ ఉద్యోగం ఎందుకు చేయాల్సి వచ్చిందిచేరిన తర్వాత ఆ యువకుడి జీవితంలో జరిగిన మార్పులేంటి అనే తరహాలో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతుంది.

Sumanth Ashwin interview gallery

కండక్టర్ పాత్ర అనగానే ఆయనే గుర్తుకు వచ్చారు...
డైరెక్టర్ మను కథ చెప్పేటప్పుడు నాది కండక్టర్ పాత్ర అనగానే నాకు రజనీకాంత్ గుర్తొచ్చారు. పోలీస్పైలెట్కండక్టర్ లాంటి పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని బాగా నమ్మకం. అందుకే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ పాత్ర చేయడానికి కొన్నిసార్లు ఆర్టీసి బస్ లో ప్రయాణించి కండక్టర్లు ని గమనించాను. మెహన్ లాల్ గారి పాత సినిమా ఒకటి చూశాను. అందులో  ఆయన బాడీ లాంగ్వేజ్ ఆర్టీసీ కండెక్టర్ లా ఉంటుంది. అలాగే రైట్ రైట్ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్‌ ను పాత్రకు తగిన విధంగా మార్చుకున్నాను.

డైరెక్టర్ మను వర్కింగ్ స్టయిల్.....
దర్శకుడు మను చాలా సాఫ్ట్. కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ సినిమా విషయానికి వస్తే తను సినిమాని చాలా బాగా తీశాడు. అంతేకాకుండా సినిమాటోగ్రాఫర్ శేఖర్ వి. జోసఫ్ వల్ల సినిమా క్వాలిటీ పెరిగింది. ఆయనతో ఒక్కడు నుండి పరిచయం ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది.

కాళికేయ ప్రభాకర్ గురించి....
ప్రభాకర్ తో నాకు మొదట్లో అంత పరిచయం లేకపోవడంతో రెండు రోజులు ఇబ్బంది పడ్దా ఆ తరువాత మాఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. ఎలాగైనా సినిమా బాగా చేయాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఈ సినిమాలో కాళికేయ ప్రభాకర్ డ్రైవర్ గా నటిస్తున్నాడు. తనకి జంట ఉండదు కానీ ఎవరైనా లేడీ కండక్టర్స్ కనిపిస్తే ఫ్లర్ట్ చేస్తుంటాడు. ప్రభాకర్ కి ఈ సినిమా మంచి పేరు తెస్తుంది.

నాన్నగారు సినిమా బావుందన్నారు...
సినిమా పరిశ్రమలో నాన్నకు ఉన్న అనుభవంతో మంచి జడ్జిమెంట్‌ ఇస్తారు. నేను ఏదైనా కథ విన్నాకసాధారణంగా నాన్నకు చెప్పిఆయన సలహాలు తీసుకుంటుంటాను. ఆయన సినిమా చూసిన తర్వాత నాతో మాట్లాడకుండా వెళ్లిపోతే సినిమా బాలేదని, నవ్వితే బావుందని, షేక్ హ్యాండ్ ఇస్తే సూపర్ హిట్ అని అర్థం.

ఈ సినిమా చూసిన ఆయన ఈ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ద్వితీయార్థం చాలా బాగుందన్నారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
ఓ రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయి. ఆ సినిమా నిర్మాతలే త్వరలో ఆ వివరాలు ప్రకటిస్తారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved