pizza
Sundeep Kishan interview about Run
ప్రొడక్షన్ చేయాలనే కోరికైతే ఉంది – సందీప్ కిషన్
You are at idlebrain.com > news today >
Follow Us

22 March 2016
Hyderaba
d

సందీప్‌ కిషన్‌అనీషా అంబ్రోస్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'రన్'. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరికిషోర్‌ గరికపాటిఅజయ్ సుంకర నిర్మించారు. అని కన్నెగంటి దర్శకుడు. తమిళ చిత్రం'నేరంరీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 23న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ తో ఇంటర్వ్యూ.....

క్యారెక్టర్ గురించి....
ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అంటే మన చుట్టూ పక్కల వ్యక్తిలా కనపడే రోల్. చాలా జెన్యూన్ గా సాగే పాత్ర. యాక్టర్ గా కూడా ఓ డిఫరెంట్ క్యారెక్టర్, జెన్యూన్ పెర్ ఫార్మెన్స్. తనకు జరిగే పరిస్థితులు వల్ల మనకు టెన్షన్, కామెడి క్రియేట్ అవుతాయి.  

బాబీ సింహ చేయడమే పెద్ద ప్లస్....
ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో యాక్ట్ చేసిన బాబీసింహ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోగానే తన ప్లేస్ ను ఎవరితో చేయించాలి. ఒక పక్క నవ్విస్తూనే, భయపెట్టేలా ఉండాలి కదా అనుకున్నాం. అయితే లక్కీగా మాతృకలో చేసిన బాబీ సింహనే తెలుగులో కూడా ఈ రోల్ చేశాడు. తను చేయడమే పెద్ద ప్లస్. తెలుగు ప్రేక్షకులకు కూడా తను బాగా కనెక్ట్ అవుతాడు.

చేంజస్ ఏమీలేవు...
తమిళంలో పోల్చితే పెద్దగా చేంజస్ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇది నెటివిటీకి సంబంధించిన కథాంశం కాదు. సిటీ నేపథ్యంలో సాగే సినిమా. హీరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఉద్యోగం పోయిన తర్వాత తనకు ఎదురయ్యే సమస్యలేంటనేదే కథ. థ్రిల్లర్, టెన్షన్ ను కొనసాగించే వినోదాత్మక చిత్రం. జరిగే ఘటనల నుండి కామెడి పుడుతుంది. ఎమోషన్, టెన్షన్, కామెడి ఎలిమెంట్స్ సినిమాలో డ్రైవింగ్ ఎలిమెంట్స్.

బిజినెస్ స్పాన్ కోసం కాదు...
తమిళంలో సినిమా చేయడానికి బిజినెస్ స్పాన్  కారణం కాదు. ఒక మంచి సినిమా కుదిరింది, చేయమని అడిగారు. అందుకనే చేస్తున్నాను.

వేరో ఆలోచన లేకుండానే....
నేను ఇండస్ట్రీలో బాగా ప్రేమించే వ్యక్తుల్లో అనీల్ సుంకరగారు ఒకరు. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన హెల్ప్ చేశారు. ఈ సినిమాను ముందు దాసరిగారు చేస్తారని అన్నారు. కానీ ఓ రోజు అనీల్ సుంకరగారు ఫోన్ చేసి ఈ సినిమా చేద్దామని అన్నారు. నాకు నచ్చిన సినిమా, అనీల్ సుంకర్ గారు అడగటంతో వేరే ఆలోచన లేకుండా వెంటనే ఒప్పుకున్నాను.

 

Sundeep Kishan interview gallery

హీరోయిన్ గురించి....
అనీషా స్వీట్ గర్ల్, ఫోకస్డ్ పర్సన్. తనని తాను ప్రూవ్ చేసుకోవాలని కష్టపడింది. మంచి కోస్టార్.

కోరిక ఉంది...
లఘుచిత్రాలు లక్ష రూపాయలుంటే పూర్తవుతాయి. కానీ సినిమా అంటే నాలుగైదు కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు అంత డబ్బు నాదగ్గర లేదు. అయితే ప్రొడక్షన్ చేయాలనే కోరికైతే ఉంది.

అని కన్నెగంటితో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్....
అని కన్నెగంటి, టాలెంటెడ్, టెక్నికల్లి బ్రిలియంట్ పర్సన్. సక్సెస్ ఫెయిల్యూర్స్ ను బట్టి వ్యక్తి టాలెంట్ ను అంచనా వేయడం తప్పు.

పెళ్ళి ఆలోచన...
నాకింకా ముప్పై కూడా రాలేదు. అంతే కాకుండా ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన అస్సల్లేదు. ఇంట్లో వాళ్లు కూడా తొందర పెట్టడం లేదు.

తదుపరి చిత్రాలు...
ఒక్క అమ్మాయి తప్ప చిత్రాన్ని ఏప్రిల్ ఎండింగ్ లేదా మే నెలలో ప్లాన్ చేస్తున్నాం. నేను, రెజీనా యాక్ట్ చేసిన మా నగరం చిత్రాన్ని తెలుగులో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. వేదం తరహాలో డిఫరెంట్ మూవీ. నేను ఇలాంటి సినిమా చేశానని ఫ్యూచర్ లో చెప్పుకునేలా ఉంటుంది.  అలాగే సి.వి.కుమార్, స్టూడియో గ్రీన్ కాంబినేషనల్ మూవీ కూడా తెరెక్కుతోంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved