pizza
Sunil interview (Telugu) about Chitralahari
మ‌నం ఫెయిల్ అయితే మ‌న‌ల్ని హర్ట్ చేసేవాళ్లే ఎక్కువ - సునీల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

14 April 2019
Hyderabad


సాయితేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మాత‌లు. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా గురించి న‌టుడు సునీల్ ఇంట‌ర్వ్యూ...

- చిన్న‌ప్ప‌ట్నుంచి(కాలేజ్‌లో చ‌దువుకున్న రోజుల నుండి) చెప్పుకుంటూ పోతే లిస్టు స‌రిపోదేమో.. చాలా మంది ఉన్నారు.

- ఏదొచ్చినా త్రివిక్ర‌మ్‌కి చెప్పుకోవాల‌ని ఉంటుంది. త‌ను బేసిక్ మంచి ఫ్రెండే కాదు.. త‌నలో మంచి టీచ‌ర్ కూడా ఉన్నాడు. ఎవ‌రైనా బాధ‌ల్లో ఉంటే వారికి త‌ను ధైర్యం చెబుతాడు. మేం అంద‌రం రూమ్‌లో ఉంటున్న‌ప్పుడు ఏదైనా క‌ష్టం వ‌చ్చి.. రూమ్ కెళితే మాలో కాన్ఫిడెన్స్ పెంచేవాడు. చిన్న‌ప్ప‌ట్నుంచి త్రివిక్ర‌మ్‌తో మంచి ప‌రిచ‌యం ఉంది.

- ఇప్పుడున్నంత టెక్నాల‌జీ ఒక‌ప్పుడు లేదు. నేను ఒక‌ర్ని ఏడిపించ‌డం లేదు. న‌వ్వించి సంపాదించుకుంటున్నాను. రీసెంట్‌గా ఒక‌రు నేను చనిపోయిన‌ట్లు యూ ట్యూబ్‌లో పెట్టారు. దాని వ‌ల్ల వాళ్ల‌కి వ‌న్ మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే.. త‌ను సారీ త‌ప్పైపోయింద‌ని చెప్పాడు. స‌రేన‌ని వ‌దిలేశాను. త‌న‌ని అరెస్ట్ చేయించి ఇబ్బంది పెడితే నాకు ఏమోస్తుంది.

- మ‌నం ఫెయిల్ అయితే మ‌న‌ల్ని హర్ట్ చేసేవాళ్లే ఎక్కువ. స‌క్సెస్ అయితే పొగిడేవాళ్లు ఎక్కువ అవుతారు. మ‌నల్ని మ‌నం ప‌వ‌ర్‌ఫుల్ అనుకోక‌పోతే బ్ర‌త‌క‌లేం. కానీ ఎప్ప‌టికీ మ‌న చుట్టూ ఉన్న సిట్యువేష‌నే ప‌వ‌ర్‌ఫుల్‌. అదే మ‌న అవ‌స‌రాల‌ను నిర్ణ‌యిస్తుంది. ఒక‌ప్పుడున్న ప్ర‌యారిటీ ఇప్పుడు మారిపోతుంటుంది. హర్ట్ కాకుండా పోవ‌డం అనేది ఉండ‌దు. ప్ర‌తి విష‌యం నుండి నేర్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి.

- గెలుపు, ఓట‌మి అనే దాన్ని దేవుడు నిర్ణ‌యించ‌లేదు. మ‌నం పెట్టుకున్న గేమ్ ఇది. ఉదాహ‌ర‌ణ‌కు 100మీ. ప‌రుగు పందెం పెట్టుకున్న‌ప్పుడు అంద‌రూ ఎవ‌రు నెగ్గితే వాళ్లు గొప్పోళ్లు. ఇలా ఎవ‌రికి ఒక‌రు ఓ ప్రొఫ‌ష‌న్‌ను ఎంచుకుని ముందుకెళుతుంటాం. నెగ్గిన వాడిని ఎవ‌రూ ఎంక‌రేజ్ చేయ‌క‌పోయినా ప‌రావాలేదు. కానీ ప‌డిపోయిన వాడిని లాగేయ‌కూడదు. ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుండి హీరో అయ్యాను. ఫెయిల్యూర్స్ వ‌చ్చాయి. అయితే నాకు ద‌క్కిన అదృష్టం ఏంటంటే.. నాకు ఇక్క‌డ అంద‌రితోనూ అనుబంధం బావుంది. ఏదో ర‌కంగా నాకు అంద‌రూ హెల్ప్ చేశారు.

- హీరోగా ఓ జోల్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాను. ఉదాహ‌ర‌ణ‌కు జాకీచాన్ ఉన్నాడు. ఆయ‌న కామెడీ హీరో. మ‌న ఇండియాలో తండ్రి పాత్ర‌ల‌కు పొట్ట‌లుంటాయి. చైనాలో ఫాద‌ర్ క్యారెక్ట‌ర్స్ కూడా సిక్స్ ప్యాక్ ఉంటుంది. మ‌న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఇక్క‌డి పాత్ర‌లుంటాయి. నేను హీరోగా మారిన త‌ర్వాత మీరు ఎలాంటి హీరో కావాల‌నుకుంటున్నార‌ని ఒక‌రు అడిగారు. ఆయ‌న మ‌ళ్లీ యాక్ష‌న్ కామెడీ చేయ‌మ‌ని చెప్పారు. నేను సిన్సియ‌ర్‌గానే ట్రై చేశాను. సినిమాల్లో నేను కొన్ని నేను ఒప్పుకున్నవి ఉంటే.. కొన్ని నాకు న‌చ్చిన‌వి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు న‌చ్చ‌క‌.. వాళ్ల‌కి న‌చ్చిన సినిమాలు చేసిన‌వి ఉన్నాయి. అందాల రాముడు స‌క్సెస్ త‌ర్వాత క‌మెడియ‌న్‌గానే సినిమాలు చేసుకుంటూ ఉంటాం. మ‌న‌కు సూట్ అయ్యే క్యారెక్ట‌ర్ వ‌చ్చిన‌ప్పుడు సినిమా చేద్దామ‌ని అనుకున్నాను. కానీ నెమ్మదిగా ద‌ర్శ‌క నిర్మాత‌లు క‌మెడియ‌న్ పాత్ర‌ల‌కు న‌న్ను అప్రోచ్ కావ‌డం త‌గ్గించేశారు. అంతే కానీ నేను ఎక్క‌డా క‌మెడియ‌న్‌గా చేయ‌లేన‌ని చెప్ప‌లేదు.

- సోష‌ల్ మీడియా ఎక్కువైంది. మా ఇంట్లో నేను సైకిల్ కొన్న‌ది కూడా మీ అంద‌రి బ్రెయిన్స్‌లో న్యూస్ అయిపోతే, మీ బ్రెయిన్‌ను నేను ఎంగేజ్ చేస్తున్న‌ట్లేగా. చెత్త ఇన్‌ఫ‌ర్మేష‌న్‌తో మీ బుర్ర‌లో ఆలోచ‌న‌ల‌ను నేను ఆపేస్తున్న‌ట్లేగా. సోష‌ల్ మీడియాలో నా పార్టిసిపేష‌న్ చాలా త‌క్కువ‌.

- తేజు సినిమాల్లోకి రాక ముందు నుండే ప‌రిచ‌యం. త‌నంటే నాకు బాగా ఇష్టం. మంచి విష్ణు, మ‌నోజ్ వాళ్ల‌కి తేజు మంచి స్నేహితుడు. నేను సినిమాల్లో చేస్తున్న‌ప్పుడు త‌ను న‌న్ను క‌లిస్తుండేవాడు. అప్పుడు త‌న‌తో త‌మ్ముడు .. నేను ఎప్ప‌టికైనా నిన్ను హీరోగా పెట్టి సినిమ చేసేస్తాను అని అంటుండేవాడిని. ఇన్నాళ్ల‌కు తేజుతో క‌లిసి పనిచేసే అవ‌కాశం క‌లిగింది.

- మ‌న సినిమాలే కాపీ. హాలీవుడ్‌లో వచ్చిన త‌ర్వాతే మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది కానీ.. మ‌న ద‌గ్గ‌రకు వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌దు. సినిమా విష‌యంలో మ‌నం ఫాలోవ‌ర్స్ మాత్ర‌మే. హాలీవుడ్ కూడా ప్ర‌పంచంలో ఏది ఉత్త‌మ‌మో దాన్నే తీసుకుంటుంది.

- త‌దుప‌రి బ‌న్ని, త్రివిక్ర‌మ్ సినిమా చేస్తున్నాను. మ‌రో రెండు పెద్ద సినిమాలు డిస్క‌ష‌న్‌లో ఉన్నాయి. మ‌రో పెద్ద స్టార్ సినిమాలో కూడా న‌టించ‌బోతున్నాను.

 




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved