pizza
Sunil interview (T) about Silly Fellows
దానికి జయాపజయాలతో సంబంధం ఉండదు - సునీల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

3 September 2018
Hyderabad

అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్రాశుక్లా, పూర్ణ, నందినిరాయ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'సిల్లీఫెలోస్‌'. భీమనేని శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సునీల్‌తో ఇంటర్వ్యూ...

ఫన్‌ రైడ్‌...
- లాజిక్‌ కన్నా మ్యాజిక్‌ ఎక్కువగా ఉండే ఫన్‌ రైడర్‌ 'సిల్లీఫెలోస్‌'. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో జయప్రకాష్‌ రెడ్డి సన్నివేశం ఒకటి 20 నిమిషాలు ఉంటుంది. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా ఉంటుంది.

అలా అనిపించలేదు...
- నేను, నరేశ్‌ కలిసి ఇది వరకు నటించాం. కాబట్టి.. ఈ సినిమాలో కలిసి నటించడం నాకు కొత్తగా అనిపించలేదు. సినిమాలో నరేషే హీరో అయినా... నా పాత్రకు ఎక్కువ స్కోప్‌ ఉంటుంది.

క్లైమాక్స్‌ మారింది...
- ఇది తమిళ సినిమాకు రీమేకే అయినా.. చివరి అరగంట సినిమాను భీమనేనిగారు పూర్తిగా మార్చేశారు. కామెడీకి నెటివిటీకి సంబంధం ఉండదు. తమిళ సినిమాలు అయినా.. మలయాళ సినిమాల్లో అయినా కామెడీ మనకు దగ్గరగా ఉంటుంది.

అది వాళ్ల ఆలోచన....
- నేను హీరోగా చేస్తున్నప్పుడు కమెడియన్‌గా నటించమని ఎవరూ అడగలేదు. అది నన్ను అడగకుండా నేను కమెడియన్‌గా నటించనేమో అనుకోవడం వాళ్ల ఆలోచన. నాకు దాంతో సంబంధం ఉండదు కదా! అందాల రాముడు తర్వాత మర్యాద రామన్న చేసే వరకు నేను కమెడియన్‌గానే నటించాను. తర్వాత వరుస కమిట్‌మెంట్స్‌ కారణంగా కామెడీ పాత్రల్లో నటించలేకపోయాను.

interview gallery



ఆ రోజులు గుర్తుకు వచ్చాయి...
- నేను మళ్లీ త్రివిక్రమ్‌గారి దర్శకత్వంలో చేయడానికి వస్తున్నప్పుడు ఎలా చేస్తానేమో అని త్రివిక్రమ్‌గారు అనుకున్నారట. కానీ నాకు అలాంటి ఆలోచనలేం లేవు కాబట్టి లైట్‌గా నా స్టయిల్లో చేసుకుంటూ వెళ్లిపోయాను.

అది మనల్ని బట్టే ఉంటుంది...
- ఎదుటివారు మనల్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది మనల్ని బట్టే ఉంటుంది. జయాపజయాలను బట్టి ఆధారపడి ఉండదు.

కథ దొరకాలి...
- ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడం లేదు. కమెడియన్‌గానే చేస్తున్నాను. అయితే రెండు సినిమాల కమిట్‌మెంట్‌ ఉంది. నా బాడీలాంగ్వేజ్‌కు తగ్గ కథ దొరికితే ఆ రెండు సినిమాల్లో హీరోగా నటిస్తాను. రీమేక్‌ కథలైతే సేఫ్‌ అనుకుంటున్నాను.

ఏదీ ప్లాన్‌ చేసుకోవడం లేదు...
- నేను ఏదీ ప్లాన్‌ చేసుకుంటూ వెళ్లడం లేదు. ఇప్పటి వరకు సాధించాల్సినవన్నీ చేసుకుంటూ వచ్చాను. విలన్‌ అవుదామని వచ్చిన నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మారాను, శ్రీకారం సినిమాలో సైడ్‌ డాన్సర్‌గా కూడా కనపడ్డాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మూడు కథలను తయారు చేసుకున్నాను కూడా. ఎవరైనా ఆ కథలు బావున్నాయంటే వారికిచ్చేస్తాను. అలాగే రేపు దర్శకత్వం చేయాలనిపిస్తే తప్పకుండా చేస్తాను. ఇప్పట్లో ఆలోచనలేం లేవు.

తదుపరి చిత్రాలు..
- ఎన్టీఆర్‌తో కలిసి అరవింద సమేతలో నటిస్తున్నాను. అలాగే అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాలో కూడా నటిస్తున్నాను.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved