pizza
Sunil Kumar Reddy interview (Telugu) about ATM working
రియ‌ల్ ఎక్స్‌పీరియెన్సెస్‌ను బేస్ చేసుకుని చేసిన ఎక్స్‌పెరిమెంట్‌లాంటి చిత్ర‌మే `ఎ.టి.ఎం వ‌ర్కింగ్‌` - సునీల్‌కుమార్ రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

15 March 2017
Hyderabad

పెద్ద నోట్లరద్దు నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఏటిఎం. వర్కింగ్‌’. పెద్ద నోట్లు రద్దయిన నవంబర్‌ 8 నుండి డిసెంబర్‌ 31 వరకు జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కథని డిజిక్విస్ట్‌ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కిషోర్‌ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మాతలు. సునీల్‌ కుమార్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా మార్చి 17న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు సునీల్‌కుమార్ రెడ్డితో ఇంట‌ర్వ్యూ....

అందుకే టైటిల్ మార్చాం...
- ముందు సినిమా టైటిల్‌ను ఎ.టి.ఎం నాట్ వ‌ర్కింగ్ అనే అనుకున్నాం. అయితే సెన్సార్ వాళ్ళు టైటిల్ గ‌వ‌ర్న‌మెంటుకు వ్య‌తిరేకంగా ఉంద‌ని అభ్యంత‌రం తెలియ‌జేశారు. దేశ ప్ర‌తిష్ట‌కు ఇబ్బంది క‌లిగించేలా ఉండ‌కూద‌నే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశామ‌ని నేను సెన్సార్ వాళ్ళ‌కు చెప్పాను. అయితే వాళ్ళు చివ‌ర‌కు నాట్‌ను టైటిల్‌లో పెట్ట‌కూడ‌ద‌ని చెప్ప‌డంతో టైటిల్ మార్చాం. ఫైన‌ల్‌గా సినిమా కాన్సెప్ట్ అయితే మేం ఏదైతే అనుకున్నామో, దాన్ని సినిమాలో చూపిస్తున్నాం. ఇంకో విష‌య‌మేమంటే ఈ సినిమాలో సైలెంట్ కార్డ్స్‌ను కూడా తీసేయ‌మ‌ని సెన్సార్ వాళ్ళు చెప్పారు. నరేంద్ర‌మోడీగారికి థాంక్స్ అని సైలెంట్ కార్డ్ పెట్టాను. సెన్సార్ వాళ్లు అభ్యంత‌రం చెబితే మోడీగారికి థాంక్స్ చెప్ప‌కూడ‌దా అని అన్నాను. అయితే సెన్సార్ వారు అందులో వెట‌కార‌మేదో క‌న‌ప‌డుతుంద‌ని చెప్ప‌డంతో చివ‌ర‌కు తీసేశాం..సైలెంట్ కార్డ్స్‌కు కూడా సెన్సార్ చేయ‌డం దేశంలో ఇదే ఫ‌స్ట్ టైం అనుకుంటా.

కాన్సెప్ట్ గురించి...
- సినిమాలో డి మానిటైజేష‌న్ టైంలో దాదాపు ఎ.టి.ఎంలేవీ ప‌నిచేయ‌లేదు. న‌వంబ‌ర్ 8 నుండి డిసెంబ‌ర్ 31వ‌ర‌కు ఉన్న స‌మయంలో ఏం జ‌రిగింద‌నేదే క‌థ‌. అదే ఈ సినిమా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాను. ఇదొక ల‌వ్ స్టోరీ. సాధార‌ణంగా ప్రేమ‌క‌థ‌లు కాలేజ్‌లోనో, బ‌స్‌స్టాపుల్లోనో పుడుతుంటాయి. అలాగే ఎ.టి.ఎం. లైన్‌లో పుట్టే ప్రేమ‌క‌థా చిత్ర‌మే ఇది. టాపిక్ సీరియ‌స్ నెస్‌ను ఎక్క‌డా త‌గ్గించ‌లేదు కానీ..దానికి హ్యుమ‌ర‌స్‌ను జోడించి చెప్పాను. 120 కోట్ల మంది ఒక నిర్ణ‌యం వ‌ల్ల ఇబ్బందికి గుర‌య్యారు. ఆ ఇబ్బందుల‌ను డాక్యుమెంటెష‌న్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాను. 50రోజులు చాలా మంది షేర్ చేసుకున్న ఎక్స్‌పీరియెన్స్‌ను సినిమాగా చేసే చిన్న ఎక్స్‌పెరిమెంట్ అనొచ్చు.

ముగ్గురు యువ‌కుల క‌థ‌...
- ఆనంత్‌, త్రిలోక్‌, మ‌హేష్ అనే ముగ్గురు ప‌ని, పాట లేని గ్రాడ్యుయేట్స్ క‌థే మా ఎ.టి.ఎం. డిమానిటైజేష‌న్ వీరి ముగ్గురు జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింద‌నేదే క‌థ‌. మంచి ఎమోష‌న్స్‌ను క్యారీ చేశాను.ప్ర‌తి దాన్ని ఒక క్యారెక్ట‌ర్‌తో వివ‌రించాను.

త‌దుప‌రి చిత్రాలు...
- గ‌ల్ఫ్ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుప‌కుంటుంది. విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved