pizza
Tanikella Bharani about (Telugu) Naruda DONORuda
సెకండ్ ఇన్నింగ్స్ వంటి సినిమా అని అందుకే అన్నా
You are at idlebrain.com > news today >
Follow Us

3 November 2016
Hyderaba
d

సుమంత్ కీల‌క పాత్ర‌లో న‌టించిన సినిమా `న‌రుడా డోన‌రుడా` శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఇందులో త‌నికెళ్ల‌భ‌ర‌ణి కీల‌క పాత్ర‌ను పోషించారు. ఈ సినిమాలోని త‌న పాత్ర గురించి త‌నికెళ్ల భ‌ర‌ణి హైద‌రాబాద్‌లో గురువారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* విక్కీడోనార్‌ను చూసిన‌ప్పుడు నాకు క‌ల్చ‌ర‌ల్ షాక్ క‌లిగింది. మ‌న తెలుగు వాళ్లు ఇలాంటిది యాక్సెప్ట్ చేస్తారా అని అనిపించింది. ఒక‌ప్పుడు సిగరెట్ తాగ‌డం అంటే నేరం. తాగేవాళ్లు ఇలా దాచుకునేవారు. ఆ త‌ర్వాత మామూలుగా జ‌రిగింది. ఆ త‌ర్వాత మందు తాగ‌డాన్ని హ‌వ్వ అనుకునేవారు. ఇప్పుడు ఎవ‌రైనా తాగ‌రు అని అంటే `వారిని పంపేయ‌మ్మా` బ‌య‌టికి అని అంటున్నారు. అలాగ ఏదైనా ప‌రిణామ క్ర‌మంలో యాక్సెప్టెన్స్ వ‌స్తోంది. కాక‌పోతే ఇది చాలా సున్నిత‌మైన అంశం. పిల్ల‌లు లేనివాళ్లక‌యితే వారి న‌ర‌కం మ‌నం వ‌ర్ణించ‌లేం. అలాంటి వాళ్ల కోసం ఫెర్టిలిటీ సెంట‌ర్లు కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా మందికి తెలియ‌దు. ఆ అవ‌స‌రం ఉన్న‌వాళ్ల‌కి త‌ప్ప మామూలుగా తెలియ‌వు క‌దా. ఆ అవ‌సరం ఉన్నా చెప్పుకోలేని ప‌రిస్థితి చాలా మందికి ఉంది. ఎందుకంటే ఆ విష‌యం అలాంటిది కాబ‌ట్టి. అయినా అంత బోల్డ్ గా భ‌లే చెప్పాడే అని అనుకున్నా. హిందీ సినిమా ఇక్క‌డే ఆడింది అని ఆలోచించా. సాఫ్ట్ గా చెప్పాం. ఇలాంటి సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రైనా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గానే చెప్పాం. 99 శాతం ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేస్ చేసుకుని ఆర్ద్రంగా క‌ళ్ల‌నీళ్లు పెట్టేలాగా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాం.

* జ‌న‌ర‌ల్‌గా మ‌న‌వాళ్లు ఉన్న‌దున్న‌ట్టు తీయ‌రు. కానీ ఈ సినిమాను మాత్రం ఉన్న‌దున్న‌ట్టు తీశారు. ఉన్న‌దున్న‌ట్టు అంటే పాత్ర‌లు అవే. సిట్చువేష‌న్స్ అవే. నేటివిటీ ప‌రంగా కొంత మార్చాం. అంత బోల్డ్ కాకుండా ముసుగు, తెర వేసి కొంచెం సున్నితంగా చేశాం.

* ఈ సినిమాను రాసిన కుర్రాళ్లు చాలా బాగా రాశారు. ముచ్చ‌ట‌ప‌డేలా రాశారు. ఎప్పుడైనా ఇలా ఒక మాట అన వ‌చ్చా అని అన్నానేమో కానీ, నేనేమీ ఇందులో చేయ‌లేదు. కాక‌పోతే వ‌ర్కింగ్ డేస్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల నేను వాళ్ల‌తో ఎక్కువ‌గా ట్రావెల్ చేశా. చాలా ఎక్కువ‌గా ఇన్వాల్వ్ అయ్యానేమో.

Tanikella Bharani interview gallery

* ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటి సినిమా అని ఎందుక‌న్నానంటే నేను `య‌మ‌లీల‌` అనే సినిమాలో హీరోకి స‌మానంగా ట్రావెల్ అయ్యాను. క‌న‌క‌మ‌హాల‌క్ష్మి సినిమాలోనూ అంతే. విల‌న్ వేషాలు వేసిన‌ప్పుడూ అంతే. ఆ త‌ర్వాత నేను కేర‌క్ట‌ర్ ఆర్టిస్టుగా చేశాక అంత ఎక్కువ‌గా ట్రావెల్ అయ్యానా? ఈ సినిమాలో అలా థ్రూ అవుట్ ఉంటాను. మామూలుగా కేర‌క్ట‌ర్ ఆర్టిస్టుల‌కి ఒక వారం, ఒక రోజు, ఒన్ షాట్ అలాంటివి వ‌స్తుంటాయి. కానీ చాలా రోజుల త‌ర్వాత మ‌ర‌లా బాధ్య‌త తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ప్ర‌ధాన పాత్ర‌గా ఇంకా కొన్ని సినిమాలు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కం ఉంది.

* ఒక షాట్ చేసినా సినిమాపై ప్రేమ ఉంటుంది. ఎందుకంటే `అత‌డు` సినిమాలో నేను చేసింది నాలుగు రోజులే. కానీ 40 రోజులు చేసిన సినిమాలంత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక్కోసారి ఏమ‌వుతుందంటే.. ముత్యాల‌ముగ్గులో రావుగోపాల‌రావుగారికి ఎంత పేరు వ‌చ్చిందో, మాడాకి అంతే పేరు వ‌చ్చింది. ఒక్కోసారి ఏమ‌వుతుందంటే కొన్ని మొహ‌మాటాలు, కొన్ని త‌ప్ప‌ని ప‌రిస్థితులు, ఒక రోజు వేష‌మైనా మ‌నం చేయ‌గ‌లిగింది కాబ‌ట్టే మ‌న‌ల్ని పిలిచారు క‌దా. లేక‌పోతే ఇంకెవ‌రినైనా పిలిచేవారేమో అనే గౌర‌వం, స‌రే ఒక్క సీన్‌లో మ‌నం ఏం చేయ‌గ‌ల‌మో చూద్దాం అనే ఛాలెంజ్.. ఇవ‌న్నీ క‌లిసి మ‌మ్మ‌ల్ని స‌మాయ‌త్తం చేస్తాయి.

* అక్కినేనిగారి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. నాగేశ్వ‌ర‌రావుగారితో చేశా. నాగార్జున‌తో చేశా. కుటుంబంలో అంద‌రితో చేశా. సుమంత్‌తో చాలా సినిమాలు చేశాను. గోదావ‌రి, స‌త్యం, గోల్కొండ హైస్కూల్‌.. నాకు, సుమంత్‌కి స‌క్సెస్ రేట్ కూడా ఎక్కువే.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved