pizza
Taraka Ratna interview about Raja Cheyyi Vesthe
‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రంలో డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ లో కనపడతాను - తారకరత్న
You are at idlebrain.com > news today >
Follow Us

23 April 2016
Hyderaba
d

నందమూరి నట వారసుడిగా తెరంగేట్రం చేసిన నందమూరి తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో హీరోగా ప్రవేశించి, పలు చిత్రాల్లో నటించిన తారకరత్న అమరావతి చిత్రంలో విలన్ గా కూడా నటించి నంది అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు నారా రోహిత్ హీరోగా వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రంలో హీరోగా నటించాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29 న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ ....

అసంతృప్తి లేదు...
నటుడిగా నా కెరీర్ విషయంలో అసంతృప్తి లేదు. మంచి నటుడ్ని కాబట్టే ఇంకా కొనసాగుతున్నాను. అయితే కెరీర్ స్టార్టింగ్ లో మంచి స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోలేదు. అందుకే ఇప్పుడు స్క్రిప్ట్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నాను.

ఎవరైనా కష్టపడాల్సిందే...
స్వర్గీయ ఎన్టీఆర్ గారి పేరుతో సినిమాల్లోకి సులభంగానే ఎంట్రీ ఇచ్చాను. అయితే ఇక్కడకు వచ్చిన తర్వాత ఎవరైనా కష్టపడాల్సిందే. మన టాలెంట్ ను బేస్ చేసుకునే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. తాతగారి రేంజ్ కు రీచ్ కావడం కష్టం. అయితే రీచ్ కావడానికి ప్రయత్నిస్తాం. కానీ కొందరు అనవసరంగా విమర్శిస్తుంటారు. అలా విమర్శలు చేసేవాళ్లు ముందు వాళ్లని చూసుకుని వేరే వాళ్లని కామెంట్ చేయాలి.

అందరం కలుస్తుంటాం...
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎవరికి వారు బిజీగానే ఉంటున్నాం. ఏ మాత్రం ఖాళీ దొరికినా నేను, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇలా అందరం కలుస్తూనే ఉంటాం.

Taraka Ratna interview gallery

క్రెడిట్ రవిబాబుకే...
నేను అమరావతిలో విలన్ గా నటించడానికి ఆలోచించాను. అప్పుడు రవిబాబు మీకు అవార్డ్ తెప్పించే మూవీ అవుతుందని అన్నారు. ఆయన మాట నమ్మి అమరావతిలో యాక్ట్ చేశాను. ఆ సినిమాలో నా నటనకు బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నాను. ఆ క్రెడిట్ అంతా రవిబాబుదే.

‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రంలో క్యారెక్టర్ గురించి...
అమరావతి సినిమాలో, రాజా చెయ్యి వేస్తే సినిమాలో విలన్ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్. ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రంలో విలన్ కు తల్లిదండ్రులుండరు. చిన్నప్పటి నుండి తనకు నచ్చింది చేస్తూ పెరిగేస్తాడు. తనను తాను నమ్ముకుని ముందుకు సాగే మొండి పాత్ర. ఈ పాత్ర చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు సాయిగారు ఈ రోల్ నువ్వు చేస్తే బావుంటుందని అన్నారు. క్యారెక్టర్, కథ నచ్చడంతో సరేనన్నాను.

నారా రోహిత్ తో వర్క్ చేయడం గురించి...
నేను, నారా రోహిత్ కలిసి నటిస్తున్నాం. అది కూడా నేను విలన్, తను హీరో అనగానే సినిమాపై అంచనా ఏర్పడింది. రోహిత్ చాలా హార్డ్ వర్కర్. కంటిన్యూస్ గా షూటింగ్ లో ఉంటాడు. సాధారణంగా మా మధ్య మంచి రిలేషన్ ఉండేది. ఈ చిత్రంతో ఇంకా దగ్గరయ్యాం.

బాలకృష్ణ వందవ సినిమాలో....
బాబాయ్ బాలకృష్ణగారి వందో సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాననే వార్తలు వినిపించాయి. కానీ ఏదీ కన్ ఫర్మ్ కాలేదు. ఆయన సినిమాలో చిన్న జూనియర్ ఆర్టిస్ట్ రోల్ అయినా నేను చేస్తాను.

తదుపరి చిత్రం..
ఎవరు? అనే మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. త్వరలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved