pizza
Tharun Bhascker interview about Pelli Choopulu
కంట్రోల్ బడ్జెట్ లో డిఫ‌రెంట్ మూవీస్ చేయాల‌నుకుంటున్నాను – తరుణ్ భాస్కర్
You are at idlebrain.com > news today >
Follow Us

28 July 2016
Hyderaba
d

డి.సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కందుకూరి(ధ‌ర్మ ప‌థ క్రియేష‌న్స్‌)య‌ష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్‌) నిర్మాతలుగా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర కొండ‌,రీతూ వర్మ జంటగా రూపొందిన చిత్రం `పెళ్ళిచూపులు`. ఈ చిత్రం జూలై 29న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ తో బుధవారం హైదరాబాద్ లో ఇంటర్వ్యూ జరిగింది. ఈ సందర్భంగా  దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు.

 నేపథ్యం...
మా ఫాద‌ర్ వ‌రంగ‌ల్ లో పుట్టిపెరిగారు. అమ్మ తిరుప‌తిలో పుట్టిపెరిగింది. ఇక నాకు భీమ‌వ‌రంలో ఫ్రెండ్స్ ఉన్నారు. అందుచేత నాకు వ‌రంగ‌ల్ యాస‌తిరుప‌తి యాస‌భీమ‌వ‌రం యాస్ తెలుసు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క యాస ఉంది. అయితే నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే సినిమాల పై మ‌క్కువ‌తో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశాను. నేను తీసిన‌ డ్రామా అనే షార్ట్ ఫిల్మ్ చూసి ప్రొడ్యూస‌ర్  రామ్ మోహ‌న్ గారు పిల‌వ‌డంతో ఆయ‌న ద‌గ్గ‌ర సంవ‌త్స‌రం పాటు వ‌ర్క్ చేసాను. ఆత‌ర్వాత కొత్తగా చేయాలని సింక్ సౌండ్ లో సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ చేశాను.  తెలంగాణ నేటివిటీకి త‌గ్గ‌ట్టు కొత్త పంథాలో చేశాను. దీనికి కూడా మంచి అప్రిసియేషన్ రావడంతో సినిమాలు తీయగలను అనే నమ్మకం నాలో కలిగింది.

పెళ్ళిచూపులు అలా ప్రారంభమైంది...
పెళ్ళిచూపులు కథ రాసుకున్న తర్వాత ముందు సురేష్ బాబుగారికే చెప్పాను. అంతా విన్న ఆయన సెకండాప్ లో ఇంకాస్తా బెటర్ గా ఉంటే ఇంకా బావుంటుందని అన్నారు. ఆయనే ప్రొడ్యూస‌ర్ రాజ్ కందుకూరికి ఫోన్ చేసి నా గురించి చెప్పి క‌థ విన‌మ‌న్నారు. ఆత‌ర్వాత‌ నేను విజ‌య్ దేవ‌ర‌కొండ ద్వారా రాజ్ కందుకూరిని క‌లిసి క‌థ చెప్పాను. ఆయ‌న క‌థ విన్న వెంట‌నే ఈ సినిమాని నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు. ముందు ఆయన సరాదా చేస్తున్నారనుకున్నాను, కానీ ఆయన సీరియస్ గానే చెప్పారని తర్వాత తెలిసింది. దాంతో పెళ్ళిచూపులు సినిమా స్టార్ట్ అయ్యింది.   

Tharun Bhascker interview gallery

ఇన్స్పిరేషన్...
తెలుగులో ఎక్కువగా ఓ రెగ్యులర్ ఫార్మేట్ లో సినిమాలు వస్తున్నయి. రియలిస్టిక్ గా ఈమ‌ధ్య వ‌చ్చిన ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ లా ఎందుకు లేవని ఆలోచించాను. ఆ ఆలోచనల నుండి పుట్టిన కథే పెళ్ళిచూపులు.

 సిచ్యువేషన్ కు తగినట్టు డైలాగ్స్ చెప్పమన్నాను....
ఇంతకు ముందు చెప్పినట్టు సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ ను సింక్ సౌండ్ చేసిన స్టయిల్ లోనే పెళ్ళిచూపులు మూవీ చేశాను. అయితే కొత్త యాక్టర్స్ డైలాగ్ చెప్పేటప్పుడు ఈ విధానంలో లేట్ అవుతుంది. అందుకని సిచ్యువేషన్కు తగినట్లు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో అలా చెప్ప‌మ‌న్నాను. కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అని భయపడ్డాను. అయితే సురేష్ బాబు గారు సినిమా చూసిన త‌ర్వాత ఏం టెన్ష‌న్ ప‌డ‌ద్దు అంతా బావుందని ధైర్యం చెప్పారు. 

టైటిల్ జస్టిఫికేషన్...
నేను డైరెక్ట చేసిన షార్ట్ మూవీ అనుకోకుండా టైటిల్ నే ఈ సినిమాకు పెట్టాలనుకున్నాం. అయితే వేరే వాళ్ళు ఆ టైటిల్ ను రిజిష్టర్ చేసేశారు. అప్పుడు  వివాహ భోజ‌నంబు అనే టైటిల్ అనుకున్నాం కానీ చివరగా క‌థ‌కు పెళ్లిచూపులు టైటిల్ క‌రెక్ట్ గా స‌రిపోతుంది అనిపించ‌డంతో పెళ్లిచూపులు అని డిసైడయ్యాం.

తదుపరి చిత్రాలు...
నా తదుపరిచిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఉంటుంది. కంట్రోల్ బడ్జెట్ లో డిఫ‌రెంట్ మూవీస్ చేయాల‌నుకుంటున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved