pizza
Vakkantham Vamsi interview (Telugu) about Naa Peru Surya
చాలా ఏళ్లుగా ఉన్న క‌ల ` నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమాతో నిజ‌మైంది - వ‌క్కంతం వంశీ
You are at idlebrain.com > news today >
Follow Us

8 May 2018
Hyderabad

అల్లు అర్జున్‌, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా న‌టించిన చిత్రం `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడు. శ్రీరామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్ సినిమాను నిర్మించారు. మే 4న సినిమా విడుద‌లైంది. విడుద‌ల అనంతరం ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీ ఇంట‌ర్వ్యూ...

సినిమా సక్సెస్ రెస్పాన్స్ ఎలా ఉంది?
- చాలా బావుంది. జ‌న‌రల్‌ ఆడియెన్స్ సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా చాలా ఏళ్లుగా ఉన్న క‌ల ఈ సినిమాతో నేర‌వేరింది. సినిమా టీజ‌ర్స్ చూసిన త‌ర్వాత సినిమా అంతా పూర్తిగా ఆర్మీ బేస్‌లోనే ర‌న్ అవుతుంద‌ని ప్రేక్ష‌కులు భావించారు. కానీ సినిమా విడుద‌లైన త‌ర్వాత సినిమా ఆర్మీ నేప‌థ్యంలోనే సాగ‌ద‌ని ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయ్యింది. అన్నీ చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

బ‌న్నిని హీరోగా అనుకునే క‌థ‌ను త‌యారు చేసుకున్నారా? ఆయ‌న ఎంత వ‌ర‌కు యాప్ట్ అయ్యారు?
- ర‌చ‌యిత‌ను కాబ‌ట్టి, ఆలోచ‌న రాగానే దాన్ని డెవ‌ల‌ప్ చేసుకుంటూ వ‌స్తుంటాం. అలా ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసుకుంటూ డైరెక్ష‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న త‌రుణంలో బ‌న్నికి ఈ క‌థ అయితే బావుంటుంద‌నిపించింది. ఆయ‌న్ను క‌లిసి ఒక గంట కథ చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చిన త‌ర్వాత మిగిలిన క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసుకుంటూ వ‌చ్చాను. సూర్య క్యారెక్ట‌ర్‌లో అల్లు అర్జున్‌ని త‌ప్ప మ‌రో యాక్ట‌ర్‌ని ఊహించుకోలేను. న‌ట‌న ప‌రంగానే కాదు.. లుక్ ప‌రంగా కూడా ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు.

ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సింది క‌దా?
- నాకు ఎన్టీఆర్‌గారు ఫేవ‌రేట్ యాక్ట‌ర్‌. న‌న్ను డైరెక్ట‌ర్‌ని చేస్తాన‌ని చెప్పిందే ఆయ‌న‌. ఆయ‌న నుండి మొద‌లైంది. ఓ పాయింట్ అనుకున్నా కూడా డెవ‌ల‌ప్ మెంట్‌లో వ‌ర్కవుట్ కాలేదు.

క‌థ‌కు ఇన్‌స్పిరేష‌న్ ఎక్క‌డ నుండి తీసుకున్నారు?
- క‌థ‌కు ఇన్‌స్పిరేష‌న్ ఏమీ లేదు. ఫిక్ష‌న్ క‌థే. ఆర్మీ ప‌ర్స‌న్ కాస్త ఎగ్రెసివ్‌గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిన విష‌య‌మే. ఈ సినిమాలో ప్ర‌తి ఒక్క‌రికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాటిని సాధించాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అప్పుడు మొద‌లు పెట్టే జ‌ర్నీ ప్యూర్‌గా ఉంటుంది. కానీ గోల్‌ను సాధించే క్ర‌మంలో అంతే ప్యూర్‌గా ఉండ‌గ‌లుగుతున్నామా? అలా ఉండం ఎంతో ముఖ్యం అనే పాయింట్ చెప్పాల‌నుకున్నా. దానికి కోపం అనే పాయింట్‌ను యాడ్ చేశాను. కోపానికి సంఘ‌ర్ష‌ణ‌ను క‌లిగించే పాయింట్ ఏంటి? అంటే ఆర్మీ. అక్క‌డ అంద‌రూ రూల్స్‌ను పాటించాలి. దానికి ప‌ర్స‌న‌లైజ్ పాయింట్‌ను మిక్స్ చేశాను. ఏ హాలీవుడ్ సినిమాకు ఇది ఇన్‌స్పిరేష‌న్ కాదు.

- మ‌న కోపం వ‌ల్ల మ‌నకే న‌ష్టం. నా సినిమాల్లో హీరో క్యారెక్ట‌ర్‌కు తండ్రి క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట్ అవుతుంటాడు. అది అనుకోకుండా రాసుకున్న క‌థ‌లే. అయితే అన్ని సినిమాల్లో అలా రాసుకోలేదు. అలా కుదిరిందంతే. సినిమాలో ముందు తండ్రి పాత్ర‌ను అనుకోలేదు. మూడో వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు వెళితే క‌థ‌లో ఏ కిక్ ఉండ‌దు క‌దా!. త‌ను వెళ్లాల్సిన వ్య‌క్తి తండ్రే అయితే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న వ‌చ్చింది. అలాగే అర్జున్‌గారిని తండ్రి క్యారెక్ట‌ర్‌లో చేయించాల‌నే ఆలోచ‌న బ‌న్నివాసుగారిది.

సినిమా త‌ర్వాత బ‌న్ని ఫీలింగ్ ఏంటి
-చాలా హ్యాపీగా ఉన్నారు. ప్ర‌తి యాక్ట‌ర్ ఒక జాబ్ సాటిస్పాక్ష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తుంటారు. అలా ప్ర‌తి వ్య‌క్తికి ఓ కోరిక ఉంటుంది. నా వ‌ర‌కే తీసుకుంటే నేను రైట‌ర్ అయినా డైరెక్ట‌ర్ అయితే బావుంటుంద‌నుకుని ప్ర‌య‌త్నించాను. అలా బ‌న్ని కూడా ఓ పెర్ఫామెన్స్ రోల్ కోసం ఎదురుచూస్తున్న త‌రుణంలో నేను క‌థ చెప్ప‌డం.. ఆయ‌న‌కు న‌చ్చి సినిమా చేశారు.

క్లైమాక్స్ వీక్ అయ్యింద‌ని కామెంట్స్ విన‌ప‌డ్డాయి క‌దా?
- క్లైమాక్స్‌లో చూపించిన అన్వ‌ర్ అనే స‌మ‌స్య సినిమాలో చూపించిన విల‌న్ స‌మ‌స్య కంటే చాలా పెద్ద‌ది. సినిమా ప్రారంభంలో హీరో టెర్ర‌రిస్ట్‌తో నువ్వు టెర్రరిస్ట్ అయ్యాక నాకు క‌న‌ప‌డ్డావ్‌. అందుకే చంపుతున్నాను. కాక‌ముందు నాకు క‌న‌ప‌డి ఉంటే అవ్వాల‌నే నీ ఆలోచ‌న‌ను చంపేసేవాడిని అనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌నే క్లైమాక్స్‌లో చూపించాం. ఈ క‌థ‌ను రొటీన్ ఫార్మేట్‌లో చేసుంటే అంద‌రూ విమర్శించేవారే. కానీ నేను క‌థ‌ను ఎక్క‌డా డైవ‌ర్ట్ కాకుండా తీసుకువెళ్లాను.

interview gallery



సినిమా లెంగ్త్ ఎక్కువైంద‌ని ఫీల్ అయ్యారా?
- సినిమా లెంగ్త్ ఎక్కువైందని నేను ఫీల్ కాలేదు. ఒక‌రిద్ద‌రూ ఫీలైనా ఎక్క‌డా ఎక్కువైందో చెప్ప‌మ‌ని అంటే చెప్ప‌లేక‌పోతున్నారు. ఎందుకంటే ఇదొక మూడ్‌తో సాగే పొయే సినిమా ఇది.

మీలోని రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌లో మీకు ఎవ‌రు న‌చ్చారు?
- అది ప్రేక్ష‌కులు చెప్పాలి. రైట‌ర్‌గా కంటే డైరెక్ట‌ర్‌గా బాగానే చేశాన‌ని చాలా మంది అంటున్నారు. డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత బ‌య‌టి ద‌ర్శ‌కుల‌కు కూడా క‌థ‌ల‌ను ఇస్తాను.

సినిమా విడుద‌ల త‌ర్వాత బెస్ట్ అప్రిసియేషన్‌?
- సినిమా చూసిన త‌ర్వాత త్రివిక్ర‌మ్‌గారు ఫోన్ చేశారు. ఇంత సీరియ‌స్‌గా, క‌న్వెక్ష‌న్‌తో సినిమా చెబుతార‌ని అనుకోలేదు అని అప్రిసియేట్ చేశారు. అలాగే యు.ఎస్‌లో సినిమా చూసిన సుకుమార్‌గారు ఫోన్ చేసి చాల ఎమోష‌న‌ల్ అయ్యాన‌ని చెప్పారు.

రైట‌ర్ డైరెక్ట‌ర్ కావ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని మీరు బావిస్తారు?
- రైట‌ర్ డైరెక్ట‌ర్ అయితే.. ఏదైయితే అనుకున్నాడో దాన్నే తీయ‌గ‌ల‌రు. ఎందుకంటే చిన్న చిన్న ఎమోష‌న్స్‌ను కూడా రైట‌ర్ డైరెక్ట‌ర్‌కు అన్ని స‌మ‌యాల్లో క‌న్వే చేయ‌లేడు. చాలా సినిమాల్లో ఇలా సెకండ్ లేయ‌ర్స్ ఉంటాయి. వాటిని ట్రాన్స్‌లేష‌న్‌లో మిస్ చేసే అవ‌కాశం ఉంది. అదే రైట‌ర్ డైరెక్ట‌ర్ అయితే స‌మ‌స్య ఉండ‌క‌పోవ‌చ్చు. అదీ గాక రైట‌ర్ డైరెక్ట‌ర్ అయితే ముందు మంచి క‌థ గురించి ఆలోచిస్తాడు. అందుకు మంచి ఉదాహ‌ర‌ణ‌లు త్రివిక్ర‌మ్‌గారు, కొర‌టాల శివ‌గారు.

సినిమా చూసిన ఆర్మీ వాళ్లు ఏమ‌న్నారు?
- మిల‌టరీ వారంద‌రూ సినిమా చూసి హ్యాపీగా ఫీల‌య్యారు. బ‌న్నిని ఆర్మీలో జాయిన్ అవ‌మ‌ని చెప్పారు. బ‌న్ని కూడా ఆల్రెడి అప్లై చేశాను. అధికారులు ఒప్పుకుంటే గౌర‌వ స‌భ్యుడిగా జాయిన్ అవుతాన‌ని అన్నారు. వారి జీవితాల్లోకి కాస్త తొంగి చూసిన సినిమా ఇది అని వారు ఫీల‌య్యారు.

త‌దుప‌రి చిత్రం?
- అవ‌కాశాలు ఉన్నాయి. త్వ‌ర‌లోనే వివ‌రాలు చెబుతాను. అలాగే రైట‌ర్‌గా కూడా వేరే ద‌ర్శ‌కుల‌కు క‌థ‌ల‌ను అందిస్తాను. నాగ‌బాబుగారు నా రెండో మూవీ కూడా వాళ్ల బ్యాన‌ర్‌లోనే ఉంటుంద‌ని అన్నారు. అది ఆయ‌న సంస్కారం.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved