pizza
Vamsi Krishna Akella interview (Telugu) about Rakshaka Bhatudu
`ర‌క్ష‌క‌భ‌టుడు` ఎవ‌ర‌న్న‌ది స‌స్పెన్స్ - వంశీకృష్ణ ఆకెళ్ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

09 May 2017
Hyderabad

రక్ష, జక్కన్న వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్‌ బ్యానర్‌పై ఎ.గురురాజ్‌ నిర్మించిన చిత్రం 'రక్షకభటుడు'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళతో జరిపిన ఇంటర్వ్యూ...

- అరకు దగ్గరలోని ఓ హిల్‌ స్టేషన్‌లో వున్న ఓ పోలీస్‌ స్టేషన్‌. ఈ స్టేషన్‌లో కేసులు వుండవు. ఎవరూ రారు. చూడడానికి చాలా అందంగా వుంటుంది. ఈ పోలీస్‌ స్టేషన్‌లో వాళ్ళ వంట వాళ్ళే చేసుకుంటూ వుంటారు. ఇలాంటి స్టేషన్‌లో ఎస్‌.ఐ. బ్రహ్మాజీగారు, హెడ్‌ కానిస్టేబుల్‌ సత్తెన్న, లేడీ కానిస్టేబుల్‌ జ్యోతి, ధన్‌రాజ్‌. ఇలాంటి పోలీస్‌ స్టేషన్‌లో ధన్‌రాజ్‌ నైట్‌ డ్యూటీ చెయ్యాల్సి వస్తుంది. అప్పటివరకు డ్యూటీలో వున్న కానిస్టేబుల్‌ పారిపోతాడు. ఎందుకు పారిపోతాడో తెలీదు. వీడు ఆ డ్యూటీ చెయ్యాల్సి వస్తుంది. ఇతనికి విపరీతమైన భయం. అలాంటి ధన్‌రాజ్‌కి నైట్‌ డ్యూటీ పడితే ఆ నైట్‌ సంవత్సరంలా గడుస్తుంది. ఈ ఉద్యోగం తప్పితే అతనికి వేరే దారి లేదు. వీడి జీతంతోనే ఫ్యామిలీ నడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఓ ఐడియా వస్తుంది. ముగ్గురు మాజీ దొంగలతో ధన్‌రాజ్‌ ఓ డీల్‌ చేస్తాడు. ఆ ముగ్గురు దొంగలు తనకు తోడుగా స్టేషన్‌లో నైట్‌ అంతా వుంటే మీకు ఏం కావాలంటే అది చేస్తానని ఓ ఆఫర్‌ ఇస్తాడు. బయటి వ్యాపారం కంటే ఇది బాగుందని వాళ్ళు ఒప్పుకుంటారు. నైట్‌ ఆ ముగ్గురికీ మందు, బిర్యానీ.. ఇలా ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తుంటాడు. కొన్ని రోజులకు వాళ్ళకి ఇవన్నీ బోర్‌ కొట్టేస్తాయి. ఇవన్నీ కాదు మాకు అమ్మాయి కావాలి తీసుకొస్తావా అని అడుగుతారు. అక్కడ స్టార్ట్‌ అవుతుంది అసలు కథ. నిజంగా ధన్‌రాజ్‌ అమ్మాయిని తీసుకొచ్చాడా? లేదా? అలాంటి పరిస్థితుల్లోనే ఆ పోలీస్‌ స్టేషన్‌కి నిజంగానే ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? ఆ పోలీస్‌ స్టేషన్‌కి ఎందుకొచ్చింది? పోలీస్‌ స్టేషన్‌కి, అమ్మాయికి సంబంధం ఏమిటి? ఆ అమ్మాయి ఏ ప్రాబ్లమ్‌తో వచ్చింది? ఆ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయిందా? ఆ పోలీస్‌ స్టేషన్‌లో ఓ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ వుంటుంది. ఆ థ్రిల్‌కి, అమ్మాయికి ఏమైనా సంబంధం వుందా? ఇదంతా ఫిక్షన్‌. సరదాగా వచ్చిన ఓ ఆలోచనకి సినిమా రూపం ఇది.

- ఇందులో ధన్‌రాజ్‌ డైలాగ్‌ ఒకటి వుంటుంది. ప్రపంచానికి ఫస్ట్‌ పోలీస్‌ నువ్వే కదా స్వామి అంటాడు. మనందరం ఆరాధించే ఆంజనేయ స్వామి నిజంగానే ప్రొటెక్టర్‌. ప్రస్తుత సొసైటీలో ప్రొటెక్టింగ్‌ ఫోర్స్‌ అంటే పోలీస్‌. ఆ పోలీస్‌ రూపంలో మనందర్నీ రక్షించే దేవుడు వుంటే ఎలా వుంటుంది అన్న ఆలోచనే ఈ సినిమా. డెఫినెట్‌ అందరూ దాన్ని యాక్సెప్ట్‌ చేస్తారు. మంచి క్రేజ్‌ వచ్చింది.

- అది రివీల్‌ చేస్తే ఎలా వుండేదో తెలీదు గానీ, దాన్ని సస్పెన్స్‌ వుంచడం వల్ల బిజెనెస్‌ చాలా అద్భుతంగా వుంది. పోలీస్‌ డ్రెస్‌లో వున్న ఆంజనేయ స్వామి ఎవరు? అనేది మాత్రం థ్రిల్లింగ్‌గా వుంటుంది. పోలీస్‌ డ్రెస్‌లో కనిపించే ఆంజనేయ స్వామి క్యారెక్టర్‌ ఒకరైతే, కథని మొత్తం లీడ్‌ చేసే క్యారెక్టర్‌ ఒకటుంది. ఈ రెండు క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులను దాచాం. నందు హీరోయిన్‌ లవర్‌గా చేసాడు. వీరు కాక ఇంకా ఇద్దరున్నారు. వాళ్ళని మనం దాచాం. ప్రతి సిట్యుయేషన్‌లో ఒక చిన్న థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ క్యారీ అవుతూ వుంటుంది. అప్పర్‌ లేయర్‌ మాత్రం కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌.

- అదేం లేదండీ. ఇది సరదాగా వచ్చిన ఒక ఆలోచన. ఈ సినిమాకి దేనితోనూ కంపేరిజన్‌ లేదు. దేనికీ ఇన్‌స్పిరేషన్‌ కాదు. జక్కన్న కంటే ముందే ఈ ఐడియా వచ్చింది. ఎప్పుడెప్పుడు చేద్దామా అనే క్యూరియాసిటీతో వున్నాను. ఆ టైమ్‌లో గురురాజ్‌గారు చేద్దాం అన్నారు. దీనికి మేం ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికంటే క్రేజ్‌ రావడం చాలా హ్యాపీగా వుంది.

Vamsi Krishna Akella interview gallery

- ఈ సినిమా ర‌క్ష‌, జ‌క్క‌న్న స్థాయిలో ఉండ‌బోతోంది. చిన్న సినిమా చేసి ఆ త‌ర్వాత పెద్ద ప్రాజెక్ట్ కి వెళ్దామ‌నుకున్న నాకు ఈ చిత్ర‌మే పెద్ద చిత్రంగా నిలిచింది. ఇందులో హ‌నుమంతుడు ఎవ‌ర‌నే విష‌యాన్ని ప్రీ రిలీజ్ వ‌ర‌కు రివీల్ చేయం.

- ఇందులో ఒక పాట ఉంది. ఐట‌మ్ సాంగ్ లాంటిది. కానీ ఐట‌మ్ కాదు. మాస్ సాంగ్‌లాగా ఉంటుంది.

- 250 థియేట‌ర్ల వ‌ర‌కు రీచ్ అయ్యాం. ఈ రెండు రోర‌జుల్లోనే డ్రాస్టిక్ చేంజ‌స్ వ‌స్తున్నాయి. 500 వ‌ర‌కు రీచ్ కావ‌డ‌మ‌నేది నా టార్గెట్‌. వాటిని రీచ్ అవుతాం. ఆ రోజు విడుద‌ల‌య్యే మిగిలిన సినిమాలు కూడా బాగా ఆడాలి.

- ఇందులో ప్ర‌భాకర్‌గారు ఇప్ప‌టిదాకా నెగ‌టివ్ కేర‌క్ట‌ర్స్ చేశారు. ఇందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా చేస్తున్నారు. నార్మ‌ల్ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. రిచా ప‌న‌య్ ఇప్ప‌టిదాకా నాలుగు సినిమాల్లో చేసినా, ఆ అమ్మాయి గురించి మ‌న‌కు పెద్ద‌గా తెలియ‌దు. కానీ ఈ సినిమాతో ఆ అమ్మాయికి చాలా మంచి ఐడెంటిటీ వ‌స్తుంది. ప్రామినెంట్‌గా రిజిస్ట‌ర్ అయ్యే పాత్ర చేసింది.

- బ్ర‌హ్మానందంగారి పేరు సినిమాలో ప‌ద్మ‌నాభం పురే. ఆయన హార‌ర్ సినిమాల ద‌ర్శ‌కుడిగా ఇందులో న‌టించారు. త‌న సినిమా షూటింగ్ కోసం అనంత‌గిరి పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చిన అత‌నికి ఏం జ‌రిగింది అనేది ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన అంశం.

- ఇంకో రెండు, మూడు స్క్రిప్ట్ లు సిద్ధంగా ఉన్నాయి. ఓ పెద్ద స్టార్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను. అది కాకుండా ప్రాసెస్‌లో ఇంకో సినిమా కూడా ఉంది. పెద్ద‌దొక‌టి, చిన్న‌దొక‌టి చేయాల‌ని ప్లాన్‌.

- ఇందులో మెసేజ్ ఏమీ లేదు. ఓ అమ్మాయికి వ‌చ్చిన ఓ సోష‌ల్ ప్రాబ్ల‌మ్‌ని ఈ పోలీస్ స్టేష‌న్‌లో ఎలా సాల్వ్ చేయ‌బ‌డింది అనేదే సినిమా.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved