pizza
Vara Mullapudi interview about Kundanapu Bomma
రాజమౌళికి నచ్చకపోతే ఆపేస్తాను – ముళ్ళపూడి వరా
You are at idlebrain.com > news today >
Follow Us

20 June 2016
Hyderaba
d

సుధీర్ వ‌ర్మ‌, చాందినిచౌద‌రి హీరో హీరోయిన్లుగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ. స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ముళ్ళ‌పూడి వ‌రా ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్‌, వంశీ, అనిల్ నిర్మించిన చిత్రం ‘కుంద‌న‌పు బొమ్మ‌’. మాగ్న‌స్ సినీ ప్రైమ్ ప్రై.లి. స‌హ‌కారంతో ఈ సినిమా జూన్ 24న విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ముళ్ళపూడి వరాతో ఇంటర్వ్యూ....

ఖాళీగా మాత్రం లేను....
‘విశాఖ ఎక్స్‌ ప్రెస్’ 2008లో విడుద‌లైంది. ఆ త‌ర్వాత ఆఫ‌ర్స్ వ‌చ్చాయి కానీ నాకు న‌చ్చ‌లేదు. నాకు న‌చ్చ‌కో, వారికి న‌చ్చ‌కో సినిమాలు టేకాఫ్ కాలేదు. నేను యాడ్ షూటింగ్‌తో బిజీగా ఉంటున్నాను. ఖాళీగా ఉన్నాను. మా చెల్లెలు, బావ‌గారి కంపెనీ అమెరికాలో ఉంది. వారి కంపెనీ కోసం యాడ్స్ చేస్తుంటాను. అలాగే టీవీ సీరియ‌ల్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఉంది. గోరంత‌దీపం, ముత్యాల‌ముగ్గు సీరియ‌ల్స్ చేస్తున్నాం. పనిలేకుండా ఏరోజు లేను.

టైటిల్ పెట్టడానికి రీజన్....
-నాకు పెద్ద హీరోలు ఎవ‌రూ డేట్స్ ఇవ్వ‌రు. అదీ కాకుండా ఈ కుంద‌న‌పు బొమ్మ సినిమా క‌థ ఇమేజ్ ఉన్న హీరోల‌తో చేయ‌కూడ‌దు. కొత్త‌వాళ్ల‌తోనే వ‌ర్క‌వుట్ అవుతుంది. వాళ్ల‌కున్న ప‌రిమితుల్లో, న‌టీన‌టుల్లో నాకు తెలిసిన వారితో చేసిన సినిమా. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ చుట్టూ క‌థ తిరుగుతుంటుంది. తెలుగమ్మాయి కోసం చాలా వెతికాం. చాందిని చౌద‌రి చ‌క్క‌గా స‌రిపోయింది. త‌ను చ‌క్క‌గా స‌రిపోయింది. అందుకే ‘కుంద‌న‌పు బొమ్మ’ అనే టైటిల్ పెట్టాం.

సినిమాలో పాత్రలు గురించి....
- సిటీలో ప‌ది నిమిషాలు, మిగ‌తాదంతా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌. విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలిలో షూటింగ్ చేశాం. బొబ్బిలి కోట‌లో 30 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ చేశాం. సుధాక‌ర్‌, సుధీర్ క్యారెక్ట‌ర్స్ రెండు సిటీ నుండి విలేజ్‌కు వ‌చ్చే క్యారెక్ట‌ర్స్‌. అయితే సుధాక‌ర్ క్యారెక్ట‌ర్‌కు కాస్తా ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌, ఎండింగ్ త‌న‌పైనే ఉంటుంది. సుధాక‌ర్‌పై సాంగ్స్ ఉండ‌వు. ముందు త‌ను ఆలోచించుకున్నాడు కానీ చివ‌ర‌కు చేయ‌డానికి ఒప్పుకున్నాడు. సినిమా సెట్స్‌లోకి వెళ్లేంత వ‌ర‌కు ముగ్గురు గురించి నాకు పెద్ద‌గా అవ‌గాహ‌న కూడా లేదు. చాందిని చౌద‌రి సుచి అనే క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయింది.

ముందుకు మనకు ఎగ్జయిట్ మెంట్ అవసరం...
- ఎగ్జ‌యిట్‌మెంట్‌తో చేసిన సినిమాలే ద‌ర్శ‌కుడికి స‌క్సెస్ ఉంటుంది. క‌థ రాసుకున్న త‌ర్వాత నాకు ఎగ్జ‌యిట్‌మెంట్ ఇచ్చిన సినిమా ఇది. ముందు నాకే ఎగ్జయిట్ మెంట్ లేకుండా నేనెలా చేస్తాను. స్క్రిప్ట్ మొత్తం పూర్త‌య్యాకే సెట్స్‌ లోకి వెళ‌దాం అనుకుని అలాగే ప్లాన్ చేసుకుని షూట్‌కు వెళ్లాం.

దేనిదారి దానిదే...
టీవీ సీరియ‌ల్స్ డైరెక్ట్ చేస్తుంటాను. అలాగే మ‌ధ్య మ‌ధ్య‌లో సినిమాలు చేస్తున్నాను. రెండింటిలో దేని దారి దానిదే. సీరియ‌ల్స్‌లో ప్ర‌తి డీటెయిల్డ్‌గా చూపించాలి. సినిమా విష‌యంలో కాస్తా డ్రెమ‌టిక్‌గా చెప్పాలి. ఈ రెండింటితో పోల్చితే యాడ్స్ ఇంకా ఎగ్జ‌యిట్‌మెంట్ ఇస్తుంది. ఎందుకంటే ముప్పై సెకండ్స్‌ లో మ‌నం అనుకున్న‌దంతా చెప్పాలి. కాబట్టి వర్క్ విషయంలో దేనిదారి దానిదే.

ఆయ‌న స్క్రిప్ట్ ను చూడ‌నేలేదు...
- కీర‌వాణిగారితో ఎప్ప‌టి నుండో క‌లిసి పనిచేయాల‌నుకున్నాను. అయితే కుదిరేది కాదు. ఈ సినిమాకు ఆయ‌న్న అడగ్గానే వెంట‌నే చ‌య‌డానికి ఒప్పుకున్నారు. స్క్రిప్ట్ అడిగారు కానీ నేను ఇవ్వ‌లేక‌పోయాను. స్క్రిప్ట్ చూడ‌కుండా మ్యూజిక్ చేసేశారు. ఇప్ప‌టికీ ఆయ‌న స్క్రిప్ట్ చూడ‌లేదు. ఆయ‌న సంగీంతానికి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బాపు, ర‌మ‌ణ‌గారు గోరంత‌దీపం కోసం రికార్డ్ చేసుకున్న సాంగ్ ను వాడ‌లేదు. ఆ సాంగ్‌ను బాలుగారు పాడారు. మ‌ళ్లీ బాలుగారి ప‌ర్మిష‌న్ తీసుకుని ఆ సాంగ్‌ను రీమిక్స్ చేసి ఈ సినిమాలో వాడాం.

వారి కథనే చేస్తున్నాను...
- శ్రీరామరాజ్యం చిత్రానికి ముందు బాపు-రమణగారు ఓ క‌థ‌ను అనుకున్నారు. అయితే శ్రీరామ‌రాజ్యం సినిమా రావ‌డంతో దాన్ని ప‌క్క‌న పెట్టారు. ఆ క‌థ‌ను ఇప్పుడు టేక‌ప్ చేశాను. మోడ్ర‌న్‌గా మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ త‌యారు చేస్తున్నాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే ల‌వ్ స్టోరీ. నిత్యామీన‌న్‌ను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నాం. త‌ను ఒప్పుకుంటే వెంట‌నే స్టార్ట్ చేస్తాం. పెద్ద బ‌డ్జెట్ సినిమాలున్నాయి. అవి కూడా స్క్రిప్ట్ సిద్ధం అవుతున్నాయి. ఈ విష‌యంలో వ‌క్కంతం వంశీ హెల్ప్ చేస్తుంటాడు.

రాజ‌మౌళిపై న‌మ్మ‌కం అలాంటిది...
-సాధార‌ణంగా నేను క‌థ‌ల‌ను రాజ‌మౌళికి వినిపిస్తుంటాను. త‌న‌కు న‌చ్చ‌క‌పోతే వెంట‌నే ఆపేస్తాను. ఎందుకంటే త‌న జ‌డ్జ్‌మెంట్ చాలా క‌రెక్ట్‌గా ఉంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved