pizza
Vedaa K interview about Shourya
స్టాండర్డ్ మ్యూజిక్ ఇచ్చానని మోహన్ బాబుగారు మెచ్చుకున్నారు – వేదా.కె
You are at idlebrain.com > news today >
Follow Us

22 February 2016
Hyderaba
d

బేబి త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్ పై మంచు మనోజ్, రెజీనా జంటగా నటించిన చిత్రం ‘శౌర్య’. కె.దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు వేదా.కె తో ఇంటర్వ్యూ...

నేపథ్యం...
-ఖమ్మంలో పుట్టాను. కానీ పెరిగిందంతా హైదరాబాద్ లోనే. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఫిల్ మ్యాథమాటిక్స్ చేశాను. వెస్ట్రన్ క్లాసికల్ పియానోలో 5 గ్రేడ్స్ చేశాను. తర్వాత ఆరేళ్ళు హిందూస్థానీ హర్మోనియం నేర్చుకున్నాను. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నాను. జింగిల్, టీవీ సీరియల్స్ కు టైటిల్ మ్యూజిక్ ఇచ్చాను. అలాగే యాడ్స్ చేస్తుండేవాడిని. చక్రిగారి దగ్గర వెన్నెల్లో హాయ్ హాయ్, అనుచరుడు సినిమాలు సహా ఆయన చివరి సినిమా ఎర్రబస్బు వరకు పనిచేశాను. టెన్త్ క్లాస్ లో స్కౌట్స్ అండ్ గైడ్స్ లో రాష్ట్రపతి అవార్డ్ ను శంకర్ దయాళ్ శర్మగారి నుండి అందుకున్నాను.

సంగీతంలో ప్రవేశం....
-మేం ఒకప్పుడు బాగా బతికిన ఫ్యామిలీ. మా జనరేషన్ కు వచ్చేసరికి కొన్ని కారణాలతో ఆస్థులు పోయాయి. దాంతో ఇబ్బందులు పడ్డాం. అయినా చదువుపై దృష్టి పెట్టాను. చిన్నప్పటి నుండి సంగీతం అంటే ఇష్టమున్నప్పటికీ ఆర్ధిక కారణాలతో కుదరలేదు. నారాయణలో హోం ట్యూటర్ గా చేస్తున్నప్పుటి నుండి సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టాను. కొద్దిగా ఆలస్యమైనా సంగీతంపై పట్టు సాధించాను. సాఫ్ట్ వేర్ లో ఐదేళ్ళు వర్క్ చేశాను. అనూప్ గారి దగ్గర నైట్ టైమ్స్ డివోషనల్ సాంగ్స్ చేసేవాడిని. మధ్యలో సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను. ఓ డెమో ఆల్బమ్ చేసి దేవిశ్రీ ప్రసాద్ గారికి చూపించాను. అప్పుడాయాన చెన్నైకి రమ్మని పిలిచారు. నేను ఆయన దగ్గర అప్రెంటీస్ గా చేరాను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి చక్రి గారి వద్ద పనిచేశాను.

K. Vedaa interview gallery

సినిమాలో అవకాశం..
-దశరథ్ గారి బ్రదర్ అనే కారణంతో ‘శౌర్య’ సినిమాలో అవకాశం రాలేదు. ఎందుకంటే సంగీతం అంటే యూనిట్ లో ప్రతి ఒక్కరికీ నచ్చాల్సి ఉంటుంది. వ్యాపారం కోట్లో ఉంటుంది. అందుకే నేను డైరెక్టర్ గారి తమ్ముడినని చెప్పకుండా రెండు సిచ్చువేషన్స్ కు ట్యూన్స్ కంపోజ్ చేసి నిర్మాతగారికి, మనోజ్ గారికి వినిపించాను. వాళ్ళకు ఆ రెండు ట్యూన్స్ నచ్చి మరో ట్యూన్ కూడా చేయమని అన్నారు. అప్పుడు తుప్పర సాంగ్ ట్యూన్ చేసి వినిపించాను. వారికి నచ్చడంతో వారు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. నాలుగు ట్యూన్స్ తర్వాత నిర్మాతగారికి తెలిసింది. దాంతో ఆయన థ్రిల్ అయ్యారు. దేవుడి దయ వల్ల సాంగ్స్ బాగా వచ్చాయి. అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. మోహన్ బాబుగారు విని చాలా స్టాండర్డ్ మ్యూజిక్ ఇచ్చానని మెచ్చుకున్నారు.

సంగీత దర్శకుడు కావడానికి ఇన్సిపిరేషన్....
-ఇళయరాజాగారు, రెహమాన్ గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రెహమాన్ గారు పాత్ బ్రేకింగ్ మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ పరిధులు దాటించిన వ్యక్తి. మన కల్చర్ సాంగ్స్ వింటే ఎంత గొప్ప వాడైనా కనెక్ట్ అవుతాం. అందుకే తుప్పర తుప్పర..సాంగ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే సన్నివేశాలకు తగిన విధంగా థీమ్స్ చేసుకుని రీరికార్డింగ్ చేశాం.

-జనరల్ గా మెలోడి సాంగ్స్ చేయడమిష్టం. అలాగే మన కల్చర్ తో కూడిన ఫోక్ మ్యూజిక్ చేయడం కూడా ఇష్టపడతాను. ఇళయరాజా, రెహమాన్ గారు కూడా అలాంటి కల్చర్, నెటివిటితో కూడిన సాంగ్స్ వెస్ట్రన్ స్టయిల్ చేయడంతో మనకు బాగా కనెక్ట్ అయ్యింది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
-కొత్త సినిమాలేవీ చేయడం లేదు. అడుగుతున్నారు. అయితే శౌర్య రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved