pizza
Veerabhadram interview about Chuttalabbayi success
స‌క్సెస్ కొట్టాల‌ని కసితో చేసిన చిత్ర‌మే `చుట్టాల‌బ్బాయి`  - వీర‌భ‌ద్ర‌మ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

21 August 2016
Hyderaba
d

ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం. 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న. రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా ఆదివారం ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్రం మీడియాతో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు...

- నేను సినిమా చేయ‌డానికి మ‌ధ్య చాలా గ్యాప్ వ‌చ్చింది. ఈ గ్యాప్‌లో న‌న్ను చూసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులంద‌రూ వీర‌భ‌ద్ర‌మ్ ఓ సినిమా చేస్తే బావుంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అందులో నేను గ‌తంలో సినిమా చేసిన నిర్మాత‌లు కూడా, ఇత‌ర ద‌ర్శ‌క మిత్రులు చాలా మంది ఉన్నారు. 
- నైజాం రాకేష్ ఈరోజు నాకు ఫోన్ చేసి సినిమా క‌లెక్ష‌న్స్ చాలా బావుంద‌ని అన్నారు. మూడు రోజుల్లో మూడు కోట్ల రూపాయ‌లు వ‌స్తుంద‌ని నాకు చెప్పారు. మొద‌టి రోజు నుండి క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌స్తున్నాయి. అన్నీ థియేట‌ర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. వైజాగ్‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావరి స‌హా అన్నీ ఏరియాస్ నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమాను దాదాపు 350 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తే ఇప్పుడు సినిమా వంద థియేట‌ర్స్ వర‌కు పెరిగాయి. 

Veerabhadram interview gallery


- టైటిల్ హండ్రెడ్ ప‌ర్సెంట్ యాప్ట్ అయ్యింది. టైటిల్ ముందుగా జ‌నాల్లోకి చొచ్చుకెళ్లింది. త‌ర్వాత టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇలా ముందు నుండి సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. 

- సినిమా ఎంట‌ర్ టైనింగ్‌గా ఉంద‌ని అంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా బాగా న‌చ్చింది. 

- సినిమా స‌క్సెస్ చూసి వీర‌భ‌ద్ర‌మ్ బ్యాక్ అంటున్నారు. ఎలాగైనా మంచి హిట్ తీయాల‌నే క‌సితో చేసిన సినిమా ఇది. వీర‌భ‌ద్ర‌మ్ స‌క్సెస్ కొట్ట‌డ‌మే కాదు, స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఆది కూడా మంచి హిట్ అందించాడ‌ని అంటున్నారు. 

- సినిమాలో కీల‌క‌మైన పాత్ర దొర‌బాబు పాత్ర‌లో సాయికుమార్‌గారు చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. తండ్రికొడుకులిద్ద‌రూ  క‌లిసి చేసిన ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయ‌డం ఇంకా ఆనందంగా ఉంది. సాయికుమార్‌గారితో నాకు చాలా కాలంగా మంచి ప‌రిచ‌యం ఉంది. ఆయ‌న న‌న్ను ఫ్యామిలీ మెంబ‌ర్‌లా చూస్తారు. ఆయ‌న‌కు దొర‌బాబు క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో ఆయ‌న చేస్తాన‌న్నారు. అప్పుడు నేను ఒక‌రోజు టైం అడిగి ఆలోచించాను. ఆయ‌న ఎనర్జీకి త‌గిన విదంగా క్యారెక్ట‌ర్ ఉందా లేదా అని చూసుకుని చిన్న చిన్న మార్పులు చేసి ఆయ‌న‌తో చిత్రీక‌ర‌ణ చేశాం. 

- స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడుగారు కూడా సినిమాను చూస్తున్నారు. అలాగే డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ మ‌ద్దినేని ర‌మేష్ ఫోన్ చేసి అభినందించారు. 

- త‌దుప‌రి సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉన్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు తెలియ‌జేస్తాను. 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved