pizza
Veeru Potla interview (Telugu) about Eedu Gold Ehe
వినోదం + ఉత్కంఠ = ఈడు గోల్డ్ ఎహే - వీరుపోట్ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

6 October 2016
Hyderaba
d

సునీల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `ఈడు గోల్డ్ ఎహే`. వీరుపోట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 7న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా గురువారం వీరుపోట్ల హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* చాన్నాళ్ల‌యింది క‌లిసి.. చెప్పండి ఎలా ఉన్నారు?
- బావున్నానండీ. దూసుకెళ్తా వ‌చ్చి చానాళ్ల‌యింది. ఈ సినిమా ప‌నిలో బిజీలో ఉన్నా.

* ఎలా వ‌చ్చింది చిత్రం?
- చాలా బాగా వ‌చ్చింది. నా సినిమాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సునీల్ చిత్రాల్లోనూ ఉంటుంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అన‌గానే వినోదాన్ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. కాబ‌ట్టి వినోదాత్మ‌కంగా వ‌చ్చింది.

* టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
- ఈడు గోల్డ్ ఎహే అని పెట్టాం. అలా ఎందుకున్నామ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. రెగ్యుల‌ర్ ఫార్మేట్‌ను మార్చి సినిమాలు తీయ‌మ‌ని రివ్యూలు రాసేవారు చాలా వ‌ర‌కు చెబుతూనే ఉన్నారు. వాట‌న్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ క‌థ‌ను సిద్ధం చేసుకున్నా.

Veeru Potla interview gallery

* ఈ చిత్రానికి ఏదైనా స్ఫూర్తి ఉందా?
- నేను ఏ సినిమాను చూసినా స్ఫూర్తి పొందుతాను. నాకు తెలియ‌కుండానే నా చిత్రాల్లో అది క‌నిపిస్తుంది. అలాగే నేను ఏ సినిమా చేసిన‌ప్ప‌టికీ అది నా సినిమా అనే ఫీలింగ్ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుడికి ఉంటుంది.

* పోస్ట‌ర్‌లో మాస్క్ ఎందుకుంది?
- అది సినిమాలో చూడాలండీ.

* టైటిల్‌లో లాఫింగ్ బుద్ధాను ఎందుకు పెట్టారు?
- లాఫింగ్ బుద్ధాకు సినిమాకు కాస్త క‌నెక్ష‌న్ ఉంటుంది. వినోదం + ఉత్కంఠ క‌ల‌గ‌లిపి తీసిన చిత్ర‌మిది. ఊహించ‌ని మ‌లుపు కూడా ఉంటుంది.
ఎక్క‌డా ఎమోష‌న్‌ని మిస్ కాకుండా తీశాం.

* దూసుకెళ్తా త‌ర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్న‌ట్టున్నారు?
- ఆ సినిమా త‌ర్వాత ఓ మ‌ల్టీ స్టార‌ర్ అనుకున్నా. అయితే అది క్లిక్‌కాలేదు. ఆ త‌ర్వాత ఇంకో హీరోతో సినిమా చేద్దామ‌నుకున్నా. అయితే ఆయ‌న ఫ‌క్తు నా మార్కు చిత్రాన్ని ఆశించారు. అయితే నాకు అది న‌చ్చ‌లేదు. అందుకే ఈ సినిమా చేశా.

* త‌ర్వాతి చిత్రాలేంటి?
- ఇంకా ఏవీక‌మిట్ కాలేదు. కాక‌పోతే పీరియాడిక్ చిత్రాలు చేయాల‌ని ఉంది. అలాగే పోస్ట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాల‌ని ఉంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved