pizza
Veligonda Srinivas interview (Telugu) about Andhhagadu
డైరెక్ట‌ర్‌గా గొప్ప సినిమా తీశాన‌ని చెప్ప‌ను కానీ..మంచి సినిమా తీశాను - వెలిగొండ శ్రీనివాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

3 June 2017
Hyderabad

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు. ఈ సినిమా జూన్ 2న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్‌తో ఇంట‌ర్వ్యూ...

సినిమా సక్సెస్‌ రెస్పాన్స్‌ గురించి..
ఇండస్ట్రీకి డైరెక్టర్‌ అవుదామని రాలేదు. రైటర్‌ అవుదామనే వచ్చాను. అయితే ఈ జర్నీలో డైరెక్టర్‌ అవుదామని అనుకున్నాను. కథ వినగానే డైరెక్టర్‌గా మీకు 'అంధగాడు' కథ అయితే సరిపోతుందని రాజ్‌ అన్నాడు. దాసరిగారికి సినిమాను అంకితం ఇవడం అనేది ఆయన ఆశీర్వచనంగా భావిస్తున్నాం. అలాగే దర్శకుడిగా తొలి ప్రయత్నంలో గొప్ప సినిమాను తీశానని చెప్పలేను కానీ మంచి సినిమాను తీశానని అనుకుంటున్నాను. పిల్లల సెంటిమెంట్‌పై ఓ సాంగ్‌ను మేం సినిమాలో ఎడిట్‌ చేశాం. రెండు రోజుల్లోనే ఆ సాంగ్‌ను సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం. సినిమా చూసిన అందరూ సినిమా చాలా బావుందని మెచ్చుకుంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత ఫస్ట్‌ కాల్‌ వి.వి.వినాయక్‌గారి నుండే వచ్చింది. రాజమండ్రిలో ఫస్ట్‌ షో పడ్డ తర్వాత ఆయన రిపోర్ట్స్‌ తెప్పించుకుని ఫోన్‌ చేసి కొట్టేశావ్‌..అంటూ అభినందించారు. అలాగే రామ్‌గోపాల్‌వర్మగారు కూడా ఫోన్‌ చేసి విషెష్‌ చెప్పారు. చాలా బాగా చెప్పావు, స్క్రీన్‌ప్లేను నేను ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు అని అన్నారు.

ఆ ఆలోచన నుండే కథ పుట్టింది..
ఈ సినిమా ట్రైలర్‌ చూసి ఒకప్పటి సినిమా కోకిల తరహా కాన్సెప్ట్‌ ఏమో అనుకున్నారు. కానీ సినిమా చూస్తే కానీ తెలియదు, అసలు దేనికీ సంబంధం లేని సబ్జెక్ట్‌ ఇది. సెకండాఫ్‌లో ట్విస్ట్‌లు ఎక్కువగా ఉన్నాయని సినిమా చూసిన వారందరూ అంటున్నారు. నేను అంధులపై ఓ సినిమా చేద్దామని అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు చిన్న రీసెర్చ్‌ స్టార్ట్‌ చేశాను. ఆ రీసెర్చ్‌లో అంధులకు ఎంత కాన్ఫిడెంట్‌ ఉంటుందో నేను కళ్ళారా చూశాను. అసలు వీళ్ళ ఎనర్జీ ఎంటి, ఈ ఎనర్జిపై ఓ కథ చెప్పాలనే ఆలోచన వచ్చి, ఆ ఆలోచన నుండే కథ పుట్టింది.

రాజ్‌తరుణ్‌ గురించి..
రాజ్‌తరుణ్‌ ఎంత కేర్‌ తీసుకున్నారు. కథలో బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యారు. దర్శకుడిగా నేను చెప్పింది చేసుకుంటూ వచ్చారు. రాజ్‌తరుణ్‌ నటను ఈరోజు అంరదూ థియేటర్‌లో ప్రశంసిస్తున్నారు. కథ వినగానే సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేశాడు. కథ విన్న తర్వాత మీరే డైరెక్షన్‌ చేస్తే బావుంటుందని తనే సజెషన్‌ ఇచ్చారు.

అందుకే తీసుకున్నాం..
తెలుగు వారినే ఎంకరేజ్‌ చేయాలనే ఆలోచనతోనే రాజా రవీందర్‌గారిని మెయిన్‌ విలన్‌ పాత్రకు తీసుకున్నాం.

తదుపరి చిత్రం..
తదుపరి చిత్రం గురించి ఇప్పుడే చెప్పలేను. మంచి కథ కుదిరే దాన్ని బట్టి డైరెక్షన్‌ గురించి ఆలోచిస్తాను. మూడు నాలుగు కథలున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఎలాంటి కథ చేస్తే బావుంటుందో ఆలోచించాలి. నా నాలెడ్జ్‌ మేర కొత్త సినిమాలనే చేయాలని ప్రయత్నిస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved