pizza
Vijay Antony interview about Bichagadu success
ఒకప్పుడు నా మ్యూజిక్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నారు. -విజయ్ ఆంటోని
ou are at idlebrain.com > news today >
Follow Us

16 May 2016
Hyderaba
d

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోనిసత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం పిచ్చైకారన్ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో , విజయ్ ఆంటోని మాట్లాడుతూ....

సినిమా సక్సెస్ గురించి...
బిచ్చగాడు సినిమాను ఆడియెన్స్ మధ్యలో చూశాను. ఆడియెన్స్ రెస్పాన్స్ చాలా బావుంది. నకిలీ, డా.సలీం చిత్రాల తర్వాత తెలుగులో నేను చేసిన మూడో చిత్రమిది. తెలుగు, తమిళ ఆడియెన్స్ కు మధ్య పెద్ద తేడా లేదు. మంచి చిత్రాలను ఆదరించడానికి ఎప్పుడూ ముందుంటారు.  ఈ సినిమా సక్సెస్ నా తదుపరి చిత్రాలు సైతాన్, యుముడులను తెలుగులో విడుదల చేయడానికి మరింత నమ్మకాన్ని పెంచింది. నా సినిమాలను యాభై శాతం చిత్రీకరణ కూడా ఇక్కడే చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను.

కథే హీరో...
నేను ఎప్పుడు ప్రాక్టికల్ విషయాలనే నమ్ముతాను. అందుకే హీరోయిజం కంటే కథనే బాగా నమ్ముతాను. కథే హీరో. బిచ్చగాడు సక్సెస్ కూడా నా దర్శకుడిది, కథే.

ఏడ్చేశాను...
కథ వినగానే ఏడ్చేశాను. ఇందులో సెంటిమెంట్, ఎమోషన్స్ నన్ను అంత బాగా కదిలించాయి. ఇప్పుడు ఆడియెన్స్ కూడా ఈ ఎలిమెంట్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. దర్శకుడు శశి తన నిజజీవితంలో చూసిన ఓ నిజఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నారు.

ఆ సన్నివేశం చేయడానికి కష్టపడ్డాను...
ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం చాలా కీలకం. ఆ సన్నివేశంలో ఏడుస్తూనే ఉండాలి. ఈ సన్నివేశాన్ని రెండు రోజుల పాటు చిత్రీకరించాం. ఈ రెండు రోజులు గ్లిజరిన్ వాడాను. చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఆ సీన్ చాలా బాగా పండింది. అలాగే యాక్షన్ సన్నేవేశాలు చేయడం ఈ సినిమాలో డోస్ పెంచడంతో కష్టపడాల్సి వచ్చింది.

సీక్వెల్ ఉంటుంది....
నకీలీ, డా.సలీం చిత్రాలకు సీక్వెల్ చేస్తున్నాను. అయితే ప్రస్తుతం సైతాన్, యుముడు చిత్రాలను చేసిన తర్వాత తెలుగు, తమిళంలో ఓ సినిమా చేయబోతున్నాను. తర్వాతే ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను.

ఇబ్బంది పడలేదు...
ఈచిత్రానికి నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా యాక్ట్ చేయడం నాకు ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే కథ వినగానే నేను మెంటల్ గా సిద్ధపడ్డాను. దాంతో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. ఈ చిత్రానికి సంబంధించి జీవితం అంటే ఏంటో ఇంకా బాగా తెలిసింది.

సమయం ఉండటం లేదు....
ప్రస్తుతం ఏడాదికి మూడు సినిమాలను నిర్మిస్తూ, నటిస్తున్నాను. అందువల్ల వేరే చిత్రాలకు సంగీతం చేయడానికి సమయం ఉండటం లేదు. ఒకప్పుడు నా మ్యూజిక్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్నారు. 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved