pizza
Vijay Antony interview (Telugu) about Killer
`కిల్ల‌ర్` మెసేజ్ సినిమా కాదు.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ - విజ‌య్ ఆంటోని
You are at idlebrain.com > news today >
Follow Us

4 June 2019
Hyderabad

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్‌'.. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌–టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. అషిమా క‌థానాయిక‌ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని జూన్ 5న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ ఆంటోని ఇంట‌ర్వ్యూ..

- ఈ సినిమా డైరెక్ట‌ర్ అండ్ర్యూ లూయిస్ నా స్నేహితుడు. నేను బి.ఎస్సీ ఫిజిక్స్ చ‌దివిన త‌ర్వాత విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్స్‌లో ఓ డిగ్రీ చేశాను. ఆ స‌మ‌యంలో అండ్ర్యూ లూయిస్ నాకు ప‌రిచ‌యం అయ్యాడు. అయితే ఆ స‌మ‌యంలో త‌ను పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడ‌ని నాకు తెలియ‌దు. ఇద్ద‌రి మ‌ధ్య ప్రొఫెష‌న‌ల్‌గా ఎలాంటి రిలేష‌న్ లేకుండా ఉండేది. ఐదేళ్ల క్రితం అండ్ర్యూ ఓ సినిమాను డైరెక్ట్ చేశాడు. త‌ర్వాత నాకు క‌థ చెప్పాడు. నాకు న‌చ్చింది. సినిమా పూర్తి చేశాం. సినిమా చూసిన త‌ర్వాత త‌ను మంచి నెరేట‌రే కాదు.. మంచి ఫిలిం మేక‌ర్ అని అర్థ‌మైంది.

- ఈ చిత్రానికి నేను సంగీతాన్ని అందించ‌లేదు. సైమ‌న్ కింగ్ సంగీతాన్ని అందించాడు. మ్యాక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశాడు. మంచి టీం కుదిరింది. ఇక రెండు మూడేళ్ల వ‌ర‌కు నేను నా సినిమాల‌కు సంగీతం అందించాల‌ని అనుకోవ‌డం లేదు. మంచి స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవ‌డానికి, న‌ట‌న‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాల‌ని అనుకుంటున్నాను.

- ఈసినిమాలో స్క్రీన్‌ప్లే ప్ర‌ధానంగా ఉంటుంది. సాధార‌ణంగా ఏ సినిమా చేసేట‌ప్పుడైనా పూర్తి స్క్రిప్ట్ విన‌డానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తాను. ఇక పాత్రల విష‌యానికి వ‌స్తే నేను సీరియ‌ల్ కిల్ల‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. అర్జున్‌గారు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించారు. ఆయ‌నొక లెజెండ్రీ యాక్ట‌ర్‌. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉంది. మంచి విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఈ సినిమాలో నేను ఎందుకు వ‌రుస హ‌త్య‌లు చేస్తుంటాను? మ‌ంచి వాడినా? చెడ్డ‌వాడినా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

interview gallery



- నేను గొప్ప న‌టుడ్ని కాను. న‌ట‌న‌తో నా వంతుగా నేను ఏదో ప్ర‌య‌త్నం చేస్తున్నాను. అయితే అర్జున్‌గారు సెటిల్డ్ యాక్ట‌ర్‌. ఆయ‌న న‌ట‌న‌ను చూస్తూ ఉండిపోయేవాడిని.

- ఇంత‌కు ముందు నేను చేసిన కొన్ని చిత్రాల్లో మంచి మెసేజ్ ఉంది. కానీ సినిమా మాత్రం క‌మ‌ర్షియ‌ల్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌. కుటుంబంతో క‌లిసి చూసేలా ఉంటుంది. ఎలాంటి మెసేజ్‌ను ఈ సినిమాలో ఇవ్వ‌లేదు.

- స్ట్ర‌యిట్ సినిమాను త్వ‌ర‌లోనే చేయాల‌నుకుంటున్నాను. ముందుగా నేను తెలుగు నేర్చుకోవాలి.

- `కిల్ల‌ర్‌` ఒక సస్పెన్స్ థ్రిల్ల‌ర్ కాబ‌ట్టి చిన్న లైన్ చెప్పిన స్టోరీ మొత్తం రివీల్ అయిపోతుంది. కాబ‌ట్టి లైన్‌ను చెప్ప‌లేను. అయితే ఓ వ్య‌క్తిగ‌త కార‌ణంతో హ‌త్య‌లు చేసే కిల్ల‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. న‌న్ను ప‌ట్టుకోవాల‌నుకునే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అర్జున్‌గారు న‌టించారు. సినిమాకు స్క్రీన్‌ప్లే హైలైట్‌. ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేసేలా ఉంటుంది.

- తదుప‌రి సినిమా `ఖాకి`(త‌మిళం). ఈ టైటిల్‌తో తెలుగులో రీసెంట్‌గా ఓ మూవీ వ‌చ్చింది కాబ‌ట్టి.. తెలుగు టైటిల్ మారే అవ‌కాశాలున్నాయి. అలాగే అరుణ్ విజ‌య్‌తో క‌లిసి `జ్వాలా` అనే సినిమా కూడా చేస్తున్నాను. ఇందులో జ‌గ‌ప‌తిబాబుగారు, ప్రకాష్‌రాజ్ న‌టిస్తున్నారు.

ఇవి కాకుండా ఓ ప‌ది సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అన్నీ నా బ్యాన‌ర్‌లో కాకుండా బ‌య‌ట బ్యాన‌ర్‌లోనే చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved