pizza
Vijay Antony interview (Telugu) about Yaman
`య‌మ‌న్` త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది - విజ‌య్ ఆంటోని
You are at idlebrain.com > news today >
Follow Us

21 February 2017
Hyderabad

 

విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌`. య‌మ‌న్ ఈ శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా విజయ్‌ ఆంటోని మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `య‌మ‌న్‌` ఏ త‌ర‌హా చిత్రం?
- ఇది పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌. దీనికి ఎలాంటి స్ఫూర్తి లేదు. మేం దీన్ని పూర్తిగా క్రియేట్ చేశాం. నా సినిమా `న‌కిలీ` చూశారా? అది కూడా ఊహాజ‌నిత‌మైన చిత్రం. ఇది కూడా అలాంటిదే. మ‌న‌కి రాజ‌కీయ‌వేత్త‌ల గురించి తెలుసు. వాళ్లు ఎలా ఉంటారు? ఎలా ప‌నుల‌ను చేస్తారు? వ‌ంటివ‌న్నీ మ‌న‌కు బాగా తెలుసు. వాటిని దృష్టిలో ఉంచుకుని క‌ల్పిత‌గాథ‌ను అల్లుకున్నాం. ఇందులో క‌థ చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది.

* ఇంత‌కీ క‌థ ఏంటి?
- ఒక వ్య‌క్తి మంత్రి ఎలా అయ్యాడ‌న్న‌దే క‌థ‌. ఒక మామూలు వ్య‌క్తి ఎలా మంత్రి అయ్యాడ‌న్న‌ది ఇందులో ప్ర‌ధానాంశం.

* ఈ క‌థ కోసం ఏమైనా రీసెర్చ్ చేశారా?
- ఈ క‌థ‌కు రీసెర్చ్ చేయాల్సినంత అవ‌స‌రం లేదండీ. మ‌నందరికీ పాలిటిక్స్ తెలుసు. దాన్ని దృష్టిలో ఉంచుకుని చేశాం.

* ఇందులో డార్క్ సైడ్‌ని చూపించారా?
- ఇందులోనే కాదండీ. ఏ సినిమా అయినా విల‌న్ ఉంటే అందులో డార్క్ సైడ్‌ని చూపించ‌వ‌చ్చు. మ‌న సొసైటీని గురించి చెప్పాం.

* ప్ర‌స్తుతం త‌మిళనాడు రాజ‌కీయాలు స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌త‌ను క్రియేట్ చేస్తున్నాయి...
- ఈ క‌థ‌ను మేం రాసుకుని ఐదేళ్ల‌యింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌కు, మా సినిమాకు ఎలాంటి సంబంధ‌మూ ఉండ‌దు. త‌మిళ‌నాడు పాలిటిక్స్ క‌రెంట్ సినారియో ఉండ‌దు. మా క‌థ ముంబై, ఆంధ్ర‌తో పాటు ఏ రాష్ట్రానికైనా స‌రిపోతుంది.

* అంటే ఈ రాష్ట్రాల్లో పాలిటిక్స్ వేరుగా ఉంటాయి క‌దా?
- రాజ‌కీయాలు వేరుగా ఉండ‌వ‌చ్చేమో కానీ, రాజ‌కీయ‌నాయ‌కులు ఎక్క‌డైనా ఒకే విధంగా ఉంటారు. కేవ‌లం లాంగ్వేజ్ డిఫ‌రెన్స్ ఉంటుందేమో కానీ అంద‌రూ ఒకేలా ఉంటారు. కొంద‌రు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతోనే రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి ఉండ‌వ‌చ్చు. మ‌రికొంత‌రు స్వీయార్జ‌నే ధ్యేయంగా వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. రాజ‌కీయనాయ‌కుల్లోనూ ర‌క‌ర‌కాల వ్య‌క్తులు ఉంటారు. 30 శాతం మంచి వారు ఉంటే, 70 శాతం మంది ధ‌నార్జ‌న‌కే వ‌స్తారు.

* టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటి?
- చెడు చేసేవారి ప‌ట్ల య‌ముడు అత‌డు అనే అర్థంలో పెట్టాం. య‌మ‌న్ అంటే శివుడి అవ‌తార‌మే. ధ‌ర్మాన్ని కాపాడేవాడే య‌మ‌ధ‌ర్మ‌రాజు. మిగిలిన అంద‌రి దేవుళ్ల‌లోకీ య‌ముడు చాలా మంచి దేవుడు. కానీ మ‌నం ఆయ‌న్ని వేరే ర‌కంగానే ఇన్నేళ్లుగానూ చూశాం.

* ఈ క‌థ ముందు విజ‌య్ సేతుప‌తికి చెప్పార‌ట క‌దా?
- త‌ను చాలా బిజీగా ఉన్నాడు. నాక్కూడా విజ‌య్ సేతుప‌తి అంటే ఇష్టం. ఆయ‌న కాల్షీట్లు అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ క‌థ నా వ‌ర‌కు వ‌చ్చింది.

* మీకోసం క‌థ‌లో ఏమైనా మార్పులు చేశారా?
- అలాంటివేమీ లేవండీ. అలా ఏమీ చేయ‌లేదు. నేను నిర్మాత‌గా, సంగీత ద‌ర్శ‌కుడిగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడికి సాయం చేశానంతే.

* ఈ సినిమా కోసం బ‌రువు పెరిగార‌ట క‌దా?
- త‌క్కువేనండి. చాలా త‌క్కువ పెరిగాను.

* మీకు క‌థ విన‌గానే చాలా భారీగా అనిపించిందా?
- అలాంటిదేమీ లేదండీ. ఎందుకంటే ఈ క‌థ ఎలాంటి వారికైనా సూట‌వుతుంది. త‌ప్ప‌కుండా అంద‌రినీ ఎంగేజ్ చేస్తుంది.

* త‌మిళ‌నాడులో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయ‌నుకుంటారు?
- ఏం ఫ‌ర్వాలేదండీ. మా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చాలా బాగా వ‌చ్చిందండీ. చూసిన వారంద‌రూ సినిమా కోసం వేచి చూస్తున్నారు. కాక‌పోతే నెలాఖ‌రు కాబ‌ట్టి ఎవ‌రిద‌గ్గ‌ర‌న్నా డ‌బ్బులు అటూ ఇటూ అయి సినిమా చూడ‌రేమోన‌నే ఆలోచ‌న త‌ప్ప‌, మా సినిమాకు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు.

* బేతాళుడు సినిమా ప‌రాజ‌యం ప‌ట్ల మీరెలా స్పందిస్తారు?
- అది చాలా మంచి సినిమా అండీ. కాక‌పోతే అందులో చాలా చిన్న మిస్టేక్ చేశాం. రిలీజ్ చేసిన త‌ర్వాత మాకు అది తెలిసింది. విల‌న్‌ని ఫ‌స్టాఫ్‌లో రివీల్ చేయ‌డం వ‌ల్ల జ‌య‌ల‌క్ష్మి పాత్ర‌ను మ‌రింత‌గా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఆ అంచ‌నాల‌ను సినిమా అందుకోలేక‌పోయింది. ఆ చిత్రం త‌మిళ వెర్ష‌న్ పెద్ద హిట్‌. కేవ‌లం నాలుగు రోజుల్లోనే అక్క‌డ పెట్టుబ‌డుల‌ను వ‌సూలు చేసేసింది.

* నిర్మాత‌ గురించి చెప్పండి?
- చాలా హార్డ్ వ‌ర్కింగ్‌. నిద్ర పోకుండా ప‌ని చేస్తాడు. చాలా బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. నా గ‌త సినిమాకు ప్ర‌మోష‌న్ స‌రిగా లేద‌ని నా భావ‌న‌.

* చేసిన పాత్ర‌లే చేయ‌డం బోర్ అనిపించ‌దా?
- అనిపించ‌దండీ. ఎందుకంటే క‌థ కొత్త‌గా ఉండాలేగానీ, ఏ పాత్ర‌ని ఎన్ని సార్లు చేసినా ప్రేక్ష‌కులు అంగీక‌రిస్తారు. ఇంకో మంచి క‌థ వ‌స్తే పొలిటిక‌ల్ చిత్రాన్ని నేను చేయ‌డానికి సిద్ధ‌మే. అలాగే పోలీస్ పాత్ర‌ల్ని చేయ‌డానికి కూడా వెన‌కాడ‌ను. పోలీసు సినిమాలు కంటిన్యూగా ఉన్నంత‌మాత్రాన ప్రేక్ష‌కులు బోర్ ఫీల‌వ్వ‌రు. స్క్రీన్‌ప్లే బావుండాలి.

Vijay Antony interview gallery

* ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుంద‌ని అనుకుంటారు?
- ప్ర‌తి సినిమా న‌కిలీ కావాల‌ని అనుకోను. బిచ్చ‌గాడు కావాల‌ని అనుకోను. ఎందుకంటే ఆయా సినిమాల‌కు త‌గ్గ రీచ్ ఆ సినిమాకు ఉంటుంది. బేతాళుడు త‌మిళ వెర్ష‌న్ విడుద‌లైన నాలుగు రోజుల‌కే సీఎం చ‌నిపోయారు. ఆ త‌ర్వాత వేరే ఏదో వ‌చ్చింది. అయినా అది బాగానే ఆడింది.

* ప్రొడ‌క్ష‌న్ ఈజీ అంటారా?
- కాదండీ. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కాదు. ఎందుకంటే తీయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, న‌టీన‌టుల్ని పిలిచి ప్ర‌మోష‌న్ చేయించాలి. అంత‌టి క‌ష్టం ఉంటుంది.

* నిర్మాత‌గా ఉంటూ న‌టించ‌డం ఇబ్బంది కాలేదా?
- కొన్ని సార్లు ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే నిర్మాత‌గా కొన్ని రాత్రులు నిద్ర‌ప‌ట్ట‌వు. కానీ న‌టుడిగా తెర‌మీద గ్లామ‌ర్‌గా క‌నిపించాలంటే నిద్ర త‌ప్ప‌కుండా పోవాల్సిందే. కానీ కుద‌రదు. అందుకే ఇందాక చెప్పాను కదా.. య‌మ‌న్ లాంటి క‌థ‌ల‌కు హీరో అందంగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఎవరైనా ఈ త‌ర‌హా సినిమాల్లో న‌టించ‌వ‌చ్చు. హిట్ కొట్ట‌వ‌చ్చు.

* టైమ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది?
- టైమ్ మేనేజ్‌మెంట్‌ని ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. భ‌విష్య‌త్తులో ఇంకా నేర్చుకుంటా.

* తెలుగులో సినిమా చేస్తాన‌న్నారు?
- ఈ ఏడాది చేస్తానండీ



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved