pizza
Vikram interview about Sketch
'స్కెచ్‌'... పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ - విక్రమ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 January 2017
Hyderabad

విక్రమ్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం 'స్కెచ్‌'. విజయ్‌ చందర్‌ దర్శకుడు. ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో విక్రమ్‌తో ఇంటర్వ్యూ...

''స్కెచ్‌ అంటే ఏమిటి?
ఒక వ్యక్తిని చంపడానికి, కిడ్నాప్‌ చేసే సందర్భంలో స్కెచ్‌ వేయడం అనే పదం వినే ఉంటాం. దాన్నే సినిమా టైటిల్‌గా ఎందుకు పెట్టామని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పాత్ర గురించి..?
- సినిమాలో నా పాత్ర గురించి చెప్పాలంటే కారు లోన్లు తీసుకుని ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లించని వారిపై ... ఓ గ్రూప్‌తోస్కెచ్‌ వేసి వారి దగ్గర లోన్స్‌ వసూలు చేస్తుంటాను. ఓ సందర్భంలో ఓ పెద్ద వ్యక్తితో హీరో గొడవ పడతాడు. ఆ సందర్భంలో ఏమవుతుందనేదే అసలు సినిమా. ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ మూవీ. దర్శకుడు విజయ్‌ చందర్‌ మాస్‌ కమర్షియల్‌గా ప్రయత్నించాడు. మాస్‌ డైలాగ్‌లు, పంచ్‌లు.. రియాలిటీకి దగ్గరగా ఉంటూ ఫాంటసీకూడా వుంటుంది. ఇంతకుముందు చేసిన 'ఇరుముగన్‌.. కూడా తెలుగులో మంచి రెస్పాన్స్‌ వస్తుందని చెప్పాను. అలాగే ఆల్‌రెడి విడుదలైన ఈ స్కెచ్‌ చిత్రానికి తమిళనాడుతోపాటు ఓవర్‌సీస్‌లో మంచి ఆదరణ లభించింది. కథలో మంచి ట్విస్ట్‌లుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌ అద్భుతంగా వుంటుంది. ఈ కథను దర్శకుడు చెబుదామని ప్రయత్నించినా రెండు నెలలపాటు బిజీగా వుండడంతో వినలేదు. నా కోసం వెయిట్‌ చేశాడు. కథ విన్న తమన్నా కూడా ఎగ్జయిట్‌తో నటించింది. బాహుబలి తర్వాత బాగా ఆకట్టుకునే కథ అని ఆమె చెప్పడం విశేషం.

కథకు ఇన్‌స్పిరేషన్‌ ఏమైనా వుందా?
- దర్శకుడు ఏడేళ్ళక్రితం కథ రాసుకున్నారు. దాని ప్రకారం తమిళనాడులోని కొన్ని చోట్ల లోకల్‌ గూండాల వుండే ప్రాంతాలను పర్యటించి కథను రాసుకున్నాను. ఇది రియల్‌గా ఒక ఘటనతో చేసిన కథ ఇది. కళ్ళకు కట్టినట్లుగా వుండే చిత్రం. ఈ సినిమా చూశాక.. అందరూ నిజమే! ఇలాంటివి చూశాం అనిపించేట్లుగా వుంటుంది. ముందు అదేంటో చెబితే కథలో కిక్‌ పోతుంది.

కథ వినగానే మీకు ఏమనిపించింది?
- గతంలో నేను డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ వచ్చాను. ఈ సినిమా మాత్రం కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. తమిళంలో ఈ సినిమా చూసినవారందరూ నా పెర్‌ఫార్మెన్స్‌ బాగుందని అంగీకరించారు. నా భార్యకూడా మీ గురించి అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పింది. ధూల్‌, సామి, మల్లన్న వంటి కమర్షియల్‌ మూవీ. చాలా కాలం తర్వాత కమర్షియల్‌ సినిమా చేశాను. పంచ్‌ డైలాగ్‌లు కూడా ఎక్కువగా వుండకూడదని అనుకున్నాం. దానికితోడు హీరోయిజం కూడా నూతనంగా వుంటుంది. ఇక ప్రయోగాలు, కమర్షియల్‌ సినిమాలనేవి నాకు రెండు కళ్ళులాంటివి. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తారు. తెలుగులో సూపర్‌ హిట్‌ అవుతుందని యూనిట్‌కూడా చెప్పారు.

తమన్నా పాత్ర ఎలా వుంటుంది?
- తమన్నా బ్రాహ్మణ అమ్మాయిగా కనపడుతుంది.. సీరియస్‌గా సాగుతుంది. నేను మెకానిక్‌గా వుంటూ.. గూండాయిజం బ్యాక్‌గ్రౌండ్‌తో వుంటాను. మా ఇద్దరిదీ రేర్‌ కాంబినేషన్‌.. రొమాన్స్‌ చాలా సహజంగా వుంటుంది. ఫ్రెష్‌గానూ ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది.

ఇందులో వైవిధ్యమేంటి?
ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్‌ ఉండదు. సాధారణంగా నేను ఒక్కో సినిమా వైవిధ్యంగా వుంటేనే చేస్తాను. మాస్‌ కమర్షియల్‌గా వున్నా.. పాత్ర పరంగా కొత్తగా అనిపించాలి. ఇంతకుముందు సినిమాకు తేడా కచ్చితంగా కన్పిస్తుంది. ఇది తెలుగు, తమిళం ప్రేక్షకులకు బాగా నచ్చేసినిమా. కేరళలోనూ హిట్‌ అయింది. ఈ సినిమాలో ఎటువంటి సందేశం లేదు. కానీ చూసిన ప్రేక్షకుడు క్లాప్స్‌ కొట్టేలా వుంటుంది.

తెలుగులో సినిమా చేయరా?
దేశంలో చాలా బాషలున్నాయి. ఎక్కడ మంచి ఛాన్స్‌ వస్తుందే అక్కడ చేస్తాను. 'బాహుబలి' తీసుకుంటే తెలుగు సినిమా కాదు. ఇండియన్‌ సినిమా. నేను తర్వాత హిందీ సినిమా చేస్తున్నా. హిందీలో కూడా అపరిచితుడు, ఐ.. చూశారు. బాహుబలిని కూడా అన్ని భాషల్లో చూశారు. ముంబైలో కూడా తెలుగు, తమిళ సినిమాలు సబ్‌టైటిల్స్‌తో చూస్తారు. బాహుబలి సినిమా వచ్చి వైవిధ్యానికి గేట్స్‌ తెరిచేసింది. దక్షిణాదిలోనే మంచి టాలెంట్‌ పర్సన్‌ వున్నారనేలా చేసింది. 'అర్జున్‌రెడ్డి' రీమేక్‌ గురించి? మా అబ్బాయి 'అర్జున్‌రెడ్డి' రీమేక్‌ చేయబోతున్నాడు. న్యూయార్క్‌లో మెథడ్‌ యాక్టింగ్‌ నేర్చుకున్నాడు. తనను మూడేళ్ళ తర్వాత నటుడిగా చేయాలనుకున్నా. కానీ ఈ ఆఫర్‌ వచ్చింది. చాలా మంది కథకు సరిపోతాడని అన్నారు. అర్జున్‌రెడ్డిలో అన్ని అంశాలున్నాయి. పెర్‌ఫార్మెన్స్‌కు బాగా అవకాశంముంది. అందుకే బెస్ట్‌గా వుంటుందని నిర్ణయించాను. తండ్రిగా నాకు హ్యాపీ. ఈ సినిమా తర్వాత మళ్ళీవెనక్కువెళ్ళి డైరెక్షన్‌ కోర్సు చేస్తానన్నాడు.

రాజకీయాల్లోకి వస్తారా?
- నాకు పంచె కట్టుకోవడమే రాదు. సినిమానే నాకు జీవితం. పాలిటిక్స్‌ నాకు సరిపడదు. బేసిగ్గా నేను సిగ్గరిని. కెమెరా ఆన్‌చేస్తే నటించేస్తాను. అందుకే నేను రాజకీయాలకు పనికిరాననుకుంటున్నా.

శంకర్‌తో సినిమా ఎప్పుడు ఉంటుంది?
ఇటీవలే ఐ చేశాను కదా.. ఇంకా కొంత టైమ్‌ పడుతుంది.

కొత్త చిత్రాలు?
గౌతమ్‌మీనన్‌తో 'ధ్రువ నక్షత్రం' సినిమా చేయబోతున్నా. అలాగే 'సామి స్క్వేర్‌' చేస్తున్నా. తర్వాత కమల్‌సార్‌ బ్యానర్‌లో థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నా. అలాగే కర్ణ సినిమాను ఫిబ్రవరిలో ప్రకటిస్తారు. మహాభారతంలో భీష్మ, దుర్యోధన.. కుంతీ, ద్రౌపతి.. ఈ పాత్రలు ఎవరు చేస్తే బాగుంటుందో వారు ఈ చిత్రంలో వుంటారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌ సినిమా అది. ఆస్కార్‌ రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఆ సినిమా కోసం సిద్ధమవుతున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved