pizza
Vinod Lingala about Guppedantha Prema
సిల్వ‌ర్ స్క్రీన్‌పై పొయిటిగ్గా ఉంటుంది - వినోద్ లింగాల‌
You are at idlebrain.com > news today >
Follow Us

08 June 2016
Hyderaba
d

ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్ లో డైర‌క్ట‌ర్ వినోద్ లింగాల తెర‌కెక్కించిన అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం గుప్పెడంత ప్రేమ. వెండితెర మీద‌కు రావ‌డానికి సిద్దమైంది. సాయి రోన‌క్, అదితి సింగ్, ఐశ్వ‌ర్య.కె, నోయ‌ల్ నేని, న‌వీన్ నేని ప్రధాన తార‌గ‌ణంగా న‌టించారు. ఈ నెల 17న విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.

వినోద్ లింగాల మాట్లాడుతూ `` మంచి ప్రేమ క‌థా చిత్రాల‌కు ఎప్పుడూ సిల్వ‌ర్ స్క్రీన్ మీద ఆద‌ర‌ణ ఉంటుంది. తాజాగా మా `గుప్పెడంత ప్రేమ‌` కూడా అలాంటి ఉత్స‌వాన్ని జ‌రుపుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ నెల 17న మా సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. ఇటీవ‌ల మార్కెట్ లోకి విడుద‌లైన ఆడియో మరియు ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న రావ‌డంతో మా యూనిట్ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. స‌ఖియా స‌ఖియా అనే పాట సావన్ అనే మ్యూజిక్ ఆప్ లో టాప్ ఐదు పాటల్లో 4వ ప్లేస్ లో ఉండ‌టంతో పాటూ ఒక ప్ర‌ముఖ వార్తాప‌త్రిక ప్ర‌చురించిన టాప్ 5 ఇండియ‌న్ ఆల్బ‌మ్స్ లో ఒక‌టిగా ఈ చిత్ర ఆడియో ఉండటం, వాటి నుంచి మంచి రివ్యూలు రావ‌డం విశేషం. షిల్లాంగ్, చిరపుంజి, మ‌వ్లైనాంగ్, మేఘాల‌య లోని వివిధ ప్రాంతాల్లో మ‌రియు ఉత్త‌ర‌, తూర్పు భార‌త‌దేశంలో గ‌ల అనేక లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించిన ఈ చిత్రం అంద‌రికీ క‌చ్చితంగా క‌న్నుల పండుగ‌గా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రికీ జీవితంలో తొలి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎంత బాగా ఉంటుందో, కొన్ని సార్లు బ్రేక‌ప్ అయిన‌ప్పుడు కూడా ఆ గాయం అంతే గ‌ట్టిగా ఉంటుంది. కాక‌పోతే ఆ గాయం గుర్తుకొచ్చిన ప్ర‌తిసారీ పెదాల‌పై చిరున‌వ్వు విరుస్తుంది. తొలి ప్రేమ గురించిన ఆ విష‌యాల‌ను అంతే అందంగా తెర‌పై క‌వితాత్మ‌కంగా చెప్పాం. యూనివ‌ర్శిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. నేను ఇంత‌కు ముందు ఇట్స్ మై ల‌వ్ స్టోరీ, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల‌కు ప‌నిచేశాను. ద‌ర్శ‌కుడిగా నాకు గుప్పెడంత ప్రేమ తొలి చిత్రం. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను``అని అన్నారు.

Vinod Lingala interview gallery

ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వంః వినోద్ లింగాల, ప్రొడ్యూస‌ర్ః ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్, మ్యూజిక్ డైర‌క్ట‌ర్ః న‌వ్‌నీత్ సుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫీః సంజ‌య్ లోక్‌నాథ్, ఎడిట‌ర్ః బ‌స‌వ‌,ఆర్ట్ః రాజీవ్ నయ్య‌ర్, లైన్ ప్రొడ్యూస‌ర్ః పి టి గిరిధ‌ర్ రావు, ప్రొడ‌క్ష‌న్ & ప‌బ్లిసిటీ డిజైన‌ర్ః విజ‌య్ మోప‌ర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పావ‌ని లింగాల‌, లిరిక్స్ః వ‌న‌మాలి, శ్రీమ‌ణి, గ‌ణేష్ సలాడి, తిల్లు ప‌సునూరి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved