pizza
Vishal interview about Rayudu
పందెంకోడివాడు-వీడు తరహాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్ రాయుడు   - విశాల్
You are at idlebrain.com > news today >
Follow Us

12 May 2016
Hyderaba
d

మాస్‌ హీరో విశాల్‌శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు '.  విశాల్‌ సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.ఈ చిత్రం తెలుగులో మే 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశాల్ తో ఇంటర్వ్యూ....

 ‘రాయుడు గురించి చెప్పండి?
రాయుడు చాలా మాస్ చిత్రం. మ‌దురైలోని రాజ‌పాళ్యం అనే టౌన్‌లో చిత్రీక‌రించాం. ముత్త‌య్య ఇంత‌కు ముందు రెండు సినిమాలు చేశారు. ఆ క‌థ‌ల‌ను కూడా నాకు చెప్పారు. నాతో సినిమా చేయాల‌న్న‌ది ఆయ‌న‌కున్న ఆశ‌. న‌న్ను ప్రేక్ష‌కులు ఎలా చూడాల‌నుకుంటారో అలా తెర‌కెక్కించారు. వేల్‌రాజ్ కెమెరా ప‌నితీరు మెప్పిస్తుంది.  ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇది రూర‌ల్ చిత్రం. మూట‌లు మోసే వ్య‌క్తిగా క‌నిపిస్తాను.

పాట‌ల గురించి చెప్పండి?
ఇంత‌కు ముందు కూడా నేను ఇమాన్‌తో ప‌నిచేశాను. ఆయ‌న సంగీతం ఒక‌సారి ఏదో విన‌గానే న‌చ్చేసిన‌ట్టువ‌దిలేసిన‌ట్టు ఉండ‌దు. వినేకొద్దీ బావుంటుంది. ఐదేళ్ల త‌ర్వాత విన్నా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇళ‌య‌రాజా సార్ సంగీతంలో ఆ గుణం ఉంటుంది. ఇప్పుడు నాకు ఇమాన్‌లోనూ ఆ గుణం క‌నిపిస్తోంది.

రాయుడు క‌థ ఏంటి?
బామ్మ‌కి మ‌న‌వ‌డికి మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. ఈ సినిమాకు హీరోహీరోయిన్ ఇద్ద‌రూ బామ్మే. పందెంకోడివాడు-వీడు సినిమాల త‌ర్వాత ఈ త‌ర‌హా చిత్రం చేస్తున్నాను. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా. గ‌డ్డంతోటాటూతో క‌నిపిస్తాను.

ఫైట్స్ గురించి చెప్పండి?
ఇందులో ఫైట్లు చాలా స్పెష‌ల్‌గా ఉంటాయి. కండ‌లు తిరిగిన మ‌గాడు ప‌ది మందిని కొడితే ఎంత నేచుర‌ల్‌గా ఉంటుందోఅంత నేచుర‌ల్‌గా తెర‌కెక్కించాం. ఎక్క‌డా రోప్ వ‌ర్క్ వాడ‌లేదు. కాస్త బ‌రువు పెరిగాను. అన‌ల్ అర‌సు నాతో ఫైట్స్ చేయించ‌డాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంత‌కు ముందు చేసింది వేరుఈ సారి అత‌ను ఇష్ట‌ప‌డి చేసింది వేరు.

రాయుడులో స్పెషాలిటీ ఏంటి?
ఈ చిత్రం పందెంకోడి క్లైమాక్స్ ను త‌ల‌పిస్తుంది. నేను ఎక్క‌డికి వెళ్లినా పందెంకోడి వంటి సినిమా కావాల‌ని అడుగుతున్నారు. ఈ సినిమా దాన్ని మ‌ర‌పించేలా ఉంటుంది.

త‌దుప‌రి చిత్రాలేంటి?
శిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో త‌మ‌న్నాజ‌గ‌ప‌తిబాబుగారు న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేస్తున్నాం. ఆ త‌ర్వాత మిష్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో జులై నుంచి ప్రాజెక్ట్ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత టెంప‌ర్ సినిమా చేస్తా. బాలాగారితోనూ ఓ సినిమా ఉంటుంది. 

తెలుగులో స్ట్రెయిట్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు?
అవునండీ పాపం ఆ ద‌ర్శ‌కుడు నాకోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. స‌మ‌యం చూసుకుని చేస్తాం.

ప్ర‌తి సారీ తెలుగులో మీ సినిమా చేసేట‌ప్పుడు ఒక వారం ఆల‌స్యంగా విడుద‌ల చేస్తున్నారు ఎందుకు?
అక్క‌డ క‌రెక్ట్ టైమ్ ఉన్న‌ప్పుడు కొన్నిసార్లు ఇక్క‌డ కుద‌ర‌దు. నాకు తెలుగు మార్కెట్  బోన‌సే. త‌మిళ మార్కెట్ మెయిన్‌. అందుకే దాన్ని వ‌దులుకోలేను. 

టెంప‌ర్ రీమేక్ చేయాల‌ని ఎందుక‌నిపించింది?
ఆ సినిమాలో సోష‌ల్ కాజ్ ఉంది. అందుకే ఆ కాజ్‌ను త‌మిళ ప్రేక్ష‌కుల‌కు కూడా చెప్పాల‌ని చేస్తున్నాను. సోష‌ల్ కాజ్ అనేది క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో పెడితే చాలా మందికి బాగా రీచ్ అవుతుంది.

న‌డిగ‌ర్ సంగంలో మీరు ఎల‌క్ట్ అయిన త‌ర్వాత వ‌చ్చిన మార్పులేంటి?
న‌ష్టాల్లో ఉన్న సంగాన్ని ఇప్పుడు రూ.9కోట్ల ప్రాఫిట్‌తో ఉంచాం. బిల్డింగ్ క‌డుతున్నాం.

 పెళ్లి మండ‌పం క‌డుతున్నారా? పెళ్లి మండ‌పం క‌డుతున్నారా?
అవునండీ. 2018 జ‌న‌వ‌రి 14న ప్రారంభిస్తాం.

మ‌రి పెళ్లెప్పుడు?
జ‌న‌వ‌రి 15నే అండి. అక్క‌డ జ‌రిగే తొలి పెళ్లి నాదే అవుతుంది.

శ్రీదివ్య గురించి చెప్పండి?
త‌ను చాలా ల‌క్కీ అని విన్నాను. త‌న పాత్ర చాలా ఫాంట‌సీగా ఉంటుంది. 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved