pizza
Sushanth interview (Telugu) about Chi La Sow
`చి.ల‌.సౌ` నాకొక కొత్త చాప్ట‌ర్ - సుశాంత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 July 2018
Hyderabad

సుశాంత్‌, రుహని శర్మ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరుని సినీ కార్పొరేషన్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో జస్వంత్‌ నడిపల్లి, భరత్‌కుమార్‌ మలశాల, హరి పులిజల నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'చి||ల||సౌ'. ఈ చిత్రం ఆగస్ట్‌ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సుశాంత్ ఇంట‌ర్వ్యూ...

చిలసౌ టైటిల్ గురించి?
- ముందు ఈ సినిమాకు చిరంజీవి అర్జున్ అనే టైటిల్‌ను అనుకున్నాం. కానీ అదే స‌మ‌యంలో అర్జున్ రెడ్డి సినిమా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో మ‌ళ్లీ అర్జున్ అనే టైటిల్ పెడితే ప్రేక్ష‌కులు ఏమైనా ఊహించే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.. చిల‌సౌ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నాం. ఈ టైటిల్‌ను వెన్నెల‌కిశోర్ స‌జెస్ట్ చేశారు.

ఇలాంటి సినిమా చేయ‌డానికి కార‌ణాలు?
- ఇంత‌కు ముందు నేనే ఏదైనా కొత్త‌గా స‌బ్జెక్ట్ చేయాల‌నుకుంటున్నాన‌ని చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. అలాంటి స‌బ్జెక్ట్ ఇది. రేపు సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. కొత్త‌గా ట్రై చేశాడ‌ని ప్రేక్ష‌కులు అర్థం చేసుకుంటే నేను విజ‌యం సాధించిన‌ట్లే. ఇంత‌కు ముందు నాపై ర‌క‌రకాల ప్ర‌భావాలుండేవి. దానికి చాలా కార‌ణాలుండొచ్చు. కానీ త‌ప్పో.. ఒప్పో స్వంత నిర్ణ‌యం తీసుకుంటే మంచిద‌ని భావించి నిర్ణ‌యం తీసుకున్నాను. మావ‌య్య కూడా అదే మాట అన్నారు. రాహుల్ రెండు గంట‌ల పాటు క‌థ‌ను నెరేట్ చేసిన‌ప్పుడు.. ఈ సినిమాను బ‌య‌టి బ్యాన‌ర్‌లో చేద్దామ‌ని చెప్పి ఇద్ద‌రు, ముగ్గురు నిర్మాత‌ల‌ను క‌లిశాం. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. చివ‌ర‌కు నా మిత్రుడు హ‌రీశ్ ద్వారా జ‌స్వంత్‌, భ‌ర‌త్‌గారిని క‌లిశాను. వారికి క‌థ న‌చ్చ‌డంతో సినిమా స్టార్ట్ అయింది.

అన్న‌పూర్ణ స్టూడియోస్ సినిమాను రిలీజ్ చేయ‌డానికి కార‌ణ‌మేంటి?
- రాహుల్‌, స‌మంత మంచి స్నేహితులు. ఈ సినిమా స్టార్ట్ కావ‌డానికి ముందు ఇద్ద‌రికీ రాహుల్ క‌థ‌ను సింపుల్‌గా చెప్పాడు. సినిమా చేసిన త‌ర్వాత చైత‌న్య‌, స‌మంత‌ల‌కు ఫీడ్ బ్యాక్ కోసం సినిమా చూపించారు. చైత‌న్య‌కు సినిమా నచ్చ‌డంతో.. త‌ను నాగార్జున‌గారికి చెప్పారు. మావ‌య్య‌కు న‌చ్చి సినిమా బావుంద‌ని అన్నారు. ఆయ‌న‌లా అన‌డం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాని మ‌నం పార్ట‌న‌ర్ షిప్‌లో చేద్దామ‌ని నాగ‌చైత‌న్య సిరుని సినీ కార్పొరేష‌న్ వారిని అడిగారు. వాళ్లు ఒప్పుకోవ‌డంతో మా సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది.

interview gallery



సినిమా క‌థేంటి?
- సినిమా పెళ్లి చూపుల‌తో ప్రారంభం అవుతుంది. 24 గంట‌ల్లో జ‌రిగే క‌థ‌. చాలా నేచుర‌ల్‌గా ఉంటుంది. సినిమాటిక్‌గా ఉండ‌దు. అన్ని క్యారెక్ట‌ర్స్ సింపుల్‌గా, రియ‌లిస్టిక్‌గా ఉంటాయి. మేక‌ప్ లేకుండా న‌టించాను. సినిమా మొత్తం షార్ట్స్‌లో క‌న‌ప‌డ‌తాను. ఈ సినిమా నాకొక కొత్త చాప్ట‌ర్‌గా ఫీల్ అయ్యాను.

నాగార్జున సినిమా చూసి మీతో ఏమ‌న్నారు?
- నాతో బావుంద‌ని చిన మావ‌య్య‌ అన్నారు. త‌ర్వాత అమ్మ‌కు ఫోన్ చేసి సుశాంత్‌కు సూట్ అయ్యే సినిమా చేశాడు. ఇలాగే చేసుకుంటే పోతే త‌న‌కు బావుంటుంది అన్నారు. అయ‌న‌లా అన‌డం పెద్ద స‌ర్టిఫికెట్‌తో స‌మానం. నాకే కాదు.. మా టీంకు ఇది గ‌ర్వంగా అనిపించింది.

డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ గురించి?
- రాహుల్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేయ‌లేదు కానీ.. హీరోగా చేయ‌డం వ‌ల్ల త‌ను చాలా అబ్జ‌ర్వ్ చేసి ఉంటాడు. త‌ను ఇచ్చిన నెరేష‌న్ బాగా న‌చ్చింది.

మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా.. అంటే మ‌న ప‌క్కింటి కుర్రాడిలాంటి పాత్ర‌. పాత్ర కోసం నాలుగైదు రోజులు వ‌ర్క‌షాప్‌లాగా చేశాం. పాత్ర ఎలా ఉండాలి. బాడీలాంగ్వేజ్ హీరోయిక్‌గా ఉండ‌కూడదు. మామూలుగా అనిపించాలి. అని డిస్క‌స్ చేసుకుని రోల్ డిజైన్ చేసుకున్నాం. రాహుల్ హీరో కావ‌డం వ‌ల్ల సినిమాకు ప్ల‌స్ అయ్యింది.

త‌దుప‌రి చిత్రం?
- తదుప‌రి చిత్రం ఫ‌న్ థ్రిల్ల‌ర్‌. అది కూడా కొత్త‌గా ఉండేలానే ప్లాన్ చేస్తున్నాను. ద‌ర్శ‌కుడు ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియజేస్తాను.


 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved