pizza
It’s Khakee all the way!
అన్ని చోట్లా `ఖాకి` మాటే!
You are at idlebrain.com > news today >
Follow Us

19 November 2017
Hyderabad

ఒక సినిమా హిట్ కావ‌డానికి క‌థా బ‌లంతో పాటు ఇంకా చాలా విష‌యాలు కీల‌కం. పాట‌లు బావుండాలి, కెమెరా బావుండాలి. యాక్ష‌న్ కూడా బావుండాలి. ఇప్పుడు `ఖాకి` విష‌యంలో మిగిలిన అన్ని అంశాల‌తో పాటు యాక్ష‌న్ సీన్లు చాలా బావున్నాయ‌నే మౌత్‌టాక్ స్ప్రెడ్ అవుతోంది. నేర‌స్థుల‌ను పోలీసులు ప‌ట్టుకోలేద‌ని ఆరోప‌ణ‌లు  చేయ‌డం తేలికే. కానీ కొన్ని సార్లు ప్రాణాల‌కు తెగించి నేర‌స్థుల‌ను ప‌ట్టుకుంటార‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా చూపించింది `ఖాకి` చిత్రం. అందులోనూ ఈ చిత్రంలో కంపోజ్ చేసిన తోడేలు టెక్నిక్ ఫైట్‌ హైలైట్‌గా నిలిచింది.

శ‌రీరానికి  ముందుగా నూనె పూసుకుని, దాని మీద బూడిద పూసుకుని, దాడి చేయాల‌నుకున్న‌ వ్య‌క్తికి ఎదురుగా ఒక‌రు ప‌రిగెత్తుకుంటూ వ‌స్తుంటారు.  త‌ప్పించుకుని పారిపోయే క్ర‌మంలో ఆ వ్య‌క్తిని మ‌రో ఇద్దరు ఛేజ్ చేస్తారు. దాన్నే హ‌వేలీలు తోడేలు టెక్నిక్‌గా పిలుచుకునేవారు. ఈ తోడేలు టెక్నిక్‌ని `ఖాకి``లో వాడారు. దిలీప్ సుబ్బ‌రాయ‌న్ ఆ ఫైట్ల‌ను కంపోజ్ చేసిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.  అస‌లు తెలుగు సినిమాలో ఇలాంటి ఫైట్ కొత్త‌గా అనిపిస్తోంది.

దీనికి తోడు విల‌న్ గ్యాంగ్‌లోని కీల‌క వ్య‌క్తిని ప‌ట్టుకునే సీన్ ఒక‌టి ప్రేక్ష‌కుల్ని కుర్చీల్లో కూర్చోనివ్వ‌నంత ఉత్కంఠ‌త రేపుతోంది. రెండు బ‌స్సుల మ‌ధ్య వ‌చ్చే ఫైట్ సీక్వెన్స్  అంద‌రిలోనూ టెన్ష‌న్ పెంచుతోంది.

 ఈ చిత్రంలోని స‌న్నివేశాల‌ను థియేట‌ర్‌లో చూస్తేనే మ‌జా వ‌స్తుంద‌ని చూసిన ప్రేక్ష‌కులు సైతం చెబుతున్నారు.

హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కార్తి, ర‌కుల్ జంట‌గా న‌టించారు. సంగీత ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్న ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని తెలుగులో అందించింది.ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved