pizza
Jamba Lakidi Pamba gets U/A, film release on 22 June
`జంబ‌ల‌కిడి పంబ‌` సెన్సార్ పూర్తి! జూన్ 22న విడుద‌ల‌!
You are at idlebrain.com > news today >
Follow Us

9 June 2018
Hyderabad

Jamba Lakidi Pamba Release Date Announced. The Movie To Hit Cinemas On June 22

Srinivas Reddy Starrer Jamba Lakidi Pamba release date is officially announced by the makers today. The movie will hit the screens on June 22.

Directed by JB Murali Krishna, "Jamba Lakidi Pamba" is a comic-drama film. The movie stars Srinivas Reddy and debutante Siddhi Idnani in the lead roles. The supporting cast includes Posani Krishna Murali, Vennela Kishore, Satyam Rajesh, Dhanraj, Raghu Babu, Jaya Prakash Reddy, Tanikella Bharani, Hari Teja, Himaja, Sudha, Madhumani & Rajitha.

The movie is produced by Ravi, Jojo Jose & N Srinivasa Reddy and co-produced by B. Suresh Reddy under the banners Sivam Celluloids and Mainline Productions.

`జంబ‌ల‌కిడి పంబ‌` సెన్సార్ పూర్తి! జూన్ 22న విడుద‌ల‌!

`గీతాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా` వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత కమెడియన్ శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం `జంబ‌ల‌కిడి పంబ‌`. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు.

శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ ``క‌థ న‌చ్చి చేసిన చిత్ర‌మిది. మా సినిమాకు `జంబ‌ల‌కిడి పంబ‌` టైటిల్ చాలా చ‌క్క‌గా కుదిరింది. టైటిల్ చూసి సినిమాకు వ‌చ్చిన‌ వారికి నిరాశ క‌ల‌గ‌దు. నిర్మాత‌లు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా తెర‌కెక్కించారు`` అని తెలిపారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ``రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. శ్రీనివాస‌రెడ్డిగారి కోస‌మే మా ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ప్రేక్ష‌కుల నాడి తెలిసిన వాళ్లం. అందుకే ఈ క‌థ‌ను ఎంపిక చేసుకున్నాం. అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకునే అంశాలు చాలా ఉంటాయి. సెన్సార్ పూర్త‌యింది. యు/ఎ వ‌చ్చింది. ఈ నెల 22న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నిర్మాత‌లు ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమా చేశారు. అంద‌రినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. సెన్సార్ యు/ఎ ఇచ్చింది. యువ‌త‌కు న‌చ్చే అంశాల‌న్నీ పుష్క‌లంగా ఉన్నాయి`` అని తెలిపారు.

న‌టీన‌టులు:
స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు:
సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved