pizza
Jayadev release on 30 June
జూన్‌ 30న గంటా రవి, జయంత్‌ సి.పరాన్జీల 'జయదేవ్‌'
You are at idlebrain.com > news today >
Follow Us

24 June 2017
Hyderabad

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం 'జయదేవ్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''గంటా రవిని హీరోగా పరిచయం చేస్తూ మా బేనర్‌లో నిర్మిస్తున్న 'జయదేవ్‌' చిత్రాన్ని జూన్‌ 30న విడుదల చేస్తున్నాం. డైనమిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా రవి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. జయంత్‌ ప్రతి సీన్‌ని అద్భుతంగా తీశారు. ఎమోషనల్‌ సీన్స్‌గానీ, ఫైట్స్‌గానీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. మా 'జయదేవ్‌' చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధించి మా అందరికీ మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. యాక్షన్‌ సీన్స్‌లో రవి పెర్‌ఫార్మెన్స్‌ అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమాతో గంటా రవి హీరోగా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు'' అన్నారు.

హీరో గంటా రవి మాట్లాడుతూ - ''నా మొదటి సినిమానే జయంత్‌గారులాంటి పెద్ద డైరెక్టర్‌తో చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. అన్ని విషయాల్లోనూ నన్ను సపోర్ట్‌చేసి సినిమా బాగా రావడానికి జయంత్‌గారు సహకరించారు. నేను బాగా పెర్‌ఫార్మ్‌ చేసానంటే అది జయంత్‌గారి గొప్పతనమే. ఈ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved