pizza
"Jayammu Nischayammura" Confirmed On 17th Nov
17న వస్తున్న "జయమ్ము నిశ్చయమ్మురా"
You are at idlebrain.com > news today >
Follow Us

29 October 2016
Hyderaba
d

Srinivasa Reddy-Poorna starrer "Jayammu Nischayammura" is confirmed to hit the screens on 17th of November. The film has been rising interest among the audience with its interesting tag lines "Samaikyangaa Navvukundaam" and "Desavaali Vinodam". The film is produced and directed by Sivaraj Kanumuri.

The release rights of this film were bagged at Rs 7 Cr by NKR Films which produced Vikram-Nayantara starrer "Inkokkadu" recently.

Director Shivaraj said, "I express my thanks to director Sri Sukumar for promoting the film after seeing a song in it and my gratitude to Sri. Neelam Krishna Reddy of NKR Films for bagging the rights after watching the entire film. We are geared up to release the film on November 17th".

AVS Raju presented the film while Sivaraj Kanumuri and Satish Kanumuri produced it.

17న వస్తున్న "జయమ్ము నిశ్చయమ్మురా"

శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". "సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్ తో.. "దేశవాళీ వినోదం" అనే సరికొత్త నినాదంతో సందడి చేస్తూ.. అందరి దృష్టినీ అమితంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం నవంబర్ 17న విడులవుతోంది.

ఈ చిత్రం హక్కులు ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ 7 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఇంతకుముందు విక్రమ్-నయనతార నటించిన "ఇంకొక్కడు" చిత్రాన్ని నిర్మించింది.

దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి మాటాడుతూ.. "మా సినిమా పాట చూసి సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ గారికి.. సినిమా నచ్చి, ఈ చిత్రం హక్కులు తీసుకున్న "ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్" నీలం కృష్ణారెడ్డిగారికి కృతజ్ఞతలు. "జయమ్ము నిశ్చయమ్మురా"ను నవంబర్ 17న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: ఏ.వి.ఎస్.రాజు, నిర్మాతలు: సతీష్ కనుమూరి-శివరాజ్ కనుమూరి, కథ-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి !!

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved