pizza
Just Business release this Month end
విడుదలకు సిద్ధమవుతున్న 'జస్ట్ బిజినెస్'

You are at idlebrain.com > news today >
Follow Us

1 March 2014
Hyderabad

త్రి ఐ ఫిలింస్ శ్రీని బొగడపాటి స్వీయదర్శకత్వంలో హరిచరణ్, దివ్యసింగ్ హీరో, హీరోయన్లుగా రూపొందిన మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ 'జస్ట్ బిజినెస్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా...

చిత్ర దర్శక, నిర్మాత శ్రీని బొగడపాటి మాట్లాడుతూ - ''చిన్న మెసేజ్ తో కూడుకున్న డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. ఆడియోకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. తొలి కాపీ రెడీ అయ్యంది. అన్ని హంగులు కూడుకున్న ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

హరిచరణ్, దివ్యాసింగ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం - అజయ్ పట్నాయక్, కెమెరామ్యాన్ - గౌరి రమేష్, దర్శక, నిర్మాత - శ్రీని బొగడపాటి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved