pizza
Kalyana Vaibhogame release on 4 March
మార్చి 4 న విడుదల కాబోతున్న నాగశౌర్య , మాళవిక నాయర్ లతో శ్రీ రంజిత్ మూవీస్ " కళ్యాణ వైభోగమే "
You are at idlebrain.com > news today >
Follow Us

16 February 2016
Hyderaba
d

'అలా మొదలైంది',' అంతకు ముందు ఆ తరువాత ' వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలను నిర్మించిన ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై నిర్మాత కె.ఎల్ . దామోదర్ ప్రసాద్ ' బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే "

నందిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించిన విషయం విదితమే.

ఈ చిత్రాన్ని మార్చి 4 న విడుదల చేయనున్నట్లు నిర్మాత కె.ఎల్ . దామోదర్ ప్రసాద్ తెలిపారు. తమ సంస్థ నిర్మించిన 'అలా మొదలైంది',' అంతకు ముందు ఆ తరువాత ' చిత్రాల స్థాయిని మించి ఈ " కళ్యాణ వైభోగమే " చిత్రం చక్కని విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు. దానికి కారణం చిత్ర కధ ,కధనం,సంగీతం , సంభాషణలు, ఛాయాగ్రహణం ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయని అన్నారు. ప్రముఖ పంపిణీదారులైన 'అభిషేక్ పిక్చర్స్' తమ " కళ్యాణ వైభోగమే చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని నిర్మాత కె.ఎల్ . దామోదర్ ప్రసాద్ తెలిపారు.

ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం " కళ్యాణ వైభోగమే " అని దర్శకురాలు బి.వి నందిని రెడ్డి తెలిపారు. చిత్రం ఆడియో విజయం చిత్ర విజయం పై మరింత నమ్మకాన్ని పెంచిందని తెలిపారు.

నటీనటులు :
నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు ..

సాంకేతిక నిపుణులు :
సంగీతం : కళ్యాణ్ కోడూరి
సినిమాటోగ్రఫీ : జి . వి . ఎస్ . రాజు
ఎడిటర్ : జునైద్ సిద్దిక్
కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని
యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు
కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి
డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్
కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి
ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్
స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved