pizza
Kanchana movie going to be remade by “RAMA” in China,korea and thai
విదేశాలలో రామ సంస్థ ద్వారా హల్‌చల్‌ చేయనున్న లారెన్స్‌ 'కాంచన'
You are at idlebrain.com > news today >
Follow Us

25 December 2015
Hyderabad

We all know Raghava Lawrence acted and directed kanchana movie became a huge success in IndiaFilm Industry. It’s sets many records at box office.This movie is going to be remade in 3 different languages.

This movie will be remade in Chinese, Korean and Thai languages. The group chairman of “RAMA”PudhotaSudheer Kumar (Mr.John)has informed that this is first time; that a south movie will be remade in other countries.And we are producing five more films,in which one has completed censor in kanaada and other waiting for censor in telugu. Third one with sumanth as hero and co-producer finished 1stschudle, 4th movie with sivanageshwar Rao as director which commenced shooting on 21st of December at amalapuram and fifth with kanchi which will start shooting in January 2016

Source Movie: RaghavaLawrence‘s “KANCHANA “
REMAKE LANUAGES : CHINA , KOREAN and THAI
BANNER: RAMA
CHAIRMAN: Pudhota . Sudheer Kumar (JOHN)

రాఘవ లారెన్స్‌ నటించి దర్శకత్వం వహించిన 'కాంచన' చిత్రం చైనీస్‌, కొరియన్‌ మరియు థాయ్‌ భాషల్లో నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం సౌత్‌లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం విదేశీ ప్రేక్షకులను సైతం అలరించేందుకు సిద్ధమవుతోంది. రామ సంస్థ అధినేత పూదోట సుధీర్‌కుమార్‌(మిస్టర్‌ జాన్‌) చైనా, కొరియన్‌, థాయ్‌ భాషల్లో రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ''లారెన్స్‌, రాయ్‌లక్ష్మి, శరత్‌కుమార్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన 'కాంచన' చిత్రం ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. సౌత్‌ సినిమా ఇతర భాషల్లో రీమేక్‌ కాబోతుండడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం మా బ్యానర్‌కు దక్కినందుకు ఆనందంగా ఉంది'' అని చెప్పారు.

ప్రస్తుతం రామ సంస్థ కన్నడలో నిర్మించిన ఓ సినిమా సెన్సార్‌ కార్యకమ్రాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తెలుగులో ఓ సినిమా సెన్సార్‌ దశలో ఉంది. మూడవ చిత్రంగా సుమంత్‌ హీరోగా, ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రెండో షెడ్యూల్‌లో ఉంది. శివనాగేశ్వరరావు దర్శకుడిగా ఈ నెల 21న ఓ సినిమా అమలాపురంలో ప్రారంభమైంది. నూతన సంవత్సరం కానుకగా ఎస్‌.ఎస్‌. కాంచి దర్శకత్వంలో ఇంకో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇంకా ఈ రామ సంస్థ ద్వారా నిర్మాత పూదోట సుధీర్‌కుమార్‌(మిస్టర్‌ జాన్‌) మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved