pizza
Kanche Audio on September 17th in Visakhapatnam 
You are at idlebrain.com > news today >
Follow Us

11 September 2015
Hyderabad

The audio album of the upcoming period drama 'Kanche' will be out on September 17th, on the occasion of Vinayaka Chavithi. The audio launch ceremony will be held in the city of Visakhapatnam, at the beautiful Port Stadium complex. A number of guests and the film unit will be a part of the event.

Visakhapatnam has a unique connection to World War 2. The city was the target of a Japanese Air raid and a number of bombs were dropped on the port city, to target Allied warships. A bomb failed to explode and it is still present in a museum in Visakhapatnam. 'Kanche' is set against the backdrop of World War 2, with Varun Tej playing the role of an Indian solider in the British Army. The team therefore selected the city of Visakhapatnam for the audio launch.

Bollywood music director Chirantan Bhatt has composed the tunes for this film and well known writer Sirivennela Sitarama Sastry garu has penned all the songs in this movie. This big budget film is going to hit the screens on October 2nd.

Well known model Pragya Jaiswal is playing the lead role opposite Varun in this movie. Jagarlamudi Sai Babu and Rajiv Reddy are producing the film on First Frame Entertainments banner. Aditya Music will be releasing the music into the market

విశాఖపట్నం లో కంచె ఆడియో విడుదల

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.

కంచె ఆడియో ను విశాఖపట్నం లో వినాయక చవితి సందర్భం గా సెప్టెంబర్ 17 వ తేదీన పోర్ట్ స్టేడియం లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది. ప్రముఖ అతిధుల సమక్షం లో ఎంతో అట్టహాసం గా ఈ చిత్రం ఆడియో కార్యక్రమం జరగనుంది. రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్ దేశ యుద్ధ విమానాలు విశాఖపట్నం మీద దాడి చేసిన సంగతి బహుశా చాలా మందికి తెలిసిన విషయమే. కంచె చిత్రం కూడా రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యం లో సాగుతుండటం తో , ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఇక్కడ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది.

కంచె చిత్రం లోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అధ్భుతం గా రచించారని నిర్మాతలు రాజీవ్ రెడ్ది మరియు జాగర్లమూడి సాయి బాబు తెలిపారు .ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది

అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తం గా కంచె చిత్రం విదుదల అవుతుంది అని, వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మయిలు రాయి గా నిలుస్తుంది అని దర్శకులు క్రిష్ జాగర్లమూడి తెలిపారు. కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు .

భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved