pizza
Karam Dosa in December
డిసెంబ‌ర్‌లో త్రివిక్రమ్ `కారందోశ`
You are at idlebrain.com > news today >
Follow Us

25 November 2016
Hyderaba
d

``ఏదో పెద్దగా చేసెయ్యాలి. ఇర‌గ‌దీసెయ్యాలి. ఇంకేదో సాధించేయాలి..అని క‌ల‌లు కంటూ క్లారిటీ మిస్స‌వుతోంది నేటి యువ‌త‌రం. మాట‌లు త‌గ్గించి చేత‌లు చూపించండి గురూ... ఒళ్లొంచి ప‌నిచెయ్యండి. సెల్ఫ్‌కి, స‌మాజానికి ప‌నికొస్తారని చెబుతున్నా``మ‌న్నారు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌.జి. శివ రామచంద్రవరపు, సూర్య శ్రీ‌నివాస్‌, చంద‌న నాయ‌కానాయిక‌లుగా వీణావేదిక ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై త్రివిక్ర‌మ్‌.జి తెర‌కెక్కించిన‌ సినిమా -`కారందోశ‌`. డిసెంబ‌ర్‌లో రిలీజ్ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కనిర్మాత‌లు మాట్లాడుతూ -``చాలా సరదాగా సాగిపొయ్యే అర్థవంతమయిన కథతో ఈ సినిమాని తెర‌కెక్కించాం.ఇటివలే రిలీజ్ చేసిన ఆడియో, టీజర్ కి మంచి స్పందన వస్తోంది.పోస్ట్ ప్రొడక్షన్ , సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. వంకాయలసత్యనారాయణ, కాశీవిశ్వనాథ్ ఇత‌ర‌ ప్రధాన పాత్రలలో న‌టించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ : సురేష్, కెమెరా : రాజభట్టాచార్య‌, సంగీతం : సిద్దార్థ్ వాట్కిన్స్, సాహిత్యం : శ్రీరామ్ , నేపద్య సంగీతం : దేవ్ గురు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved