pizza
Karthikeya about Prematho Mee Karthik
తొలి సినిమా అనుభవాన్ని మరచిపోలేను - కార్తికేయ
You are at idlebrain.com > news today >
Follow Us

15 November 2017
Hyderabad

రవుణ శ్రీ గువ్ముకొండ, గీతా వున్నం సవుర్పణలో రవుణ శ్రీ ఆరట్స్ బేన్ప కార్తీకేయు, సివ్రుత్ హీరో హీరోరుున్లుగా రూపొందిన చిత్రం ‘ప్రేవుతో మీ కార్తీక్’. రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్.గువ్ముకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మీడియాతో సినిమా గురించిన విశేషాలను తెలియుజేస్తూ..‘‘నాకు చిన్నప్పట్నుంచి హీరో కావాలని పెద్ద కోరిక ఉండేది. బి.టెక్ చదివే రోజుల్లో షార్ట్ ఫిలింస్‌లో నటించేవాడిని. బి.టెక్ ఫైనల్ ఇయుర్‌కు రాగానే నా ఫోర్ట్ ఫోలియో తయారు చేసుకుని సినిమా వారిని కలుస్తుండేవాడిని. బి.టెక్ పూర్తయిన తర్వాత సుబ్బారావుగారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాను. అలాగే డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాను. రోల్స్ కాకుండా హీరోగానే చేయాలని అనుకుంటువాడిని. ప్రయుత్నాలు ఆ దిశగా సాగుతున్న తరుణంలో నిర్మాైతెన మా బాబాయ్ నన్ను పిలిచి..రిషిగారిని వెళ్లి కలవమని అన్నారు. నేను ఆయన్ను కలిశాను. ఆయన స్క్రిప్ట్ వినిపించారు. నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అంతా ఓకే అనుకున్న తర్వాత సినిమా ప్రారంభం అయ్యింది. యు.ఎస్‌లో పుట్టి పెరిగిన కార్తీక్ అనే అబ్బాయి ఏ ఎమోషన్స్ లేకుండా పెరిగి పెద్దవుతాడు. ఎప్పుడు తన గురించి, తన వ్యాపారం గురించి ఆలోచిస్తుంటాడు కార్తీక్. ఒక అనుకోని ఘటనతో..కార్తీక్ ఇండియాకు వచ్చేస్తాడు. అక్కడ అతనికి ఓ ప్రియురాలు, ప్రేమ, స్నేహితులు ఇలా అందరూ దగ్గరవుతారు. ఇలా కార్తీక్ జీవిత ప్రయాణమే ఈ చిత్రం. గొల్లపూడి మారుతీరావుగారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు కానీ, ఆయున షూటింగ్ చేసిన సవుయంలో..సెట్స్‌లో గడిపాను. ఆయనలాంటి నటుడు మా సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన నుండే సినిమా మొదలవుతుంది. సత్య ఫస్ట్‌ైటెమ్ డైరెక్టర్‌లా సినిమాను డైరెక్ట్ చేయులేదు. అనుభవమున్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించారు. మంచి ఎమోషనల్ సబ్జెక్ట్‌ను చక్కగా హ్యాండిల్ చేశారు. నటన పరంగా ఎక్కగా కాంప్రైమెజ్ కాలేదు. ఆయునకు కావాల్సిన అవుట్‌పుట్‌ను రాబట్టుకున్నారు. గొల్లపూడి తర్వాత మురళీశర్మగారితో కూడా నటించడం ఆనందంగా ఉంది. సీనియర్ నటులతో చేయడం వల్ల నా నటన పరంగా మరింత అనుభవం వచ్చినట్లయ్యింది. షాన్ రెహమాన్‌గారు మలయాళంలో ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్..ఆయన తన మ్యూజిక్, రీరికార్డింగ్‌తో సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమా అనుభవాన్ని నేను మరచిపోలేను. అలాగే సినిమా సక్సెస్ నాకు పెద్ద బోనస్ అవుతుంది’’ అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved